Friday, November 22, 2024

సాయి ఆజ్ఞే శిరోధార్యం!

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, భక్త జన సంరక్షణ కోసం భగవంతుడు అనేక కాలాలలో వివిధ రూపాలలో అవతరిస్తాడని ఇంతకుముందు తెలుసుకున్నాం. కానీ దత్తాత్రేయ స్వరూపమైన సద్గురువుల కర్తవ్యం ఇందుకు భిన్నంగా వుం టుంది. దుర్మార్గులకు హృదయ పరివర్తన గా వించి సన్మార్గంలో పయనింపజేస్తారు. హృద యంలో అజ్ఞానాంధకారములను తరిమికొట్టి జ్ఞాన జ్యోతులను వెలిగింపజేస్తారు. శ్రీ సాయినా థులు సాక్షాత్తు పరిశుద్ధ, పరమేశ్వర, పరబ్రహ్మ అవతారం. పేద, గొప్ప, కుల, మత, ప్రాంతీయ, వర్గ వైషమ్యాలు లేక అందరినీ సమానంగా ప్రే మించే వారు. తన అపారమైన అనుగ్రహాన్ని అర్హు లందరిపైనా ప్రసరింపజేసి అందరికీ ఆనందమ యమైన జీవితం ప్రసాదిస్తుండేవారు. బాబా వా రి విశిష్టత ఏమిటంటే ఎవరైనా తామంతట తాముగా సంకల్పించి ప్రయత్నాలు చేసుకున్నా శిరిడీ రాగలిగేవారు కాదు. కేవలం బాబా గారి సంకల్పం ద్వారా మాత్రమే సిద్ధించేది. అట్లే శిరి డీని విడిచిపోవడం కూడా బాబా గారి ఆజ్ఞానుసా రమే జరిగేది. సర్వం బాబా వారి ఇష్టం పైనే ఆధా రపడి వుండేది. ఇందుకు సంబంధించిన కొన్ని లీలలను ఈ క్రింద స్మరించుకుందాం.
కాకా మహాజని అనే ఆయన బొంబాయి నుండి శిరిడీ వెళ్ళాడు. అక్కడ ఒక వారం రోజు లు వుండి గోకులాష్టమి ఉత్సవాన్ని తిలకించి తిరి గి బొంబాయి వెళ్లాలని ప్లాను వేసుకున్నాడు. అయితే అతను ఒకటి సంకల్పిస్తే బాబా మరొకటి సంకల్పించారు. బాబాను దర్శించిన వెంటనే ”బొంబాయి ఎప్పుడు తిరిగి వెళ్తున్నావు” అని అడిగారు. అందుకు మహాజని కించిత్‌ ఆశ్చర్య పోయి ”మీరెప్పుడు సెలవిస్తే అప్పుడే బాబా” అని చెప్పాడు.” అయితే రేపే తిరిగి బయలుదేరు” అ ని ఊదీ ప్రసాదాలనిచ్చి బాబా అతనిని ఆశీర్వదిం చారు. బాబా ఆజ్ఞను శిరసా వహంచి కాకాని మహాజని మర్నాడే బయలుదేరి వెళ్ళిపోయా డు. బొంబాయికి చేరి ఆఫీసుకు వెళ్ళగానే కంపెనీ మేనేజర్‌ వేయి కళ్ళతో అతని కోసం ఎదురు చూ స్తున్నాడు. ఆఫీసు ఇన్‌చార్జి హఠాత్తుగా జబ్బు పడడంతో కంపెనీ వ్యవహారాలు చూసేవారే లేకపోయారు. మహాజని కోసం మేనేజరు భగవంతుడిని స్మరిస్తూ ఎదురుచూస్తు న్నాడు. శ్రీ సాయి యొక్క సర్వజ్ఞ త్శత్వా నికి కాకా మహాజని ముదమొందాడు.
మరొక సందర్భంలో ధుమాల్‌ అనే ఒక లాయర్‌ కోర్టు పనిమీద నిఫాడ్‌ వెళ్తూ మధ్య మార్గంలో శిరిడీలో దిగి బాబా దర్శనం చేసుకున్నాడు. మర్నా డు నిఫాడ్‌ కోర్టులో వాదించవల్సిన ము ఖ్యమైన కేసు వుండడం వలన తక్షణమే బయలు దేరడానికి శ్రీ సాయి అనుజ్ఞ వేడాడు. కాని సాయి మాత్రం ”ఏమా త్రం తొందర పడవద్దు, హాయిగా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని వెళ్దువు గా ని” అని అతనికి పర్మిషను ఇవ్వలేదు. బాబా ఆజ్ఞ శివాజ్ఞతో సమానం. దానిని శిరసా వహంచి ధుమాల్‌ ఈ కేసును వాదించుకోవదానికి ఇంకెవరినైనా చూ సుకొమ్మని తన క్లయింటుకు టెలెగ్రాం పంపి తాను శిరిడీలో విశ్రాంతి తీసుకు న్నాడు. ప్రతీ రోజూ బాబా దర్శనం, సత్సంగం, పూజాది కార్యక్రమాలలో పాల్గొంటూ అధ్యాత్మిక ఆనందం అను భవించాడు. వారం రోజుల తర్వాత సాయి అతనికి శిరిడీ విడువడానికి అనుజ్ఞ ఇచ్చారు. బాబా ఆశీర్వాదములను పొంది నిఫా డుకు ధుమాల్‌ వెళ్ళగా అక్కడ మెజిస్ట్రేట్‌కు అనా రోగ్యం కారణంగా కేసు వాయిదా పడిందని తెల్సింది. ధుమాల్‌ నిఫాడ్‌ చేరిన మర్నాడే కేసు విచారణకు వచ్చింది. కొన్ని నెలల పాటు జరిగిన విచారణలో ధుమాల్‌ వీరోచితంగా పోరాడి చివరకు కేసును గెలిచాడు.
మనకు జీవితంలో ఏం కావాలో, ఎప్పుడు ఏది ఎలా జరిగితే మనకు మంచి చేస్తుందో, మనము జీవితంలో ఎటువంటి లక్ష్యాలను ఎం చుకోవాలో మనకంటే శ్రీ సాయికే ఎక్కువ తెలు సునని, ఆయన ఆజ్ఞ సంకల్పమే మనకు శిరోధా ర్యమని సాయి లీలల ద్వారా మనకు అవగత మౌతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement