Wednesday, November 20, 2024

అరుదైన సూర్య ఆలయం

అత్యంత అరుదుగా దర్శనమిచ్చే ఆదినారాయణుడి ఆలయాలు దేశంలో అతి స్వల్పం అనే చెప్పాలి. ఉన్న ఈ కొద్దీ ఆలయాలకి ఒక దానికి ఒకో ప్రశస్త్యత వుంది. అలాంటి అరుదైన వాటిలో అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం అమిద్యా లలోని ఏకశిలపై సప్త అశ్వాలతో సూర్యభగవానుడు విగ్రహం కడు రమ్యం, రామణీయం. ఒకే శిలపై ఉన్న ఈ ఆలయం సుమారు 800 ఏళ్ల క్రితం చోళుల కాలంలో నిర్మితమయినట్లు ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది. అలాగే ఈ ఆలయంలోనే శివాలయం కూడా ఉండ టంతో శివకేశవులున్న ఈ ఆలయ ప్రాశస్త్యం అపూర్వం. స్థల పురాణం ప్రకారం అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామం లో ఉన్న చారిత్రాత్మకత, పురాతన చరిత్ర కల్గిన దేవాలయాలు భక్తులను అలరిస్తున్నాయి. అందునా ఏకశిలా సప్త అశ్వవాహనంపై కొలువైన అరుదైన శ్రీసూర్యదేవాల యం ఇక్కడే ఉండడం విశేషంగా చెప్పవచ్చు. ఈ ఆలయ కుడ్యాలపై శిలా శాసనాలు ఉన్నప్పటికీ వాటిని తర్జుమా చేసేవారు లేకపోవడం తో గ్రామస్తులు, అర్చకులు తెలిపిన వివరాల ప్రకారం క్రీ.శ 1200- 1300 కాలంలో చోళరాజుల వంశానికి చెందిన రాజు అమిద్యాల గ్రామంలో దేవా లయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఇక్కడ చెన్నకేశవస్వామి ఆలయంగా పిలవబడు తున్న ఈ ఆలయం గతంలో ఎంతో వైభ వంగా ఆదరణ పొందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆలనా పాలనా లేక శిథిలావస్థకు చేరింది. అయితే గ్రామస్తుల ఉమ్మడి కృషి ఫలితంగా పునరిద్దరించబడి 2017 నుండి తిరిగి అన్ని పూజలు ప్రారంభమయ్యాయి. ఇంకా మరింత అభివృద్ధి చేయాలని తలం పుతో గ్రామ పెద్దలు కమిటిగా ఏర్పడి కృషి చేస్తున్నారు. విశేషమైన ఈ ఆలయంలో మరో విశేషం కూడా ఉంది. ప్రపంచంలో ఎక్కడైనా సూర్య భగవానుడు తూర్పు అభిముఖంగా కొలువు దీరి వుంటారు. మన దేశంలోని ఓడిశాలోని ప్రముఖ కోణర్క దేవాలయం కానీ, మన రాష్ట్రంలో అరస వెల్లిలో కానీ సూర్య భగవానుడు తూర్పు ముఖంగానే వుంటారు. కానీ ఆమిద్యాల గ్రామంలో సూర్య నారా యణుడు పశ్చిమ దిశగా కొలువై ఉండడం ఆనందాశ్చర్యం కలిగిస్తుం ది. పశ్చిమాభి ముఖంగా ఉన్న సూర్య భగవానుడి ఆలయం ప్రపం చంలో ఇదొక్కటే అని చరిత్రకారులు నిర్ధారించారు. అమిద్యాలలోని సూర్య భగవానుడిని దర్శించుకుంటే ఎటువంటి దీర్ఘ కాలిక అనారోగ్యలైన నయమవుతా యని, కోరిన కోర్కెలు తీర్చి జీవితాలను తన వెలుగు రేఖలతో ఆశీర్వదిస్తరని ఆయా పరిసర గ్రామస్తుల నమ్మకం. అంతేకాక ఉద్యోగ ప్రదాత అనే నమ్మకం కూడా ఉంది. అమిద్యాలలోని ఈ సూర్య దేవాలయం అనంతపురం నుండి 50 కి.మీ, ఉరవకొండ పట్టణం నుండి 9 కి.మీ దూరంలో ఉంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్న ఆహోబిలంకు కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం. పై ప్రాంతాల నుండి బస్సులు, ఇతర ప్రైవేట్‌ వాహనాల ద్వారా చేరవచ్చు. ఈ ఆలయ అభివృద్ధికి దేవా దాయ శాఖకు ప్రతిపాదనలు పంపించామని, భక్తులు, దాతల సహకారంతో అభివృద్ధి చేస్తామని ఆలయ కార్యనిర్వహణాధి కారి దేవదాస్‌ తెలిపారు.

  • చలాది పూర్ణచంద్రరావు
    9491545699
Advertisement

తాజా వార్తలు

Advertisement