Saturday, November 23, 2024

నేటి రాశిఫ‌లాలు(22-9-2022)

మేషం: ఆకస్మిక ధనలాభం. ఊహలు నిజమవుతాయి. మిత్రుల నుంచి శుభవర్తమానాలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. భూవివాదాలు తీరతాయి. వ్యాపారాల విస్తరణ. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

వృషభం: కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలలో సమస్యలు పెరుగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు ఎదుర్కొంటారు. విద్యార్థులు మరింత శ్రమపడాలి.

మిథునం: బంధువులతో అకారణంగా వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య, కుటు-ంబసమస్యలు. ముఖ్య పనుల్లో అవాంతరాలు. ధనవ్యయం. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో నిరాశ.

కర్కాటకం: ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. ఆలయ దర్శనాలు. ధనలాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అరుదైన అవకాశాలు.

సింహం: బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. ముఖ్య పనుల్లో కొంత అనుకూలం. ధనవ్యయం. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో మరింత ఒత్తిడులు.

- Advertisement -

కన్య: శుభకార్యాలపై చర్చలు. చిన్ననాటి మిత్రులతో వివాదాలు తీరతాయి. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు-. ఆలయాలు దర్శించుకుంటారు. వ్యాపారులకు స్వల్ప లాభాలు. ఉద్యోగుల పనిభారం కొంత తగ్గే సూచనలు.

తుల: ఆరోగ్య, కుటు-ంబసమస్యలు. వ్యాపారాలలో కష్టించినా ఫలితం ఉండదు. ఉద్యోగాలలో అవిశ్రాంతంగా పనిచేయాల్సి వస్తుంది. కొన్ని పనులు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా.

వృశ్చికం: సన్నిహితులు, మిత్రుల సాయం పొందుతారు. ఆస్తి విషయాలలో సమస్యలు తీరతాయి. ఆకస్మిక ధనలాభం. వాహన, కుటు-ంబసౌఖ్యం. వ్యాపారాలలో మరింత సానుకూలం. ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.

ధనుస్సు: రెండుమూడు విధాలుగా ధనలాభం. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.

మకరం: ప్రయాణాల్లో మార్పులు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. బంధువులు, మిత్రుల నుంచి విమర్శలు. ధనవ్యయం. వ్యాపారాలలో స్వల్ప లాభాలు ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

కుంభం: ఆకస్మిక ప్రయాణాలు. సోదరులు, మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. ఆర్థిక ఇబ్బందులు. శ్రమ తప్పదు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు నిరాశాజనకం. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

మీనం: సన్నిహితులతో విభేదాల పరిష్కారం. రాబడి కొంత పెరుగుతుంది. వాహనాలు, భూములు కొంటారు. ప్రముఖులతో చర్చలు సఫలం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు దక్కే అవకాశం. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement