Saturday, June 29, 2024

ఋషభుని యోగ సిద్ధత్వం!

జంబూ ద్వీపంలోని ఒక వర్షమునకు అధిపతి అయిన నాభి ఋత్వి క్కులతో కలసి సంతానం కొరకు యాగం చేసాడు. అంత విష్ణువు ప్రత్యక్షమై నాభి మహారాజు, భార్య మేరుదేవిని ఆశీర్వదించి స్వ యంగా తానే మీ బిడ్డగా జన్మిస్తానని వరమిచ్చి యజ్ఞ వేదికలో అంతర్థాన మయ్యాడు. కొంతకాలానికి వారి కుమారునిగా జన్మించాడు. నాభి ఆ శిశు వుకు ఋషభుడు అని నామకరణం చేసాడు.
పెరిగి పెద్ద వాడయిన ఋషభుడు సకల శాస్త్ర పారంగతుడైనాడు. వేదవేదాంగాలను కరతలామ లకం చేసుకున్నాడు. నాభి మహారాజు అతనిని పట్టా భిషక్తుని గావించాడు. సమస్త జనులు ఋషభుని సేవించసాగారు. ఋషభుని ఖ్యాతి దశదిశలా వ్యా పించసాగింది. ఇది గ్రహించిన ఇంద్రుడు జంబూ ద్వీపమంతా వర్షం లేకుండా చేసాడు. తన దివ్యదృ ష్టితో తెలుసుకున్న ఋషభుడు తన యోగ మాయ తో రాజ్యమంతటా వర్షం కురిపించాడు. ఋషభ మహారాజు తన రాజ్యాన్ని కర్మభూమిగా భావించి కర్మతంత్రాన్ని పాటిస్తూ జయంతి అనే కన్యను వివాహం చేసుకున్నాడు. వారికి నూరుగురు కుమా రులు కలిగారు. వారిలో పెద్దవాడు భరతుడు. ఇతని పేరు మీదనే ఈ భూమండలమంతా ”భర తవర్షం”గా పేరు గాంచింది.
ఋషభ మహారాజు భరతునికి పట్టం గట్టాడు. అంత భరతుడు తన సోదరులలో కుశావర్తుడు, ఇలావక్తుడు, బ్రహ్మావర్తుడు, ఆర్యావర్తుడు, మలయ కేతువు, భద్రసేనుడు, ఇంద్ర స్పృశుడు. విదర్భుడు, కీకటుడు అనే తొమ్మిది మందిని ప్రధానులుగా నియమించాడు. మరొక తొమ్మిదిమంది కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, అవిర్హోత్రుడు, చమనుడు, కరభాజనుడు భాగవత ధర్మాన్ని వ్యాప్తిచేసి పరమ భాగవతోత్త ములైనారు. వారందరికీ వేదసారాన్ని, హరిభక్తిని, వేయి యాగాలను చేసి, ధర్మ మార్గాన్ని ప్రబోధించిన ఋషభుడు యోగసిద్ధుడై సృష్టి ధర్మాన్ని, రహస్యాన్ని తన కుమారులకు, ప్రజలకు వివరించాడు.
సమస్త జీవరాసులలో వృక్షాలు శ్రేష్ఠమైనవి. వాటికంటే సర్పాలు శ్రేష్ఠ తరాలు. వాటి కంటే మేధావులు ఉత్తములు. మేధావులకంటే పరిపాలకు లు, వారికంటే సిద్ధులు, కింపురుషులు, గంధర్వులు శ్రేష్ఠులు. వారికంటే దేవతలు, దేవతలలో ఇంద్రాది దిక్పాలకులు ఉన్నతులు. వీరందరికంటే మునులు పరమశ్రేష్ఠులు. వీరందరిపై రుద్రుడు, బ్రహ్మ, విష్ణువు వరుసగా ఘనశ్రేష్ఠులు. అందు విష్ణువు బ్రహ్మజ్ఞానుల ను ఆదరిస్తాడు. మానవులకు బ్రహ్మజ్ఞాని దైవంతో సమానం. బ్రహ్మజ్ఞానులను పూజించినవారు భూ లోకంలోనే మోక్ష మార్గాన్ని తెలుసుకుంటారు. ఈవిధంగా సదాచార సంప న్నులైన తన కుమారులకు లోకాన్ని పాలించడానికి అవసరమైన ఆచా రాలను ఋషభుడు ఉపదేశించాడు. అనంతరం దిగంబరుడై, కేశ సంస్కారాలను విడనాడి పిచ్చి వానిలా ప్రవర్తిస్తూ అగ్నిని తనలో ఆరోపించు కొని బ్రహ్మవర్త దేశాన్ని వదలి వెళ్ళిపోయాడు. అటుపై అవధూతలా మౌనవ్రతంతో నగరాలు, గ్రామాలు, పల్లెలు, కొం డలు, ఋష్యాశ్రమాలు దాటి సాగిపోయాడు. చివరకు అతను ఎవరూ గుర్తు పట్టని రీతిలో ఉన్నాడు. చివరకు అతని జీవన విధానం జుగుప్స కలిగించే తీరులోకి మారిపో యింది. నేలమీద పడిన ఆహార పదార్థాలను తిం టూ తన మలమూత్రాలలో పొరలుతూ ఉండేవా డు. ఋషభుని మలమూత్రాలు సుగంధభరితమై పదిదిక్కులలో, పది ఆమడల దూరం వరకూ పరి మళాలను వెదజల్లుతూ ఉండేది. సర్వాంతర్యామి అయిన వాసుదేవుణ్ణి తనలో ప్రత్యక్షంగా దర్శించు కుంటూ యోగసిద్ధుడై వెలుగొందసాగాడు. అపుడు ఆకాశగమనం, మనోవేగం, పరకాయ ప్రవేశం, అంతర్థానం, దూరదర్శనం, దూర శ్రవణం మొద లైన సిద్ధులు ఋషభుణ్ణి ఆవహించాయి. అయినా ఆ సిద్ధులను స్వీకరించలేదు. దీర్ఘకాలం శ్రమపడి సాధించుకున్న తపస్సును కూడా మనస్సు హరిస్తుంది. అందువల్ల జ్ఞాను లు మనస్సును నమ్మరు. ఋషభుడు కూడా అదేవిధంగా మనస్సును నమ్మక సిద్ధులను స్వీకరించలేదు.
అటు తరువాత ఋషభుడు పరమహంసయై, భగవంతుని సమా నుడై దేహాభిమానాన్ని వదలి తన లింగ శరీరం వదలిపెట్టాడు. కానీ పూర్వ వాసనా ఫలితంగా దేహ సంచలనం ఆగలేదు. అనేక దేశాలు, ఖండాలు దాటి శిలా ఖండాలను నోటిలో నుంచుకొని దిగంబరంగా కుటక పర్వత ప్రాంతాన్ని చేరాడు. అక్కడ వృక్షాల రాపిడికి చెలరేగిన అగ్నిశిఖలలో ఋష భుడు దగ్ధమైపోయాడు. ఈ దృశ్యాన్ని చూసిన అర్హతుడనే ఆ ప్రాంత పరిపాలకుడు ఋషభుని గురించి తెలుసుకుని ఆయన బోధలను, సంస్కా రాలను ఆమోదించి తాననుసరించి, ప్రజలందరిచే అనుసరింపచేసాడు.
కలియుగంలో మానవులు శాస్త్రాలలోని ఆచారాలను వదలి, బుద్ధి, ధర్మం చెడిపోగా వేదాలను, బ్రహ్మజ్ఞానులను యజ్ఞ పురుషు లనూ నిందిస్తారు. తమ తమ ధర్మాలు గొప్పవని చాటుకుంటూ అంధ విశ్వాసాలకు లోనవుతారు. అటువంటి మానవులకు కర్మ సంబం ధంలేని మోక్ష మార్గా న్ని ప్రబోధించాడు ఋషభ దేవుడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement