Tuesday, November 26, 2024

సాయి మాటల వెనుక పరమార్థం

అవతారమూర్తి సద్గురు సాయినాథుడు. ఆయన్ను ప్రత్యక్షంగా చూసి తరించిన వారు ధన్యులు. బాబాతో సన్నిహతంగా మెలిగే అవకాశం పొందినవారు, ఆ పుణ్యమూర్తి సాంగత్యం పొందివారు అదృష్టవంతులు. ఆయన నడయాడిన నేలమీద సమకాలంలో జీవించిన షిరిడీ ప్రజల జీవితం ధన్యం.
షిరిడీ ప్రజలందరూ సాయిబాబాను భక్తితో కొలిచేవారు. సాయి భక్తులలో కొందరు బాబాతో అతి సన్నిహితంగా వుండేవారు. వారిలో మహల్సాపతి, తాత్యాకోతే పాటిల్‌ తదితరులు బాబాతో మరింత సన్నిహతంగా గడిపారు. వారి ద్వారా సాయిబాబాకి సంబంధించిన విషయాలు తెలుసుకునే అవకాశం కలిగింది.
సాయిబాబా దర్శనానికై షిరిడీకి వచ్చిన భక్తులు తిరిగి వెళ్లేముందు బాబా అనుమతి తీసుకుని వెళ్ళేవారు. ఆయన సమ్మతిస్తేనే వెళ్ళాలి. బాబా గనుక ”ఇప్పుడు వద్దు” అని చెప్పినా పట్టించుకోకుండా, ఆయన మాటను తేలిగ్గా తీసుకుని వెళ్ళిన భక్తులకు ఏవో ఆటంకాలు కలిగి వెనుదిరిగి రావలసి వచ్చేది.
ఒక్కోసారి ప్రమాదాల బారిన పడేవారు. తన భక్తులు ఇబ్బం దుల పాలు కాకూడదనే ఉద్దేశంతోనే కొన్నిసార్లు బాబా వారిని అడ్డగించేవారు. అది గ్రహంచక ఏదో ముఖ్యమైన పని ఉం దంటూ వెళ్ళి, కష్టనష్టాలు కొనితెచ్చుకునేవారు. అలా ఆపదలు ఎదురైనప్పుడు గానీ, బాబా ఎందుకు వద్దన్నారో గ్రహంచేవారు కాదు. బాబా మాటలమీద గురి ఉన్నవారు మాత్రం, ఆయన చెప్పినట్లు విని నిశ్చింతగా ఉండేవారు.
సాయిబాబా షిర్డీ వదిలి ఎక్కడికీ వెళ్ళేవారు కాదు. ఎప్పుడైనా వెళ్తే షిర్డీకి ఉత్తరాన ఉన్న నీంగావ్‌, దక్షిణాన ఉన్న రహతా గ్రామాలకు మాత్రం వెళ్ళి వచ్చేవారు. ఈ రెండు ఊళ్లకు తప్పించి సాయిబాబా మరెక్కడికీ ఎప్పుడూ వెళ్ళలేదు. బాబా ఎన్నడూ రైలు ఎక్కలేదు. ఇంకా చెప్పాలంటే రైలును చూడను కూడా లేదు. కానీ, రైళ్ళ రాకపోకల వేళలను, వాటి వివరాలను భక్తులకు వివరించి చెప్పేవారు. ఎవరు ఎక్కడికి వెళ్ళాలో, దారిలో ఎవరు ఎదురౌతారో కూడా చెప్పేవారు. ప్రయాణంలో ఎదురయ్యే కూడా బాబా తన భక్తులకు ముందుగానే చెప్పి హెచ్చరించేవారు. ఆయన ఏది చెబితే అది అక్షరాలా జరిగేది.
సాయిబాబా మసీదులోనే కూర్చుని, ఎక్కడెక్కడ ఏం జరిగిందీ, ఏమి జరగబోతున్నదీ చక్కగా చెప్పేవారు. బాబా ఒక్కోసారి చిత్రవిచిత్రమైన సైగలు చేసేవారు. కొన్నిసార్లు పెద్దపెద్దగా కేకలు వేసే వారు. ఇంకొన్నిసార్లు తనను తానే వీపు మీద చరుచుకునేవారు.
మరికొన్నిసార్లు పక్కనున్న భక్తులను విసుక్కునేవారు. అలాంటి సందర్భంలోనే ఒకసారి బాబా తాత్యా తలపాగాను తీసి మండుతున్న ధునిలో వేశారు. ఆ తర్వాత కోపం తగ్గి శాంతించిన బాబా జరీ కుచ్చుల తలపాగాను తెప్పించి తానే స్వయంగా తాత్యా తలకు చుట్టారు. బాబాగారి ఇలాంటి చేష్టలు ఒక్కోసారి ”పిచ్చి పకీరు” అనిపించేలా ఉండేవి. బాబా ప్రవర్తన కొన్నిసార్లు భయపెట్టేలా కూడా ఉండేది. కానీ, వాటి వెనుక ఏదో గూఢార్ధం ఉండేది. కొద్దిసేపటికి బాబా శాం తించేవారు. భక్తులకు బాబా ఎందుకలా చేస్తున్నారో ఎంత మాత్రం అర్ధమయ్యేది కాదు. దూరాన ఉన్న భక్తులు ఆకస్మిక ప్రమాదాల్లో చిక్కుకున్నప్పుడు, వారిని కాపాడే ప్రయత్నంలో బాబా అలా చిత్రంగా ప్రవర్తించేవారు.
బాబా ఆ సంగతి చెప్పినప్పుడు పక్కనున్నవారికి ఆశ్చర్యంగానే ఉండేది. నమ్మశక్యం కానట్లు చూసేవారు. కానీ, కొద్దిసేపటికే తమను కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ వచ్చిన భక్తులను చూశా క, బాబా ఇక్కడే ఉండి, కష్టాల్లో చిక్కుకున్న వారిని ఆదుకున్న తీరు వారిని మరింత ఆశ్చర్యచకితులను చేసేది. మసీదులో ఓ మూల కళ్ళు మూసుకుని కూర్చుని మ#హనంతటినీ చూడగల మహమాన్వితుడు సాయిబాబా.
సాయిబాబాను చేరువగా చూసిన వారిలో కూడా అందరికీ ఆయన బోధనలు, వారి చేష్టలు, ప్రవర్తన అర్ధమయ్యేవి కావు. షిరిడీ ప్రజల్లో, ఇతర గ్రామాల నుంచి వచ్చిన వారిలో చాలా తక్కువ మంది మాత్రమే బాబా మాటల్లోని అంతరార్ధాన్ని, నిగూఢత్వాన్ని గ్రహించ గలిగేవారు చాలామంది గ్రహంచేవారు కాదు. అర్థం చేసుకునేవారు కాదు. కొందరు మాత్రమే బాబాను పరిపూర్ణంగా అర్ధం చేసుకుని తూచ తప్పకుండా అనుసరించేవారు. వారిని బాబా అనుక్షణం కనిపెట్టుకుని ఉండేవారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement