Thursday, October 17, 2024

మార్గములు వేరయినా గమ్యమొక్కటే!

ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మ సూత్రాలు ఈ మూడింటిని ప్రస్థాన త్రయం అంటారు. వీటిలో బ్రహ్మ సూత్రాలలోని మొదటి నాలుగు సూత్రము లను చతుస్సూత్రి అని పేర్కొనుట జరిగింది. ఇవి బ్రహ్మ జిజ్ఞా సను కలిగించి, మానవ జన్మకు గమ్యం మోక్షమని విశదీక రించినవి. ప్రస్థానత్రయమునకు ఎందరో మహానుభావులు భాష్యములు రచించుట జరిగినది. వారిలో ముఖ్యులు శ్రీ శంకరులు, శ్రీరామానుజులు, శ్రీ మద్వాచార్యులు, శ్రీ భాస్కరా చార్యులు, శ్రీ నింబార్కుడు, శ్రీ వల్లభాచార్యులు. సనాతన ధర్మమునకు మూలము వేదము. వేదము నుండే సనాతన వాఙ్మయమును సృజించి మన కందించిన కారణజన్ములకు ఈ భారతజాతి ఎంతగానో రుణ పడి ఉంది. వేల సంవత్సరముల నుండే వేదములపై మీ మాంస మొదలయింది. మీ మాంస అన గా పవిత్రమైన అధ్యయనం. విశ్లే షణ. ఈ మీమాంస నుండే తర్క ము ఉద్భవించినది. తార్కికత శబ్దార్థములను విశదపరుస్తుంది. ఉదాహరణకు సూర్యుడనగా తేజ ముతో కూడియున్న గోళాదిత్యుడే కాక ఆయన నుండి వెలువడే కిరణ ములు కూడ సూర్యుడేనని, ఆకాశ మనగా కుండలోనున్న ఖాళీ ప్రదే శము లాంటిదే మనకు కనిపించే అగోచరమయిన గోచర అంతరిక్ష మని విశ్లేషించి బోధపరుస్తుంది. ఈ మీమాంస, తర్కముల నుం డి పరమ సత్యములు ఆవిర్భవించా యి. భాష్యకారులైన మహాపురు షులు తమతమ ఆధ్యాత్మిక మార్గములను మానవ జాతికి అందించి గమ్యమును నిర్దేశించారు. అవన్నియూ శిరోధార్య ములే. మార్గములు వేరయినా గమ్యం ఒక్కటే!
అద్వైత సిద్దాంతాన్ని అందించిన శ్రీ శంకర భగవత్పాదు లు బ్రహ్మసూత్రాలకు మొట్టమొదటి భాష్యం వ్రాసియున్నా రు. అనేక విధానాలతో గందరగోళంలోనున్న సనాతన ధర్మా నికి పూర్వ వైభవం తీసుకువచ్చారు.
వీరి గురువు గోవింద భగవత్పాదులు. ముప్పది రెండు సంవత్సరముల కాలంలో అఖండ భారత ఖండాన్ని కాలినడ కన తన శిష్య బృందంతో పర్యటించి, సుమారు నూట ఏభైకి పైగా సంస్కృత గ్రంథాలను, శ్లోక మాలికలను సృజించి అద్వై తాన్ని అందించిన సాక్షాత్‌ శంకరులు శ్రీ శంకరాచార్యులు.
”బ్రహ్మ సత్యం జగన్మిధ్య జీవో బ్రహ్మైవనాపర:” బ్రహ్మ మాత్రమే సత్యము, జగత్తు మిథ్య, జీవుడు, బ్రహ్మమూ వేరు కాదు” అని అద్వైతము బోధిస్తుంది. జీవాత్మ పరమాత్మకంటే వేరు కాదు అను జ్ఞానాన్ని పొందడమే ముక్తి. జనన మరణ వలయం నుండి బయటపడి పునర్జన్మ లేకుండా పరమ పదా న్ని చేరడమే ముక్తి లేదా మోక్షమని శ్రీ శంకరులు ఉద్భో దించారు. జీవుడు శరీరం అను ఉపాధిలో ఉన్నప్పుడు మన స్సుకు, బుద్ధికి లోబడి పూర్వ జన్మ వాసనల వల్ల జీవుడు దేహాత్మ భావనతో పరమాత్మకంటే భిన్నమని భావిస్తాడు. దీనికి కారణం బ్రహ్మ మాయతో గూడి విశ్వంగా వ్యక్తమవు తున్నాడు. ఈ మాయనే ప్రకృతి, అవిద్య అని అంటారు. దీని ప్రభావంతో ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోలేక భ్రాంతిలో పడు తున్నాడు. అవిద్య తొలగించుకొన్న తరువాత ఆత్మ జ్ఞానం కలిగి ముక్తుడవుతాడని అద్వైతం విశదపరుస్తోంది. ఆత్మావ లోకనం శ్రవణ, మనన, నిధి ధ్యాసల వలన కలుగుతుందని తెెల్పారు. అప్పుడు ”అహం బ్రహ్మాస్మి” నేనే బ్రహ్మమును అను సత్యం బోధపడుతుందని ఉద్ఘాటించారు.
తదుపరి పన్నెండుమంది ఆళ్వారులు భక్తితత్త్వాన్ని విశేషంగా ప్రచారం చేసి పవిత్రమైన స్తోత్రాలను పాశురాలుగా సంకల నం చేసారు. ఈ మహా పూర్వరంగం ఆధారంగా శ్రీ భగవద్రామా నుజులు మొదట అద్వైతాన్ని అధ్యయనం చేసి తమ మనో నేత్రంలో జనించిన విశిష్టాద్వైత సిద్దాంతమును ప్రచారం చేసా రు. ఈయన నూటఇరువది సంవత్సరాలు ఈ భువిపై నడయాడారు.
పరమాత్మ లేక బ్రహ్మము తన సంకల్పము చేత మాయ ను ఉపకరణంగా చేసుకుని విశ్వాన్ని సృష్టిస్తున్నాడు. విశ్వం ప్రత్యక్షంగా గోచరిస్తుంది కాబట్టి మిథ్య కాదు. జీవాత్మ, పరమాత్మ ఒకటి కాదు. జీవాత్మ శరీరమనే ఉపాధితో నిశ్చల భక్తి మార్గములో వైకుంఠమును చేరుటనే మోక్షము అన్నారు. పరమాత్మ అద్వితీయుడే అయినా ఆయనకు విశిష్టత ఉంది.
పరమాత్మ, విశ్వం, జీవుడు అను మూడు తత్త్వాలున్నా యి. జీవుడు పరమాత్మ ఇద్దరూ జ్ఞాన స్వరూపులే. ఎన్ని జీవా లున్నాయో అన్ని జీవాత్మలున్నవి. జీవాత్మ అనన్య భక్తి ప్రప త్తులతో శ్రీమన్నారాయణుని చేరి మోక్షం పొందుతాడని శ్రీ రామానుజులు బోధించారు. అనంతర కాలంలో వైష్ణవ భక్తి తత్త్వాన్ని తన ద్వైత మత సిద్దాంతము ద్వారా ప్రచారం చేసిన శ్రీమద్వాచార్యుల వారు పరమ భాగవతోత్తముడు. మొదట ఈయన కూడా అద్వైత మును అధ్యయనం చేసినారు. వీరికి శ్రీకృష్ణ, వ్యాసుల కటాక్షం లభించింది. ఈయన మహా బల శాలి. కర్ణాటకలోని ఉడుపిలో మఠాన్ని స్థాపించి ఆనంద తీర్థు లనే నామముతో వెలుగొందారు.
ప్రత్యక్షంగా కనిపిస్తున్న విశ్వం మిథ్య కాదు. పరమాత్మ, ప్రకృతి, జీవుడు ఈ మూడు తత్త్వాలు సత్యం. పరమాత్మ ఒక్కడే. జీవాత్మలు అనేకం. జీవేశ్వరులు, జడేశ్వరులు, వివిధ జీవులు, జడ జీవులు, జడములు ఇవి పరస్పర భేదం కలిగి యున్నవి. జీవులు మూడు వర్గాలు ముక్తి యోగ్యులు, నిత్య సంసారులు, తమో యోగ్యులు, భక్తి మార్గంలో మోక్షం పొందుతారు. నిత్య సంసారులు పుణ్యపాపాల వశులై జనన మరణ చక్రంలో తిరుగుతారు. తమ యోగ్యులు పాపకార్యా లు చేసి నరకంలో పడతారు. మోక్షమనేది సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుజ్యములనే రూపంలో అనుభవం అవుతుంది. ఉపాసకుని సాధనను బట్టి భగవం తుని అనుగ్రహ రూప ఉంటుంది. భక్తి మార్గము జనులందరికీ అనుసరణీయమైన పథమని శ్రీ మద్వాచార్యులు సూచిం చారు. ఇక శ్రీ భాస్కరాచార్యుల భేదా భేద సిద్దాంతమును పరిశీలిద్దాం. సర్వ శక్తిమయుడైన పరమాత్మకు ‘మాయ’ సహ కారం అవసరం లేదని తనకుతానుగా విశ్వంగా వ్యక్తమయ్యా డని ఈయన అభిమతం. జీవుడు అణు స్వరూపుడు, ఈ అణువు బ్రహ్మములోని భాగమే. కాని జీవుడు ఉపాధి అనగా పాంచభౌతిక శరీరంలోనున్నప్పుడు బ్రహ్మము కంటే భిన్నుడు. ఇంద్రియాలు బాహ్య విషయాలతో కూడినప్పుడు కలిగే అనుభవ జ్ఞానం. ఇది తాత్కాలికం. చైతన్యం మాత్రము అంత రంగికమైనది మరియు నిరంతర ఆత్మానుభూతి. జీవాత్మ, పరమాత్మల మధ్య భిన్నా భిన్నములను ప్రసాదించి భేదాభేద సిద్ధాంతాన్ని ప్రచారం చేసారు భాస్కరాచార్యులు.
అనంత కాలంలో శ్రీ నింబార్కుల వారు ద్వైతాద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసారు. జీవులనేకులు, అణుమాత్రు లు. పరమాత్మ ఒక్కడే అనంతుడు. జీవుడు పరమాత్మ అంశ, ఇలా చూసినప్పుడు జీవుడు, పరమాత్మల మధ్య భేదం లేదు. పరమాత్మ సర్వ స్వతంత్రుడు, దివ్య మంగళ స్వరూపుడు, లీలావతారుడు. కనుక సృష్టిని చేయగల సమర్ధుడు. జీవుడు అస్వతంత్రుడు సృష్టిని చేయలేడు. కనుక పరమాత్మకంటే భిన్నుడు. శరీరం, ప్రకృతి, కాలము ఈ మూడు పరమాత్మ ఆధీనంలో ఉండి సంకల్పం చేత సృష్టించబడి పరిణతి చెంది ప్రళయకాలంలో తిరిగి ఆయనలోనే లీనమవుతాయని తెలి యజేసాడు. భక్తి ప్రపత్తుల ద్వారా అవిద్యను తొలగించు కొంటే నే మోక్షం కలుగుతుందని శ్రీ నింబార్కుల వారు ప్రచారం చేసారు.
చివరిగా శ్రీ వల్లభాచార్యుల వారి శుద్దాద్వైతం తెలుసు కుందాం. ఈయన శ్రీ కృష్ణదేవరాయలచే కనకాభిషేకము చేయించుకున్నారు. ఈయన రచించిన మధురాష్టకం ప్రాచు ర్యంలో ఉంది. శ్రీ శంకరుల అద్వైతములోని ‘మాయ’ను తొల గిస్తే అది శుద్ధమైనదని ఈయన సిద్దాంతం. సృష్టి చేయడానికి సర్వ శక్తిమయుడైన పరమాత్మకు ‘మాయ’ సహాయం అవస రం లేదని ఈయన భావన. జగత్తు మిథ్య కాదన్నారు. జీవుడు బ్రహ్మములోని అంశయే. బ్రహ్మము సకల సద్గుణ సమన్విత ము. శ్రీకృష్ణుడే పురుషోత్తముడని, ఆయన పట్ల అచంచల భక్తి కలిగిన మోక్షము పొందవచ్చని, అదియే భక్తి మార్గమని బోధించారు. సనాతన తాత్విక చింతన నుండి ఉద్భవించిన ఈ సిద్దాంతములన్ని మహిమోపేతమయినవే. జీవునకు గమ్యము మోక్షమేనని తెలియజేసాడు.
ఇక ఆధ్యాత్మిక సాధన చేసి సత్య మును చేరుట మన వంతు.
– వారణాశి వెంకట
సూర్య కామేశ్వరరావు
8074666269

Advertisement

తాజా వార్తలు

Advertisement