Thursday, November 21, 2024

పునరపి జననం మరణం

పునర్జన్మ అనేది ఉందా? అనేది ఒక సందేహాత్మక అంశమే. అయితే మన పురాణాలు, శాస్త్రాలు, జీవులు చేసే కర్మల ఆధారంగా, తిరిగి మానవులుగానో, జంతువులు గానో, లేదా మరేదైనా రూపంలో జన్మించడం తథ్యం అని విశదీకరిస్తున్నాయి క దా! జీవితం సత్కర్మలు ఆచరిస్తూ, ఆధ్యాత్మిక చింతనతో కర్తవ్యాన్ని విస్మరించని వారు ఉత్తమ గతులు పొందుతారని, అదే దుష్కర్మలు చేయడమే నియమంగా పెట్టుకొని, ధర్మ మార్గం లో నడవకుండా, అహంకారంతో ఇతరులను చులకన చేసేవారు, దైవ కార్యం అంటే విము ఖత చూపేవారు మరణించిన తరువాత దుర్గతులు పొందుతారని తెలుపుతున్నాయి. అయి తే మనకు కొన్ని సందేహాలు రావచ్చు.
1) పాప- పుణ్యాలకు పునర్జన్మకు సంబంధం ఉందా?
2) కర్మలననుసరించే పునర్జన్మ ఉంటుందా?
3) శాశ్వతంగా ఈ జనన మరణ చక్రంలోనే బందీగా తిరుగుతూ ఉంటామా?
4) మోక్షం అంటే ఏమిటి? దాన్ని పొందాలంటే మార్గం ఏమిటి?
5) స్వర్గం, నరకం, వైకుంఠం, కైలాసం వంటి లోకాలు ఉన్నాయా? ఉంటే ఎటువంటి వారికి ఈ లోకాల్లో ఎటువంటి స్థానం లభిస్తుంది?
6) భగవంతుడు జన్మ ఇచ్చిన తరువాత, ఇన్ని కష్టాలు, దు:ఖాలు, ధనిక- పేద వంటివి ఎందుకు కల్పించాడు?
ఇటువంటి ప్రశ్నలు మనలో ఉత్పన్నమవుతాయి. గత చరిత్ర, పురాణాలు, భగవద్గీత వంటివి మనకు సాక్షీభూతాలు. మనకు ఆదర్శవంతమైనవి. అటువంటి వాటిలో పునర్జన్మ అనేది వాస్తవం అని వక్కాణిస్తున్నాయి.
రెండేళ్ళ క్రితం ప్రముఖ దినపత్రికల్లో రాజస్థాన్‌లోని పారావాల్‌ అనే గ్రామంలో రతన్‌ సింగ్‌ చుందావత్‌ దంపతులకు ఐదుగురు ఆడపిల్లలు. ఆఖరు అమ్మాయి పేరు కింజల్‌. ఈమె తరచూ ఈ ఇల్లు నాది కాదు. నా సోదరుడు రతన్‌ సింగ్‌ ఎక్కడ? మాది పిప్లాంత్రి అనే గ్రామం. అక్కడే మా అమ్మ- నాన్న , తోడబుట్టిన వారు, నా సంతానం అంతా అక్కడే ఉన్నా రు అని చెపుతూండేది. ప్రస్తుత తల్లి- తండ్రులు ఆశ్చర్యపోయి, మానసిక వైద్యపరీక్షలు నిర్వ హంచారు. వాటిలో ఏ దోషం కనపడలేదు. అపుడు వైద్యులు ఆ పాప చెప్పిన గ్రామానికి తీసుకువెడితే వాస్తవం తెలుస్తుందని చెప్పిన మీదట, వీళ్ళు నివసిస్తున్న గ్రామానికి 30 కి.మీ దూరంలో ఉన్న ఆ ఊరు తీసుకెళ్ళారు. ఆ పాప చెప్పినవన్నీ వాస్తవాలేనని తెలుసుకొని, పున ర్జన్మలో. వీళ్ళ పుత్రికగా జన్మించిందని నిర్థారణకు వచ్చారు. ఇటువంటి సంఘటనలు కలక త్తాలో, శ్రీలంకలో… ఇలా చాలాచోట్ల జరిగాయి. డాక్టర్‌ ఇయాన్‌ స్టీ వెన్సన్‌ అనే మానసిక శాస్త్రవేత్త, మరికొందరు ఈ పునర్జన్మ మీద అనేక సంఘటనలు చూసి, శాస్త్రీయంగా ధృవ పరచుకొని ఈ పునర్జన్మలు ఉన్నాయి అని తెలిపారు.
ప్రముఖ తత్త్వవేత్త ప్లేటో ”మానవుడు జ్ఞానం వల్ల శుద్ధ సమత్త్వ స్థితి నుండి పతనమై భౌతిక శరీరంలో ప్రవేశిస్తాడు. తిరిగి ఉదాత్తమైన జ్ఞానాన్ని ఆర్జించి సత్కర్మలు, ధర్మం పాటి స్తే పునర్జన్మ అత్యుత్తమమవుతుంది. అలాకాక భౌతిక వాంఛలతో చిక్కుకుపోతే ఆ జీవుడు పశుపక్ష్యాదులలో జన్మిస్తాడు” అని చెప్పారు.
ఇప్పుడు పురాణాలు, భాగవతం, భగవద్గీత ఈ పునర్జన్మ గురించి చెపుతున్న అంశాలు పరిశీలిద్దాం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడుకు ఉపదేశిస్తూ-
”దేహనోస్మిన్‌ యథా దేహ కౌమారం ¸°వనం జరా
తథా దేహాన్తర ప్రాప్తి ర్ధీర స్తత్ర నా ముహ్యతి ” (2-13)
అంటే- జీవునకీ శరీరంనందు బాల్య, ¸°వన, వార్థక్యాలను అవస్థలు ఎట్లు కలుగుచు న్నవో అట్లే మరణానంతరం మరియొక శరీరం బొందుటకు స్థిరంగా ఉంది. కావున ఈ విష యం మీద జ్ఞాని ఎంతమాత్రం శోకింపడు అని. దీనినిబట్టి మరణానంతరం విధిగా జీవుడు పునర్జన్మ పొందుతారని తెలుస్తోంది. అంతేకాకుండా ఒక సందర్భంలో అర్జునుడు శ్రీకృష్ణుని తో ”ఈ భగవద్గీత ఇంతకుముందు సూర్యుడుకి బోధించానన్నావు. నువ్వు ఇప్పుడే కదా నా కు గోచరమగుచున్నావు. అని అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణుడు జవాబు చెపుతూ ”నీకు- నాకు చా లా జన్మలు జరిగిపోయాయి. నీకు ఆ జన్మల జ్ఞానం ఉండదు. నాకు తెలుసు. అని చెప్పారు.
శ్రీ భాగవతంలో పంచమ స్కంధంలో జడ భరతుడు అనే ఒక ఉపాఖ్యానం ఇవ్వబడిం ది. దానిప్రకారం భరతుడనే మహారాజు విష్ణు భక్తుడు. ఆయన ఋగ్వేద మంత్రాలతో అర్చిం చి నైవేద్యం సమర్పించిగాని మంచినీళ్ళు కూడా ముట్టేవాడు కాదు. ఒకసారి నదీతీరంలో ధ్యాన నిమగ్నంలో ఉండగా ఒక ఆడ లేడి మంచినీరు కోసం అక్కడికి వచ్చింది. అది నీళ్ళు త్రాగుతుండగా, సింహం గర్జన వినపడింది. నిండు గర్భవతిగా ఉన్న ఆ ఆడలేడి భయంతో ఆ నదిని ఎగిరి దూకపోయేసరికి ప్రసవం జరిగి, ఆ పిల్ల లేడి నీళ్ళలో పడిపోతే, అది గమనిం చిన భరతుడు చేరదీసి, జాగ్రత్తగా పెంచుతూ దానిపై వ్యామోహం పెంచుకొన్నాడు. భగవ ద్గీతలో (8:6 లో) చెప్పినట్లు ”దేహత్యాగ సమయంలో ఎవరు దేనిని స్మరిస్తారో వారు పునర్జ న్మలో ఆ జన్మనే పొందుతారు ” అన్న రీతిలో ఈ భరతుడు మరణిస్తూ కూడా లేడినే స్మరించ డం వల్లనే మరుసటి జన్మలో లేడిగా జన్మించాడు.
శ్రీకృష్ణుడు పెంపుడు దంపతులు యశోద- నందులు కూడా పూర్వజన్మలో వసువులు అనే దెెవతలు. ద్రోణుడు, ఆయన భార్య ధర. ఒకసారి బ్ర#హ్మ వారిని భూలోకంలో జన్మించ మని ఆదేశించాడు. అపుడు వారు మాకు విశ్వేశ్వరుడు, శ్రీకృష్ణ పరమాత్మను సేవించే భాగ్యం ప్రసాదించినట్లు అయితే భూమిపై జన్మిస్తామని చెప్పారు. బ్రహ్మ దానికి అంగీకరించి భూ లోకం పంపాడు. వారే ద్రోణుడు నందుడుగా, ధర యశోదాదేవి దంపతులుగా అవతరిం చారు. మనకందరికి తెలుసున్న నారద మ#హర్షి ఒక దాసీ పుత్రుడు. తల్లి చిన్నతనం నుండి బ్రాహ్మణుల ఇళ్ళల్లో ఊడిగం చేసేది. తల్లితోబాటే ఆ బాలుడు కూడా తిరుగుతూ, వాళ్ళకు అవసరమైన దర్భాసనాలు వెయ్యడం, మడిబట్టలు తీసుకు రావడం, పూలు తీసుకురావ డం వంటి పనులు చేస్తుండేవాడు. ఒకసారి చాతుర్మాస్య వ్రతం చేస్తూన్న సందర్భంలో ఆ కుర్రవాని పనులకు సంతోషించి, వారు అతనికి ప్రణవంతో బాటుగా, శ్రీ కృష్ణ మంత్రం ద్వాద శాక్షరీ మంత్రం ఉపదేశించారు.
ఆ మంత్ర ప్రభావంతో, ఆ బాలుడు మరుసటి జన్మలో బ్ర#హ్మ మానస పుత్రుడు నారద మహర్షిగా జన్మించారు. ఆదిశంకరాచార్య తన శంకరా ద్వైతం అనే గ్రంథంలో –
”పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం
ఇహ సంసారే- బహు దుస్తారే
కృపయాపారే- పాహ మురారే!!”
పుట్టుట గిట్టుట ఇది అంతులేని కథ. జనన మరణముల నుండి తరింప సాధ్యము కాదు. కాని దు:ఖ సాగరము నుండి కాపాడమని భగవంతుని ప్రార్థించడమే మేలు ” అన్నా రు. ఇవన్నీ తెలుసుకొన్న తరువాత, మనలో కొంచెమైనా చైతన్యం రావాలి. ఈ జనన- మర ణ చక్రంలో చిక్కుకోకుండా మోక్ష సాధనకు ధర్మాచరణ, భగవతారాధనలాంటి సత్కర్మల ను ఇప్పటి నుండైన పాటించి తరిద్దాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement