హైదరాబాద్, ఆంధ్రప్రభ : నేటి నుంచి శంషాబాద్ ముచ్చింతల్‌లోని చినజీయర్ ఆశ్రమంలో రామాను జాచా ర్యుల వెయ్యేళ్ల పండుగ ప్రారంభం కాబోతోంది. ఈ మహొత్సవం ఈనెల 14వ తేదీ వరకు జరగనుంది. దీనిని తిలకించ డానికి దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ప్రముఖులు తరలిరానున్నారు. రామాను జాచార్యులు ఇచ్చిన సమతా సందేశాన్ని ప్రపంచానికి చాటేందుకు 216 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు 1035 కుండాలతో మహాయజ్ఞం నిర్వ హించ బోతున్నారు. మొదటి రోజు నుంచి యజ్ఞయాగాలు, పూజా తంతులు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 5న స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరుతో నిర్మించిన రామాను జాచార్యుల విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించ నున్నారు. ఫిబ్రవరి 13న 120 కిలోల బంగారు రామాను జాచార్యుల విగ్రహాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిండ్ ప్రారం భించనున్నారు. ఇలా రోజుకోక ప్రముఖుడు సందర్శిం చనున్నారు.సుమారు 150 మంది ప్రముఖులు ఈ క్రతువులో పాల్గొన బోతున్నారు. 8, 9వ తేదీల్లోసాధువులు, సంతులు పాల్గొంటారు. 14వ తేదీ వరకు ఇక్కడ జరిగే కార్య క్రమాలకు అందరూ హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. యాగాలు జరుగుతున్న రోజుల్లోఅందరూ హాజరు కావొచ్చని నిర్వాహకులు తెలిపారు. వచ్చిన వారికి ఉచిత భోజన ఏర్పాట్లు కూడా చేశారు.
ఒకే చోట్ల 108 దివ్యక్షేత్రాలు..
ఆ ప్రాంతమంతా 9తో ముడిపడి ఉంటుంది. ప్రాంగణంలో 108 దివ్య క్షేత్రాలను ఆయా క్షేత్రాల నుంచి మట్టిని తీసుకొచ్చి నిర్మించారు. దేశవ్యాప్తంగా ఉన్న వీటిని ఒకే చోట చూసే అనుభూతి కలుగుతోంది. 216 అడుగుల సమతామూర్తి విగ్రహం చేరుకోవడానికి 108 మెట్లను నిర్మించారు. ప్రతి క్షేత్రాన్ని రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల నుంచి తెచ్చిన రాయితో నిర్మించారు. కాకతీయులు, చోళులు, పాండ్యులు కళా సంస్కృతి ఆ క్షేత్రాల్లో ఉట్టిపడుతోంది.
1.50 లక్షల కిలోల నెయ్యి…
తోటి ప్రాణికోటిని కాపాడితేనే మన ఉనికి ఉంటుందని గ్రహిం చాలి. కరోనావంటి వైరస్‌లు బాహ్య ంగా కనిపిస్తాయి. అంతర్లీ నంగా మనలోనూ అనేక జాడ్యాల వైరస్ ఉంటుంది. బాహ్య, అంతర్లీన రుగ్మతలను పోగొట్టేం దుకే లక్ష్మీనారాయణ యాగం, సమతామూర్తి విగ్రహా విష్కరణ అని చినజీయర్ స్వామి చెప్పారు. వీటన్నింటిని ప్రాలదోలేందుకు యాగంలో 1.50 లక్షల కిలోల స్వచ్ఛమైన ఆవునెయ్యి వాడబోతున్నారు. ఇది అలాంటి ఇలాంటి నాసిరకం నెయ్యి కాదు. మూపురం, గంగడోలు ఉన్న దేశీయ ఆవుల పాలనుంచి శాస్త్రీ యంగా, సంప్రదాయ విధానంలో పాలుకాచి, తోడు పెట్టి, చిలికి, వెన్నతీసి, దానిని కాచి తీసిన నెయ్యితో పూజా కార్యక్రమాలు చేయబోతున్నారు. అలా వాడిన నెయ్యివల్ల హోమ గుండాల నుంచి వచ్చే పొగ వల్ల పర్యావరణం మెరుగుపడుతుందని స్వామీజీల భావన.
ఆశ్రమానికి బస్సులు
నగరం నుంచి శంషాబాద్‌లోని ముచ్చింతల్ రామానుజాచార్యుల వెయ్యేళ్ల పండుగ ఉత్సవాలకు వెళ్లాలనుకునే వారికి సిటీ బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈసీఐఎల్, హయత్‌నగర్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్ ఇలా నగరంలోని ప్రధాన కూడలి నుంచి ఉదయం నుంచి బస్సులను అందు బాటులో ఉంచారు. ఉదయం 6 గంటల నుంచే బస్సులు అందుబాటులో ఉంటాయి.
ఉదయాన్నే యాగం.. రాత్రి అంకురార్పణ…
సమతామూర్తి విగ్రహ స్థలానికి సమీపంలో 1035 యాగకుండాలు ఏర్పాటు చేశారు. యాగశాలలు, కుండాల్లో వాడే అన్ని వస్తువులు, పదార్థాలు పూర్తిగా దేశీయమే. ఆవుపేడ, ఇటుక, మట్టితో చేసిన కుండలనే ఇందులో వాడుతున్నారు. తాటాకు పందిళ్లు… నారతో చేసిన కర్టెన్లు, పిండి ముగ్గు… అన్నీ సంప్రదాయ పద్ధతులే. చివరకు హోమ గుండాల్లో అగ్నిని రాజేయడం కూడా పురాతన శాస్త్రీయ విధానంలోనే. జమ్మిదిమ్మ, రావి పుల్లలు మధి ంచి అగ్నిని పుట్టిస్తారు. ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం ప్రారంభమయ్యే యాగం ప్రతి రోజూ 11.45 వరకు సాగుతుంది. అదే రోజు రాత్రి అంకురార్పణ చేస్తారు. పూర్ణా హుతితో పూర్తవుతుంది. సకల (9) వేద పారాయణలు ఉంటాయి. ఇష్టియాగశాలలూ ఉంటాయి. విష్ణుసహస్ర పారా య ణలు, సంకల్ప యాగశాలలు ఏర్పాటు చేశారు.
పేర్లు నమోదు చేసుకోవాలి…
సామాన్య భక్తులు పారాయణల్లో పాల్గొనా లనుకుంటే అప్పటికప్పుడు ఆ సంకల్ప శాలల్లో పేర్లు నమోదు చేసుకుని పాలుపంచుకోవచ్చు. ఒక్కో యాగ శాలలో 27మంది పండితులు భాగస్వాము లవు తారు. ఆ లెక్కన దాదాపు 5వేలమంది ఈ క్రతువు లో పాల్గొంటారు. 14 తేదీ సాయంత్రంతో యాగం పూర్తవుతుంది. యాగశాలలో వాడే మట్టి పాత్రలు రాజస్థాన్ నుంచి తెప్పించారు. పాలు ఉత్తరాది నుంచి తెప్పించారు.
6వేల ఆవులను సాకి నెయ్యి…
ఆశ్రమంలో 600 దేశీయ ఆవులను సాకి శ్రేష్టమైన నెయ్యిని తీశారు. ఇలా ప్రకృతిని పరవశింపచేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్రతువు జరిగే రోజుల్లో మొత్తంమీద 10 కోట్లసార్లు అష్టాక్షరీ మంత్రోచ్ఛారణ జరుగుతుంది. 9 రూపాల్లో యాగకుండాలుంటాయి. ముచ్చింతల్ ఆశ్రమంలో ఏమేమి విశేషాలు ఎక్క డెక్కడ ఉన్నాయో చూసేందుకు ఓ డిజిటల్ ఆడిటో రియం ఉంది. భారీ తెర, సీటింగ్ ఏర్పాట్లు ఉన్నాయి.
నేటి నుంచి రామానుజుల సహస్రాబ్ది వేడుకలు
Advertisement
తాజా వార్తలు
Advertisement