శ్రీమద్భాగవతాన్ని ఆంధ్రీకరించిన పోతన రామచంద్రునికి అంకితమిచ్చి ఆయన విగ్రహం పాదాల వద్ద ఉంచారు. అలా చాలాకాలం ఉండిపోయింది. ఆయన కుమారుడి శిష్యులు దాన్ని గుర్తించి లోకానికి చాటారు. ఆయన భాగవతంలో రసరమ్యంగా పద్యాలను రచించి తెలుగువారిని మోక్షోన్ముఖు లను చేసారు. ఏకశిలానగర సమీపంలో బ్రాహ్మణ కుటుం బంలో పుట్టిన బమ్మెర పోతరాజు సహజ పండితుడు. రైతు కూడా. తనకున్న మడచెక్క (పొలం)ను స్వయంగా దు న్నుకుని పంట వేసుకుని సంసారం నడిపేవాడు. ఒకసారి పొలం సమీపంలోని గోదావరి నదిలో స్నానం చేసి ఇసుక దిమ్మె మీద కూర్చుని ధ్యానం చేస్తున్నాడు. అప్పుడు లీలా మాత్రంగా శ్రీరామచంద్రుడు ఆయనకు దర్శనమిచ్చాడు. ”ఓ! పోతనా నిన్ను ఉద్ధరించడానికి వచ్చాను. నీవు భాగవ తాన్ని ఆంధ్రీకరించు” అని ఆదేశించాడు. అంత పోతన ఆనం దభరితుడై రచనకు పూనుకున్నాడు.
”పలికెడిది భాగవతమట
పలికించువిభుడు రామభద్రుడట
నే పలికిన భవ#హరమగునట
పలికెదవేరుండ గాథ పలుకగనేల”
భాగవతాన్ని రాసేది నేను కాదు, రామభద్రుడు నా నోట పలికిస్తున్నాడు. ఎన్నో జన్మల నుంచి చేసిన పాపా ల పరిహారానికి నాకీ అవకాశం ఇచ్చాడు. అలాంటి స్థితి లో నేను వేరొకరి గాథను నా నోటితో పలకనేల” అని పోత న పారవశ్యంతో భాగవత కావ్యంలో రాసుకున్నాడు.
”చేతులారంగ శివుని బూజింపడేని,
నోరు నొవ్వంగ #హరికీర్తి నుడవడేని
దయయు సత్యంబు లోనుగా దలపడేని,
గలుగ నేటికి దల్లుల కడుపు జేటు”
మరో శ్లోకంలో శివకేశవులు ఒకటేనని శివుని పూజ చేయని చేతులు ఉండి ఫలితమేమి, హరిని కీర్తిం చ ని నోరు ఉండి లాభమేమి. సత్యం, దయలేనివాడు, పర మాత్మను తలవని నిర్భాగ్య జీ వి కోట్లాది జన్మలుగా ఈ తల్లుల కడుపు చీల్చుకుని పుట్టడం ప్రసవ వేదనలో మరణ వేదన కలిగించటం మినహా ఉపయోగమేల అలాంటివారు ‘పుట్టనేలా గిట్టనేల’ అని పోతన అన్నారు. అంటే పరమాత్మ ను తలవని మనిషి పుట్టినా, గిట్టినా ఒకటేనని పరోక్షంగా పోత న చెప్పారు. అ తరువాత సరస్వతీదేవి కటాక్షించాలని ‘శారద నీర దేంద్రు ఘనసార’ అనే పద్యంలో ప్రార్ధించారు.
ఆ తరువాత భాగవతంలో తొలి పద్యంగా.. ‘శ్రీకైవల్య పదం బు చేరుటకునై చింతించెదన్’తో ప్రారంభించి పద్యంలో ‘మహానం దాంగనా ఢింభకున్’ అనే పదం వాడాడు. ఆ ఈశ్వరు నిలో నా తేజస్సు కలిసి మరో జన్మ లేకుండా కైవల్యం ఇచ్చే దైవానికి నమస్కరిస్తున్నాను. అలాగే భక్తులను రక్షించేవాడు, దానవుడు నిగ్రహంచేవాడు, ప్రపంచా న్ని పాలించి, దుష్టశిక్షణ ద్వారా లయం చేసే ఆ సర్వే శ్వరుడికి ప్రమాణాలన్నారు. అలాగే నందుడు భార్య యశోదమ్మ ముద్దుల కుమారుడికి నమస్కరిస్తున్నాన న్నాడు. ఇక్కడ పోతన కృష్ణుడు అనకుండా ‘మహానం దానంగనా ఢింభకున్’ అనడం ఆయన రచనా వైశి ష్ట్యానికి నిదర్శనం. ఇక్కడ మరో అర్ధంలో మహానం దం ఇచ్చే మూలపుటమ్మ కుమారుడికి శరణమన్నారు.
భాగవతాన్ని తమకు అంకితమివ్వాలని రాజు లు, మహారాజులు ఆయనపై ఒత్తిడి తెచ్చారు. ఒకరో జు రాత్రి ఆయనకు గజ్జల సవ్వడి వినిపించింది. ఆయన ఉలిక్కిపడి లేచాడు. చీకటిలో ఆయన కు ఒక స్త్రీ ఏడుస్తూ కనిపించింది. ఆమె కంటినున్న కాటుక కరిగి కన్నీళ్లు కుచద్వయాలపై పడు తున్నాయి. ఆమె సరస్వతీ మాతగా గుర్తించారు.
పోతన వెంటనే ”అమ్మా! ఎందుకీ కన్నీళ్లు నా భాగవతం అమ్ముకుంటాననా, అది నాది కాదు. రామభద్రుడిది” అన్నారు. అంతేకాదు నేను బంగారు నాణల కోసం, అగ్రహారాల కోసం భాగవతాన్ని అమ్ముకోను. రామచంద్రుడు రాయించిన కావ్యాన్ని ఈ మానవాధములకు ఎలా అంకితమిస్తాను” అన్నారు. ”ఈ శరీరం శాశ్వతం కాదు, ఎప్పటికైనా పడిపోవలసిందే , మాట తప్పిన నన్ను కాలుడు కత్తికో ఖండంగా నరకడా” అని తన నిశ్చయాన్ని పద్య రూపంలో వ్యక్తం చేసారు. అనంతరం తన భాగవత కావ్యాన్ని కన్నెగా ఎంచి ఇలా రాసారు.
”బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్నెకిన్
కూడులకిచ్చి ఆ పడుపుకూడు భుజించుటకంటే సత్కముల్ హాలికులైననేమి
గహనాంతరసీమల కందమూల దౌర్భాకుల నైననేమి
నిజధార సుతోదర పోషనార్ధమై/ బాలరసాలసాలనవపల్లవ కోమల కావ్యకన్నెకున్.”
”ఈ కావ్యకన్నెను పట్టుకెళ్లి ఓ దౌర్భగ్యుడికి ఇచ్చి కాసులు తీసుకుంటే నేను పడుపువృత్తి చేసిన వాడినవుతాన”ని పద్య రూపంలో చెప్పాడు. అలాంటి కూడు తినేకంటే కొద్దిపాటి పొలం దున్నుకుని బతకడం మేలు ఇలాంటి కావ్యకన్నెను అమ్ముకోవటం కంటే అని వాపోయాడు.
పోతన భాగవత రచన పూర్తిచేసి ఒక పెట్టెలో పెట్టి పూజామందిరంలో రామచంద్రుని విగ్ర#హం వద్ద ఉంచి కుమారుడికి జాగ్రత్త చెప్పాడు. అంతే తప్ప ఆయన భాగవతం గురించి ఎవరికీ చెప్పలేదు. ఆయన గతించినా అది అలాగే పూజా మందిరంలో ఉంది. కుమారుడు కూడా వృద్ధుడై అనారోగ్యంతో తన శిష్యులకు తన తండ్రి చెప్పిన జాగర్తలు చెప్పాడు. ఆ పెట్టె నుంచి చెద పురుగులు బయటకు రావడం చూసి శిష్యులు దాన్ని తీసి చూస్తే ఆంధ్రీకరించిన భాగవతం బయటపడింది. అంత వారు దానిని మళ్లి తాళపత్రాలలోకి ఎక్కించడంతో ప్రపం చానికి తెలిసింది. పోతన భాగవత ఆంధ్రీకరణలో సొంపైన పద్యాలతో రసవిందు కలిగించారు. ప్రతి పద్యం భగవంతు ని స్తుతించడం, వైశిష్ట్యాన్ని వర్ణించడమో చేయడం విశేషం.
రసరమ్యంపోతన భాగవతం!
Advertisement
తాజా వార్తలు
Advertisement