Friday, September 27, 2024

నేటి రాశిఫ‌లాలు(2-9-2022)

మేషం: వ్యవహారాలు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం లభిస్తుంది. మీరు పడ్డ శ్రమ ఫలిస్తుంది. నూతన విద్య. ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వృషభం: బాధ్యతలతో సతమతమవుతారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తుల వివాదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందిగా ఉండవచ్చు.

మిథునం: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కర్కాటకం: వ్యవహారాలు మందగిస్తాయి. బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. శ్రమాధిక్యం. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

సింహం: యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. సోదరుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

- Advertisement -

కన్య: చిన్ననాటి మిత్రులతో సంభాషిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

తుల: వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆత్మీయులతో కలహాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో వివాదాలు.

వృశ్చికం: కొన్ని సమస్యలు వేధిస్తాయి. బంధువులతో తగాదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యవహారాలలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

ధనుస్సు: పరిస్థితులు అనుకూలిస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం. మిత్రుల చేయూత లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

మకరం: మీ శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో చర్చలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కుంభం: పనుల్లో ప్రతిబంధకాలు. రుణాలు చేయాల్సిన పరిస్థితి. బంధువులు, మిత్రులతో విభేదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మీనం: సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యభంగం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో నిరాశ.

Advertisement

తాజా వార్తలు

Advertisement