Friday, November 22, 2024

ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు -1(ఆడియోతో..)

భాగవతం, ఏకాదశ స్కంద ంలోని ఋషి ప్రభోదం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

భాగవతం, ఏకాదశ స్కంద ంలోని ఋషి ప్రభోదం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

మన: అచిరాత్‌ స్యాత్‌ విరజంజిత శ్వాసస్య యోగిన:
వాయ్వగ్నిభ్యాం యధాలోహం ధ్మాతం త్యజతి వైమలమ్‌

ప్రాణాయామములతో తమ శ్వాసను గెలిచిన వారికి త్వరలోనే మనస్సు పరిశుద్ధమగును. గాలితో, నిప్పుతో అనగా ఇనుమును లేదా ఇతర లోహములను నిప్పులో వేసి గాలితో బాగా ఊదినచో ఆ జ్వాలకు లోహము తన మురికిని విడిచిపె ట్టును. అలాగే మన మనస్సును జ్ఞానమనే నిప్పులో పడవేసి ప్రాణాయామమనే ప్రక్రియతో బాగా ఊదినచో ఆ జ్వాల మనసు మురికిని తొలగించును. యధావిధిగా చక్కగా ప్రాణాయామం చేసిన వారి మనస్సు పరిశుద్ధమై వారి వశములో ఉండునని తాత్పర్యం.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement