Friday, November 22, 2024

రామానుజాచార్యులు… భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తి

వెయ్యేళ్ల క్రితమే అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం
‘సమతా మూర్తి’ బోధనలు అనుసరణీయం
సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ఏపీ సీఎం జగన్‌
సమానత్వం కోసం ప్రపంచంలో ఎందరో పోరాడారు: చినజీయర్‌ స్వామి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సమాజంలో అసమానతలు రూపు మాపేందుకు రామానుజాచార్యులు వెయ్యేళ్ల క్రితమే కృషి చేశారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. అస మానతలకు వ్యతిరేకంగా ఆనాడే పోరాడారని సీఎం గుర్తుచేసుకున్నా రు. హైదరాబాద్‌ శంషాబాద్‌ సమీపంలోని ముచ్చింతల్‌లో నిర్వహిస్తు న్న రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవా రం గన్నవరం విమానాశ్రయం నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు సాయంత్రం చేరుకుని సీఎం జగన్‌ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ ఇంతటి గొప్ప కార్య క్రమం నిర్వహిస్తున్న చినజీయర్‌ స్వామికి ఆయన అభినంద నలు తెలిపారు. రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. శ్రీరామానుజ బోధనలు అనుసరణీ యమని చెప్పారు. సమతామూర్తి వెయ్యేళ్ల క్రితమే సమానత్వాన్ని బోధించారన్నారు. భావితరాలకు ఆయన ప్రేరణగా నిలిచారన్నారు. అసమానతలు రూపుమాపేందుకు రామానుజాచార్యులు కృషి చేశా రన్నారు. రామానుజ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లా లని తెలిపారు. అందరూ సమానులే అనే సందేశం ఇచ్చేందుకే సమతా మూర్తిని స్థాపించారన్నారు. సమతామూర్తి భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తి గా నిలుస్తారన్నారు. అంతకుముందు సంప్రదాయ దుస్తుల్లో ప్రవచన మండపానికి సీఎం జగన్‌ చేరుకుని ప్రవాస భారతీయ చిన్నారుల విష్ణు సహస్రనామ అవధానం కార్యక్రమాన్ని వీక్షించారు. కార్యక్రమం అనంతరం ఆధ్యాత్మిక వేత్త జూపల్లి రామేశ్వరరావు.. జగన్‌కు రామా నుజాచార్యుల ప్రతిమను బహూకరించారు. అనంతరం సమతా మూర్తిని సీఎం జగన్‌ దర్శించుకోగా సమతామూర్తి కేంద్రం, విగ్రహ విశిష్టతను జగన్‌కు చినజీయర్‌ స్వామి వివరించారు.

రామానుజులు సమానత్వం కోసం పోరాడి సాధించారు: చినజీయర్‌ స్వామి
సమానత్వం కోసం పోరాడి రామానుజాచార్యులు విజయం సాధించారని చినజీయర్‌ స్వామి అన్నారు. దేశంలో సమాజ సేవ, మంచి జరగాలని ఆకాంక్షించా రని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో అన్ని వర్గాలకు క్షేమం జరగాలని కోరుకునే వారిని ఈ ఉత్సవాల
కు ఆహ్వానిస్తున్నామ న్నారు. ఈ ఉత్సవాల ద్వారా సమతా స్ఫూర్తి ని సమాజానికి అందిచాల న్నారు. సమత కోసం అబ్రహం లింకన్‌ సమాజంలో అంతరాలు తొలగించేందుకు కృషి చేశార న్నారు. నల్ల, తెల్ల జాతీయుల మధ్య అంతరాలు తొలగించేందుకు కృషి చేశారని ఆయన గుర్తుచేశారు. మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ సైతం అసమానతలపై పోరాడా రని, నల్లజాతీయుల ఉన్నతి కోసం నెల్సన్‌ మండేలా పోరాడారని తెలిపారు. రామానుజాచార్యులు సమానత్వం కోసం పోరాడి విజయం సాధించారని చినజీయర్‌ స్వామి అన్నారు.

జగన్‌పై చినజీయర్ ప్రశంసలు
ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌పై చినజీయర్‌ స్వామి ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్‌ నిబద్ధతను చూసి ఆశ్చర్యపోయానన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్యను అందిస్తున్న వైఎస్‌ జగన్‌ను చినజీయర్‌ అభినందించారు. ప్రతి పాలకుడు అందరినీ సమానంగా చూస్తూ వారి అవసరాలను గుర్తించి వాటిని పూర్తి చేయాలన్నారు. విద్య, ధనం, వయస్సు, అధికారం నాలుగు కలిగి ఉన్నవారు ఇతరుల సలహాలు తీసుకోవడానికి ఇష్టపడరు. కానీ ఇవన్నీ ఉన్న వైఎస్‌ జగన్‌లో ఎలాంటి గర్వం లేదని చినజీయర్‌ అన్నారు. వైఎస్‌ జగన్‌ అందరి సలహాలను స్వీకరిస్తారు..పాటిస్తారని ప్రశంసించారు. వైఎస్‌ జగన్‌ మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని తాను కోరుకుంటున్నాని చినజీయర్‌ తెలిపారు. సీంఎ జగన్‌ జన్మ నక్షత్రానికి సంబంధించిన విష్ణు సహస్ర శ్లోకాలను చిన్నారులు చదివి వినిపించారు. జగన్‌ జన్మనక్షత్రం స్వయంగా భగవత్‌ రామానుజ నక్షత్రమని చినజీయర్‌ వెల్లడించారు.

వైఎస్‌ఆర్‌ను గుర్తు చేసుకున్న చినజీయర్‌
దివంగత నేత వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డిని చినజీయర్‌ స్వామి గుర్తు చేసుకున్నారు. శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో చినజీయర్‌ మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌…తనకు బాగా తెలుసునని, ముఖ్యమంత్రి కాకముందు తనను కలిశారని గుర్తుచేశారు. ఆయన అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని తెలిపారు.

- Advertisement -

సంప్రదాయ దుస్తుల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌వెూహన్‌రెడ్డి
సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ఏపీ సీఎం జగన్‌ సంప్రదాయ దుస్తులలో రామానుజాచార్యులను దర్శించుకున్నారు. ప్రవచన మండపానికి వచ్చి చిన్నారుల విష్ణు సహస్రనామ చిన్నారుల అవ ధానంను వీక్షించారు. అనంతరం రామానుజ కేంద్రం చుట్టూ ఉన్న 108 దివ్య దేశాలతోపాటు 216 అడుగల ఎత్తయిన విగ్రహాన్ని, యాగ శాలను దర్శించి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అంతకుముందు లేజర్‌షోను తిలకించారు. అనంతరం ఆయన ఏపీకి తిరుగు ప్రయా ణమయ్యారు. సీఎం వెంట పలువురు ప్రముఖులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement