తిరుమల, ప్రభన్యూస్: ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్లలోని కొండచరియలు విరిగి పడుతుండడంతో ఢిల్లీ ఐఐటీ నిపుణులు కేఎస్.రావు, చెన్నై ఐఐటీ నిపుణులు ప్రసాద్, టీటీడీ పూర్వపు చీఫ్ ఇంజనీర్, సాంకేతిక సలహాదారు రామచంద్రారెడ్డి బృందం గురువారం మధ్యాహ్నం పరిశీలించింది. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, గోడలు, కల్వర్టులు తదితర ప్రాంతాలను ఐఐటీ నిపుణులకు చూపించి వివరించారు. ఐఐటీ నిపుణులు కేఎస్.రావు మాట్లాడుతూ టీటీడీ ఇంజనీరింగ్ విభాగం ఘాట్ రోడ్లకు ఇరువైపులా సున్నితమైన ప్రాంతాలను గుర్తించి బండరాళ్లకు ఫెన్సింగ్, రాక్ బోల్టింగ్, షాట్ క్రీటింగ్, బ్రస్టు వాల్స్ ఏర్పాటు చేసిందన్నారు. శేషాచల కొండల్లో, ఘాట్ రోడ్డులలో వర్షపు నీరు నిలువకుండా వెళ్లడానికి అదనపు కాలువలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుత వర్షాలకు విరిగి పడిన బండరాళ్ళు 30 నుంచి 40 టన్నులు ఉంటాయని, ఇవి చాలా ఎత్తు నుంచి పడడం వలన రోడ్లు, రక్షణ గోడలు దెబ్బతిన్నాయన్నారు. ఆప్ ఘాట్ రోడ్డులో మరో 5, 6 చోట్ల కొండచరియ లు విరిగి పడే ప్రమాదం ఉందని గుర్తించామన్నారు.కొండ చరియలు విరిగి పడకుండా ఎలాంటి జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలనే విషయంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి 2, 3 రోజుల్లో టీటీడీకి సమగ్ర నివేదిక అందించను న్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు, ఎస్-2 జగదీశ్వర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement