Saturday, November 23, 2024

యజ్ఞముతో ఆరంభమైన రామాయణం!

రామావతారం పుత్రకామేష్టితో ఆవిర్భవించినది. అనగా రామాయణం యజ్ఞంతోనే ప్రారంభమైనది. ఇక అక్క డ నుంచి రామాయణ కాలమంతా పలు యజ్ఞాలు జరుగుతూనే వున్నాయి. విశ్వామిత్ర యాగసంరక్షణ రెండవ ఘట్టము. అక్కడి నుండి మధ్యలో కథానుక్రమ ణిలో దక్షయజ్ఞం, గంగావతరణము, గౌతమ యజ్ఞ ము. ఇక మిథిలానగరంలో జనకమహారాజు యజ్ఞము. ఆ యజ్ఞములోనే శివధనుర్భంగము. జనకమహారాజు అంటాడు కూడా పూర్ణా#హుతికి వచ్చిన దేవతలను దర్శించుకొని యజ్ఞప్రసాదం తీసుకోండి అని. అంటే ఆ రోజుల్లో యజ్ఞాలలో పూర్ణా#హుతిలో దేవతలు ప్రత్య క్షంగా వచ్చి ఆ#హుతి తీసుకొనేవారు. ఇంతకన్నా భాగ్యం ఏమున్నది? ఏ కొంచెం లోపం జరిగినా దేవతలు రారు. మన శ్రద్ధాభక్తులకు అదే ఒక నిదర్శనం.
ఇక రాముడు అరణ్యవాసంలో ఋషుల ఆశ్రమం లోనికి వెళ్తే ప్రతి ఋషి యజ్ఞము చేయుచునే ఉన్నా రు. యజ్ఞానికి ముఖ్య అతిథి రామచంద్రు డు. అంతేకాదు, యజ్ఞము జరు

గ కున్నా అతిథి ఇంటికి వచ్చాడంటే ‘అగ్నిం #హుత్వా ప్రదాయర్ఘ్యం తతో గో చ నివేదయేత్‌ అన్యథా #హ తథా కు ర్వాన్‌ నరకం చాధిగచ్ఛతి’ అంటాడు. అనగా అతిథి రాగానే మొదట అతనికి స్వాగతంగా అగ్నిలో ఆ#హుతులు వేయాలి. అంటే యజ్ఞం చేయాలి. తరువాత అతిథికి అర్ఘ్య పాద్య ఆచమనీయాలు, అతిథి పూజలు చేసి గోదా నం చేయాలి. దీనికి విరుద్ధంగా ప్రవర్తించినవాడు నరకా నికి వెళ్తాడు అని భావన. ఇట్లు భారతీయ జీవనం యజ్ఞం తో, గోవుతో ముడిపడి ఉన్నది. ఇప్పుడు మనము ఆ రెండూ మరిచిపోయాం, పోతున్నాం. హోమగుండము సమిధ లు, నెయ్యి, పురోడాశము, ఋత్విక్కులు, హోత లు, అధ ర్వులు, యజమానులు ఇదం తా కలియుగంలో సాధ్యం కా దని ద్రవ్యయజ్ఞా, యోగయ జ్ఞా, స్తపోయజ్ఞా అని గీతలో చెప్పారు. రాముడు శరభంగాశ్రమంలోనికి వెడి తే యజ్ఞంలో ఉన్న శరభంగుడు రామునికి అతిథి సత్కారం చేసి ఆ అగ్నిలోనే దేహాన్ని అర్పించి రామప్రసా దంతో ఉత్తమ లోకాలను
పొందా డు.

Advertisement

తాజా వార్తలు

Advertisement