తిరుమల : తిరుమల మొదటి ఘాట్‌రోడ్‌లో వాహనాలను పునరుద్దరించడం జరిగిందని టీటీడీ అధికారులు తెలిపారు. గంటపాటు తిరుమల నుంచి అలిపిరికి, మరో గంటపాటు అలిపిరి నుంచి తిరుమలకు వాహనాలకు అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. అలిపిరి నుంచి తిరుమలకి వచ్చే ఘాట్‌రోడ్‌లో విరిగిన కొండచరియలను పూర్తిగా తొలగించడం జరిగిందన్నారు. భక్తులు ఫొటోల కోసం వాహనాలు దిగడం, వాహనాలను ఆపి ఉంచడం చేయరాదన్నారు. భారీ వర్షాల కారణంగా అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్‌రోడ్‌లో అనేక ప్రాంతాలలో కొండచరియలు విరిగాయి. కొండచరియలను తొలగించే కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం వరకు పరిస్థితిని అంచనా వేసి ఆ మార్గంలో వాహనాల అనుమతి విషయమై నిర్ణయం తీసుకుంటామన్నారు. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాలలో భక్తులకు అనుమతి లేదని భక్తులకు విజ్ఞప్తి చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement