Friday, November 22, 2024

ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు 31(2) (ఆడియోతో…)

స్కాంద పురాణంలోని ఋషి ప్రబోధం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ…

శ్రీకృష్ణ: శైశవే తిష్ఠన్‌ పూతనాం సన్నిధాప్యచ
అఘాతయత్‌ తాం బాల: తధా శకట సమ్ముఖాన్‌
తృణా వర్తంచ వత్సంచ ధేనుకం కాళీయకం తధా
ఆనాయ్య అవధీత్‌ తాన్వై తత: సుఖ మవాపస:

శ్రీకృష్ణుడు పదిరోజుల్లోపు పిల్లవాడిగా ఉండగానే పూతనను తన ఇంటికే పిలిపించుకుని వధించెను. శకటాసురుడిని, తృణావర్తుడిని, వత్సాసురుడిని, ధేనుకాసురిడిని, కాళీయునిని కూడా తన నివాసమునకే అనగా తాను తిరిగే యమునలోనే నిలిపి వారిని వధించెను. అందుకే కృష్ణుడు వీరందరినీ ఆయుధము లేకుండానే అనాయాసముగా వధించెను.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement