Monday, November 18, 2024

సదా రక్షణ కవచం… చాలీసా!

ఈ రోజు వైశాఖ బ#హుళ దశమి. నేడు ”హనుమ” (ఆంజనేయస్వా మి) జయంతి. ఈరోజు రామనామ జపం అత్యంత విశిష్టమైనది. మాన సిక రోగులు, గాలి, భూత పిశాచ బాధ లున్నవారు ఆంజనేయస్వామి ఆల యం చుట్టూ నియమానుసారంగా 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే స్వస్థత చేకూ రుతుందని శాస్త్రోక్తి. హనుమాన్‌ చాలీ సా, హనుమచ్చరిత్ర, సుందరకాండ పా రాయణం విశేష ఫలప్రదం. ఈరోజు హ నుమాన్‌ చాలీసా ఏకధాటిగా 108 సార్లు పారాయణ చేయడం చాలా మంచిది. స్వా మి అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది. నేడు హనుమ జయంతి సందర్భంలో మనం నిత్యం ఆలపించే ”హనుమాన్‌ చాలీసా” మనకు అందుబాటులోకి వచ్చిన కథనాన్ని స్మరించుకుందాం.
గోస్వామి తులసీదాసు 16వ శతాబ్దంన కు చెందిన గొప్ప రామభక్తుడు. కాశీలోని గం గానది ఒడ్డున ఆశ్రమం నిర్మించుకుని ”శ్రీరా మ చరిత మానస్‌” అనే గ్రంథాన్ని రోజూ ప్రజ లకు వినిపించేవాడు. నిరతరం శ్రీరామ నామా న్ని స్తుతి చేస్తూనే ఉండేవాడు. మనకు ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని, సంపదను, శ్రీ రామ స#హత ఆంజ నేయస్వామి అనుగ్రహాన్ని కలిగించేది ”#హను మాన్‌ చాలీసా” మాత్రమే.

#హనుమాన్‌ చాలీసా ఆవిర్భావం

రోజూ లాగే తులసీదాసు తన ఆశ్రమంలో రామ నామ జపంలో నిమగ్నమై ఉండగా, ఒక యువతి చాలా దు:ఖంతో ఆశ్రమంలోకి ”కాపా డండి!” అంటూ ప్రవేశించి, తులసీదాసు కాళ్ళ మీద పడి దు:ఖిస్తోంది. తులసీదాసు ఆమెను చూడగా నుదుట బొట్టు, చేతికి గాజులు, మంచి యవ్వనంలో ఉంది. వెంటనే తులసీ దాసు ఆమెను ”దీర్ఘ సుమంగళీ భవ” అని ఆశీ ర్వదించగానే, ఆమె ”ఇంకెక్కడి సుమంగళి ని? నా భర్త మరణించాడు ఈ దారిలోనే ద#హనానికి తీసుకుని వెళుతున్నారు” అని చెప్పగానే, తులసి దాస్‌ ”నా మాట శ్రీరాముని అనుగ్రహం వల్ల వచ్చింది. ఊరికే పోదు” అంటూ శవాన్ని వెనక్కి తెప్పించి, తన కమండలంలోని నీటితో శవాన్ని మంత్రంతో సంప్రోక్షణచేయగా, అతను లేచి కూ ర్చున్నాడు. ఇది కాశీ అంతట వ్యాపించింది.
అప్పటికే, మహమ్మదీయులు చాలామంది తులసీదాసుపై ఆగ్ర#హంతో ఉన్నారు. ఇదే అదును గా తీసుకుని అక్బర్‌ పాదుషా వారికి లేనిపోని కల్పిం చి చెప్పేసరికి, పాదుషా వారికి కోపం వచ్చి, తులసీ దాస్‌ను దర్భార్‌కు పిలిపించి-
”తులసీదాస్‌ గారు! చాలా గారడీలు చేస్తున్నా రుట. మరణించిన వారిని బ్రతికిస్తున్నారుట. అయితే నేను ఒక శవాన్ని తెప్పిస్తాను. బ్రతికించం డి! చూద్దాం!” అనగానే ”తులసీదాస్‌ మరణమనే ది జీవులు చేసుకొనే కర్మల ద్వారా ఏర్పడుతుంది. దైవ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ప్రభూ! అనగానే, పాదుషా వారు కోపంతో తమ సైనికులకు కొరడాతో కొట్టమని ఆజ్ఞాపించారు. వెంటనే సైనికు లు ప్రారంభించగానే, తులసీదాసు రామనామాన్ని జపిస్తూనే ఉన్నాడు. ఎక్కడి నుండి వచ్చాయో? చా లా కోతుల గుంపు వచ్చి, కొరడాతో కొడుతున్న సైని కులపై బడి, రక్కుతుంటే భయపడ్డారు. అది చూసి న తులసీదాస్‌ ఆనందంతో ”హనుమాన్‌ చాలీసా” ను అప్రయత్నంగానే స్తుతించాడు.
చాలీసా అంటే నలభై. హనుమాన్‌ చాలీసా నలభై ద్విపదతో ఉంటుంది కదా. ఎదురుగా సింహ ద్వారం వద్ద ఆంజనేయస్వామి కనిపించేసరికి తుల సీదాస్‌ చాలా సంతోషించాడు.
అప్పుడు హనుమ ”తులసీ! నువ్వు గానం చేసి న ఈ చాలీసా ఎవరు స్తుతిస్తుంటారో, వారిని నేను సదా కాపాడుతూ ఉంటాను.” అని వరం ఇచ్చాడు. ఇదంతా చూసిన పాదుషా వారు, దర్బార్‌లోని వా రు ఆశ్చర్యపోయారు. తులసీదాస్‌ గొప్పతనం, శ్రీ రామ నామ మ#హమ అర్థమైన పాదుషా వెంటనే తులసీదాసు కాళ్ళమీద పడి క్షమించమని కోరా డు.

తులసీదాస్‌కు శ్రీ రామ దర్శనం

తన ఆశ్రమంలో ప్రతీ రోజూ సాయంత్రం ఆహుతులైన వారందరికీ తాను రచించిన శ్రీరామ చరిత మానస్‌ అనే గ్రంథంలోని విషయాలు విశిద పరుస్తూ ఉండేవాడు. కాని మనసులో శ్రీరాముని దర్శనం కలగాలనే కోరిక చాలా బలంగా నాటుకు పోయింది. ఒకరోజు తులసీదాసు తన అనుష్టానం అనంతరం జలాన్ని ఆశ్రమ ప్రాంగణంలో ఉన్న ఒ క అశ్వద్ధ వృక్షం మొదట్లో రోజూలాగే పోస్తున్నాడు. అప్పుడు చెట్టు చీల్చుకుని ఒక గంధర్వుడు వచ్చి, తులసీదాస్‌కు నమస్కరించి ”నేటితో నాకు మీ దయ వల్ల శాప విముక్తి కలిగింది.” అని తన వృ త్తాంతం చెప్పి వెళ్ళిపోతూ ”మీకొక వరం ఇద్దామ నుకొంటున్నాను. కోరుకోమన”గానే ”నాకు శ్రీరా మ దర్శనం భాగ్యం కలిగించండి.” అని అడిగాడు. ”మీ కోరిక ప్రతీ నిత్యం సాయంత్రం మీ ప్రవచనం వినడానికి అందరికంటే ముందు వచ్చి, ఆఖరున వెళ్ళే వ్యక్తి #హనుమే. ఆయన వల్లనే మీకు మీ కోరిక నెరవేరగలదు” అని చెప్పి గంధర్వలోకానికి వెళ్ళి పోయాడు.
సాయంకాలం ఎప్పుడవుతుందా? అని ఎదు రుచూస్తున్న తులసీదాసు, రోజూ లాగే సాయంత్రం శ్రీరామ చరిత మానస్‌ ప్రవచనం వినడానికి ఒక వృ ద్ధ బ్రా#హ్మణ రూపంలో ఉన్న హనుమను గుర్తు ప ట్టి, కాళ్ళావేళ్ళాపడి బతిమాలగా తులసీదాస్‌లోని అకుంఠిత దీక్ష, శ్రీరాముడి పట్ల ఉన్న భక్తికి సంతో షించి, హనుమ ”సీతాలక్ష్మణ సమేతుడై ఉన్న శ్రీరా మ దర్శన భాగ్యం కలిగించాడు.
అందుకు కృతజ్ఞతగా కాశీక్షేత్రంలో ”సంకట విమోచన హనుమాన్‌” దేవాలయం నిర్మించాడు. కాశీలోని ఆ దేవాలయంలో శిలాఫలకం ఉంది. అం దుకే ఆలయ ప్రాంగణంలో వానరులు ఎక్కువ మంది ఉంటారు. హనుమ తన భక్తులకు ఎల్లవేళ లా అభయప్రదాతగా అలా కొలువుదీరి వున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement