ఈ కలియుగంలో మానవుడు ప్రతీ క్షణం తెలిసో, తెలియ కో ఎన్నో పాపాలు చేస్తూ వుంటా డు. ధనార్జనే పరమావధిగా బ్రతుకు తూ, కలియుగం ప్రభావం చేత తన దైనందిన జీవితంలో దైవానికి, గురు వుకు స్థానం లేకుండా చేసేసుకున్నా డు. తత్ఫలితంగా ఎన్నో సమస్యలకు, అశాంతికి, ఆందోళనలకు గురవుతు న్నాడు. కాని గురువుకు సర్వస్య శర ణాగతి చేసినవారు మాత్రం ఆ గురు వు అపూర్వ కరుణా కటాక్షాలకు పాత్రు లగుతూ ఎంతో సంతోషకరమైన జీవితం అనుభవిస్తున్నారు. అంటే దీనర్ధం గురువు భక్తు లకు చింతలు, సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు వుండవని కాదు. కల్లోల కడలిలో కృంగిపోతున్నా, తన భక్తులను ఆ గురువే వచ్చి రక్షించి, వారిని ఈ సంసారమనే కడలి నుండి సురక్షితంగా ఒడ్డుకు చేరుస్తాడు.
ఆ సద్గురువును మనసా, వాచా, కర్మణా నమ్ము
కున్నవారు మరింక ఏ విషయం గురించి ఆలోచించ నవసరం లేదు. హాయిగా తమ బరువు బాధ్యతలను ఆ సద్గురువు పాదాలకు అప్పగించి నిశ్చింతగా వుండవ చ్చు. ఈ సత్యాన్ని గ్రహించిన వారు ధన్యులు. మిగతా వారు మాత్రం అనుక్షణం ఆ బరువు బాధ్యతలను మో యలేక మోస్తూ, కృంగిపోతూ వుంటారు.ఈ కలియుగంలో ఆ సద్గురువుకు సర్వస్య శరణా గతి చెయ్యడమే సాధనమని తెలుసుకున్నాము కదా! అట్లే సద్గురువు యొక్క బోధలే మనకు వేద శాస్త్రాలు. ఆయన చెప్పిన మార్గమే మనకు అనుసరణీయం. తన భక్తులకు సమర్ధ సద్గురువైన సాయి ఎన్నో బోధలను చేస్తుండేవారు. ఆయనకు బోధలను చేయడానికి ప్రత్యేక సమయం కాని, స్థలం కాని, సమయం కాని అవసరం లేకుండేది. సందర్భావసరముల బట్టి వారి ప్రబోధము నిరంతరం జరుగుతూ వుండేది. ఒకనాడు ఒక భక్తుడు మశీదులో తన తోటి భక్తుని గురించి విమర్శించసాగా డు. ఆ తోటి భక్తుడు చేసిన మంచి పనులను విడిచి అతడు చేసిన తప్పుల గురించి తీవ్ర పదజాలంతో ఘా టైన విమర్శలను చేయసాగాడు. ఆ దూషణలను విన్న ఇతరులు విసిగిపోయారు. ఆర్త భక్త జన పరాయణుడైన సాయి సన్నిధిలో ఇటువంటి విమర్శలు ఏల అని మన స్సులో బాధపడసాగారు. ఆ భక్తుడు తన తోటి భక్తుడిని విమర్శిస్తూ ఎంతటి పాపం మూటకట్టుకుంటున్నారో సర్వజ్ఞుడైన సాయి గ్రహించారు.
ఆ మధ్యాహ్నం శ్రీ సాయి లెండీ తోటకు వ్యాహ్యా ళికి వెళ్ళే సమయంలో ఆ భక్తుడు బాబాను దర్శించి ప్రణామం చేసాడు. అప్పుడు శ్రీ సాయి మలమును తింటున్న ఒక పందిని చూపించి ”చూడు నాయనా! అమేధ్యాన్ని ఎంతో ప్రీతిగా తింటున్న ఆ పందిని చూ డు. నీ ప్రవర్తన, స్వభావము కూడా అంతే. ఎంత ఆనం దంగా నీ సాటి సోదరుని తిడుతున్నావు? జంతూనాం నరజన్మ దుర్లభం. కోటి జన్మలలో ఎంతో పుణ్యం చేయ గా నీకీ అరుదైన మానవ జన్మ లభించింది. దీనికి సార్ధ కత చేకూర్చడానికి ప్రయత్నించాలి గాని ఈ విధమైన దూషణలను చేస్తూ ఎందుకు కొండంత పాపాన్ని మూట కట్టుకుంటున్నావు?” సాయి మాటలతో ఆ భక్తు నికి తన తప్పు తెలిసి వచ్చింది. వెంటనే క్షమించమం టూ శ్రీ సాయి పాదాలపై పడ్డాడు. శ్రీ సాయి అప్పుడు తన బోధను ఈవిధంగా కొనసాగించారు.
”చూడు నాయనా! ఇతరులను విమర్శించువా డు, దూషణములను చేయువాడు ఒకవిధంగా తాను నిందించువానికి సేవ చేస్తున్నాడు. అది ఎట్లనిన, ఇత రులను నిందించడమంటే వారి శారీరక మలినము లను తన నాలుకతో నాకి శుభ్రపరచడంతో సమానం. ఇట్టి అపరిశుభ్రమైన కార్యములను చేయడం నీకు తగునా? భగవంతుని సృష్టిలో అందరూ సమానులే! ఆ కుల, మత, జాతి, వర్ణ వైషమ్యాలను మనము సృష్టిం చుకున్నాము.
ఎవరి పూర్వజన్మ సంస్కారములను బట్టి వారు జీవితంలో ప్రవర్తించడం జరుగుతుంది. వారి ప్రవర్తన మనకు నచ్చనంత మాత్రాన, వారిని విమర్శించడం తగదు. ఇతరులను దూషించడం భగవంతుని దూషణ తో సమానం. ఒకరు ఇంకొకరిని దూషిస్తే నాకెంతో బాధ కలుగుతుంది, కనుక ఆ పనులను ఇక మీదట చేయ వద్దు” మానవ ప్రవర్తనపై శ్రీ సాయి ఎంతటి అపూర్వ మైన దివ్య బోధను చేసారో చూడండి. అనుక్షణం అసూ యాద్వేషాలతో రగిలిపోతూ, పరులలోనూ ఆ పరమా త్మే వున్నాడన్న వేదసత్యాన్ని విస్మరించి, ఇతరులను విమర్శించడమే పనిగా పెట్టుకుంటున్న మనకు ఈ సం దేశం చిరస్మరణీయం, సదా అనుసరణీయం.
ఆ పరిశుద్ధ పరమేశ్వర అవతార స్వరూపునికి ప్రణమిల్లుదాం. సాయి రూపాన్ని మనసులో నింపు కుందాం. ఆ దివ్య సందేశాన్ని మనసులో పదిల పరచు కొందాం. సాయి ఆదేశానుసారం నడుచుకుంటూ ఆ ప్రకారంగా జీవిద్దాం. సాయి అనుగ్రహ, కటాక్షముల కు పాత్రులమవుదాము.
- సిహెచ్.ప్రతాప్, 9136827102