Friday, November 22, 2024

తిరుమలలో త‌గ్గిన భక్తుల రద్దీ..

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు భారీగానే త‌ర‌లివ‌చ్చారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్ర‌సాదాలు, అన్న‌దానం, క్యూలైన్ కంపార్ట్ మెంట్ల వ‌ద్ద అన్ని వ‌స‌తులు క‌ల్పించారు. శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం కంపార్ట్ మెంట్ల‌లో భ‌క్తులు వేచిఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 5 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. మంగళవారం స్వామివారిని 74,436 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.19 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 27,269 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement