శుకసారణులు, శార్దూలాదులు చెప్పిన వానర సేన వివరాలుఉ విన్న రావణుడి గుండె ఝల్లుమంది. కొంచెం భయపడ్డాడు. మళ్లిd ధైర్యం తెచ్చుకున్నాడు. మహా బలవంతుడైన మాయలు చేయడం నేర్చిన విద్యుజ్జిహ్వుడిని పిలిచాడు. సీతను మోసగించాలనీ, అందుకోసం కొంచెం కూడా తేడా లేకుండా శ్రీరాముడు శిరస్సు, బాణం తో సహా విల్లు కల్పించి తీసుకురమ్మని చెప్పి, రావణుడు సీత దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు.
”ఓసీ సీతా! నన్ను స్వీకరించమని నిన్ను ఎంతగానో ప్రార్థించినా ఛీకొట్టావు. నీ మగడు, యుద్ధంలో చనిపోయాడు. ఇప్పుడు ఎంత ఏడవాలని వుంటే అంత ఏడువు. వేరే దిక్కులేక నువ్వే నా భార్యవవుతావు. చనిపోయినవాడు ఏడుస్తే బతికొస్తాడా? నా భార్యలలో ఒకదాని వై వుండు. రాముడు వానర సేనతో నన్ను చంపడానికి సముద్ర తీరానికి వచ్చాడు. సూర్యా స్తమయ సమయంలో ఉత్తర దిక్కున నీ మగడు బడలికతో నిద్రపోయినప్పుడు, ప్రహస్తుడు సైన్యంతో అక్కడికి వెళ్ళి కత్తితో రాముడి గొంతు నరికాడు. ఇది చూసి వానరసేన ఒక్కొక్కరే చస్తూ నేలకూలారు. కొందరు సముద్రంలో దూకారు. కొందరు ఆకాశానికి ఎగిరిపోయారు. ఇలా నీ మగడు పరివారంతో సహా చనిపోయాడు.”
రాముడి శిరస్సును యుద్ధభూమి నుండి తెచ్చిన విద్యు జ్జిహ్వుడిని పిలుచుకుని రమ్మని ఒక రాక్షసుడికి చెప్పాడు. వాడలాగే రాముడి శిరశ్చాపాన్ని తెచ్చి జానకి ఎదుట పెట్టి వెళ్లిపోయాడు. రావణుడు వాటిని సీతాదేవి ముందుకుతోసి, ”ఓ కమలాక్షీ! ఇదిగో మా ప్ర#హస్తుడు బ#హరంగంగా, అందరూ చూస్తుండగా, యుద్ధభూమి నుండి తెచ్చిన రాము డు ఎక్కుబెట్టే విల్లు. ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తావు? నాకు స్వాధీన పడు” అంటాడు.
ఆ శిరస్సు అచ్చు రాముడిదిలాగా వుండడంతో, అది తన మగడి తల అని నమ్మింది. తాను పంపించిన జడబిళ్ళను చూసిన సీతాదేవి అది తన మగడిదే అని నమ్మి బాగా ఏడ్చిం ది. ”ప్రాణశ్వరా! నువ్వు అల్పాయువుడివి అయ్యావు. పాపరహితుడవైన నీకు నిష్కార ణంగా అకాల మృత్యువు ఎలా వచ్చిందో? దీనికి దైవమే కారణం. నీతిశాస్త్రాలు అన్నీ నీకు తెలుసుకదా? ఎప్పుడు ఏది చేయవచ్చు, ఏది చేయకూడదని తెలిసిన నీకు మృత్యువు కళ్ళకు కనపడకుండా వచ్చి పడింది. దైవ సంకల్పానికి అడ్డం లేదు కదా?” అనుకుంటూ ఏడ్చింది.
రావణుడిని ఉద్దేశించి, ”రావణా! ఆలస్యం చేయకుండా రామచంద్రుడి మీద నన్ను పడేయి. భార్యను భర్తతో కలిపి మంచి పనిచేయి. ఇలా చేస్తే, నీకు మేలు కలుగుతుంది. రాక్షస రాజా! రాముడి దేహంతో నా దేహం, శిరస్సుతో నా శిరస్సు కూర్చు. సహగమనం చేసి నా భర్త పోయిన లోకానికి నేను కూడా పోతాను” అంటూ భర్త శిరస్సు, ధనుస్సు చూస్తూ, ఏడు స్తూ మూర్ఛపోతుంది. అప్పుడు రావణుడు అశోకవనాన్ని వదిలి సభకు వెళ్ళాడు. యుద్ధ విషయంలో ఏమి చేయాలా అని ఆలోచించసాగాడు. రావణుడు అశోకవనం నుండి వెళ్ల గానే రాముడి తల, విల్లు అదృశ్యం అయ్యాయి. ఆ సభలో రావణుడు చేయాల్సిన పని ఆలో చించి దగ్గర వున్న మంత్రులతో, సేనానాయకులతో ”అందరూ వినేట్లు భేరులు వాయిస్తూ, రాక్షస సేననంతా ఒక్కచోటికి తెండి. వారికి కారణం చెప్పవద్దు.” అన్నాడు. వారు వారివారి సేనలను ఒక్కో చోట చేర్చి, రావణుడికి చెప్పారు.
సీతను కాపాడే వారిలో సరస అనే ఒక రాక్షసి ప్రాణమిచ్చైనా సీతాదేవిని రక్షించడమే వ్రతంగా పెట్టుకుంది. సీత దగ్గరికి వెళ్ళి, మృదుల వాక్యాలతో ఊరడించి- ”జానకీ! సంతా ప పడవద్దు. విదితాత్ముడైన రామచంద్రమూర్తిని నిద్రపోయే సమయంలో హింసించడం సాధ్యంకాదు. వానరులంతా క్షేమంగా వున్నారు. వానరులను రాముడు రక్షిస్తున్నందున వారిని బాధించడం ఎవరికీ సాధ్యంకాదు. రాముడిలాంటివాడికి మృత్యువు ఎలా వస్తుంద మ్మా? రావణుడు నిన్ను కావాలనే బాధపెట్టాడు.”
సరమ సీతాదేవికి ఇలా చెప్పసాగింది. ”సముద్రాన్ని దాటి వానరసేనతో నీ మగడు దక్షిణ తీరానికి వచ్చి వున్నాడు. వానరసేన అంతా సముద్రం ఒడ్డున రాముడిని రక్షిస్తూ వుంది. యుద్ధానికి వానర సేనకు కావాల్సినవన్నీ పూర్ణంగా సంపాదించి పెట్టుకున్నారు. రాముడు తమ్ముడితో వున్నాడు. ఇవన్నీ నేను చూసి చెప్తున్నాను. విన్నమాటలు కావు. రావ ణుడు పంపించిన రాక్షసులు, రామచంద్రమూర్తి దక్షిణ తీరానికి చేరాడని చెప్పారు. రావ ణుడు మంత్రులతో సమాలోచన చేస్తున్నాడు. సీతమ్మా విను! ఘంటల ఘణఘణలు, రథాల దబదబలు, గుర్రాల సకిలింపులు, వాద్యాల మోతలు. ఇవన్నీ యుద్ధ ప్రయత్నాలే. కాబట్టి రామచంద్రమూర్తికి కీడు కలిగిందని విచారపడవద్దు. సంతోష లక్ష్మి నిన్ను చేరు తుంది. లక్ష్మణుడితో కలిసి నీ మగడు రాక్షస సేనను, రావణుడిని నాశనం చేస్తాడు.”
సీతాదేవికి తన మాటలుగా చెప్పిన సరమ రావణుడు వున్నచోటుకు వెళ్లింది. అక్కడ రావణుడు తన మంత్రులకు చెప్పేవిధం విని, వాడి నిశ్చయం తెలుసుకుని ముహూర్తకాలం లో అశోకవనానికి తిరిగివచ్చింది. మరల వచ్చిన సరమను చూసిన సీతాదేవి రావణుడి హృదయం ఎలా వుందో చెప్పమంది. అప్పుడు సరమ మంత్రులతో, సహాయులతో కూడిన రావణుడి ఆలోచనను వున్నదున్నట్లు చెప్పింది. ”సీతమ్మా! రావణుడి తల్లి కైకసి, వృద్ధ మంత్రి యవిద్ధుడు శ్రీరాముడికి సీతను ఇమ్మని నానావిధాలుగా చెప్పారు” అంది.
అదే సమయంలో వానరుల సింహనాదాలు, శంఖాల, భేరుల ధ్వనులు భూమి దద్ధరిల్లేట్లు వినపడ్డాయి. ఆ ధ్వనులకు రాక్షసులు భయపడి ప్రాణాలమీద ఆశలు వదులుకున్నారు. వానరులు చేస్తున్న ధ్వనులు దిక్కులు పిక్కటిల్లేట్లు వ్యాపి స్తుంటే, రాముడు లంక ముట్టడించడానికి వస్తున్న విషయం అర్థం చేసుకున్న రావ ణుడు ఒక్క ముహూర్తకాలం ఏం చేయాల్నా అని ఆలోచించసాగాడు.
ఇంతలో రావణుడి తల్లికి పెదనాన్న అయిన మాల్యవంతుడు ఇలా అన్నాడు. ”రాజధర్మం తెలిపే నీతి విద్యల్లో పండితుడై, నీతిమార్గాన్ని అనుసరించే రాజు, ఐశ్వర్యంతో కూడి చిరకాలం రాజ్యం చేస్తూ, శత్రువులను తనకు లోబర్చుకుం టాడు. కాలానుగునంగా శత్రువుతో సంధి చేసుకోవాల్సి వచ్చినప్పుడు సంధి, యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు యుద్ధం చేసేవాడు తన పక్షాన్ని వృద్ధి చేసుకుని సంపద కలవాడవుతాడు. శత్రువు కంటే తన బలం తగ్గినప్పుడు, లేదా, శత్రువు సమానుడైనప్పుడు సంధి చేసుకోవాలి. ఇప్పుడు రాముడితో సంధి చేసుకోవడమే తగిన కార్యం. రాముడు తన భార్యను తీసుకుపోవడానికి యుద్ధానికి వచ్చాడు. నీ రాజ్యం ఆశించికాదు. కాబట్టి ఆమెను ఇస్తే నీరాజ్యంలో నువ్వు, ఆయన రాజ్యంలో ఆయన సుఖంగా వుండవచ్చు” మాల్యవంతుడి మాటలు రావణుడికి నచ్చలేదు.
కోపంతో కళ్లెర్రచేసి, పెద్దవాడన్న గౌరవం కూడా లేకుండా, సభలో అందరూ వినేట్లు ”రాముడిలో, నాలో లేని సామర్థ్యం ఏముందని మాట్లాడావు? నేను రాక్షసులంద రికీ ప్రభువును. విశేష పరాక్రమవంతుడైన నన్ను ఎందుకు నీచుడిగా లెక్కించావు? సీతను దండ కారణ్యం నుండి తెచ్చిన నేను ఇప్పుడు రాముడికి బెదిరి అప్పగించాలి? వానరులతో, లక్ష్మ ణుడితో, సుగ్రీవుడితో కూడిన రాముడిని యుద్ధభూమిలో నేను గద్దలపాలు చేస్తుంటే నువ్వే చూస్తావు. వీరాగ్రణి రావణుడు యుద్ధకేళికి భయపడతాడా? రాముడు నీ అభి ప్రాయం ప్రకారం గొప్పవాడే కావచ్చు. వాడేకాదు, వాడికి నూరింతలు ఎక్కువ గొప్పవాడు వచ్చినా నేను లోబడేవాడిని కాను. రామచంద్రుడు వానరులతో ఇక్కడికి వస్తే మళ్లి దేహంతో తిరిగి పోలేడని ప్రమాణం చేసి చెప్తున్నాను.” అన్నాడు. తరువాత రావణుడు లంకకు అన్ని వైపులా రాక్షసులను నియమించాడు. తూర్పు పక్కన వున్న పురద్వారాన్ని రక్షించడానికి ప్రహస్తుడిని, దక్షిణాన మహోదర, మహాపార్శ్వులను నిలిపాడు. పడమటి దిక్కున ఇంద్ర జిత్తును వుంచాడు. ఉత్తరపు దిక్కు శుక సారణులను పంపి అక్కడికి తానే వస్తానని చెప్పా డు. ఈవిధంగా రక్షకులను నియమించి అంత:పురా నికి వెళ్లాడు రావణుడు.
(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)
– వనం జ్వాలా నరసింహారావు
8008137012
సీత ఎదుట రాముడి కల్పిత శిరశ్చాపం!
Advertisement
తాజా వార్తలు
Advertisement