Monday, November 18, 2024

రామానుజ సహస్రాబ్ది సమారోహం శాస్త్రోక్తంగా లక్ష్మీనారాయణ యాగం

హైదరాబాద్‌/శంషాబాద్‌, ఆంధ్రప్రభ: భగవద్రామానుజుల సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా గురువారం పెద్దజీయర్‌ స్వామివారి ప్రత్యేక పూజలు, లక్ష్మీనారా యణ యాగంతో ముచ్చింతల్‌లోని శ్రీరామనగరం పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంతో శోభిల్లింది. సహస్రాబ్ది వేడుకల్లో రెండోరోజు ఉదయం త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌ స్వామివారి స్వీయ పర్యవేక్షణలో యాగశాల లక్ష్మీనారాయణ యాగానికి శ్రీకారం చుట్టారు. మరోవైపు ప్రవచన వేదికపై పెద్దజీయర్‌ స్వామివారి అష్టోత్తర పూజ నిర్వహించారు. ఈ మహాక్రతువులో భాగంగా ప్రధాన ఘట్టమైన శ్రీలక్ష్మీనారాయణ మహాయాగాన్ని వేదపండితులు నిర్వహించారు. ప్రధాన యాగ మండపంలో శమి, రావి కర్రలతో బాలాగ్నిని రగిలించారు. 9 నిమిషాల్లో అగ్ని ఉద్భవించింది. ఆ అగ్నిహూత్రాన్ని పెద్దది చేస్తూ 1035 కుండలాలు ఉన్న యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేశారు.
నాలుగు భాగాలుగా యాగశాలలు
పవిత్ర యాగశాలను ప్రధానంగా నాలుగు భాగాలుగా విభజించినట్టు త్రిదండి చిన్నజీయర్‌ స్వామి వారు వెల్లడించారు. శ్రీరంగ క్షేత్రానికి ప్రతీకగా యాగశాల కుడివైపు భాగానికి భోగ మండపమని, తిరుమల క్షేత్రాన్ని స్మరించేలా మధ్య భాగానికి పుష్ప మండపమని, కాంచీపురానికి గుర్తుగా వెనుకవైపు ఉన్న భాగానికి త్యాగ మండ పమని, మేల్కోట క్షేత్రానికి సంకేతంగా ఎడమవైపు ఉన్న మండపానికి జ్ఞాన మండ పమని నామకరణం చేసారు. అనంతరం 114 యాగశాలల్లో శ్రీ లక్ష్మీనా రాయణ మహాక్రతువు ప్రారంభమయింది. చిన్నజీయర్‌ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో అయోధ్య, మహారాష్ట్ర, తమిళనాడు, నేపాల్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ స్వాములు హాజరై శ్రీలక్ష్మీనారాయణ మహాయాగాన్ని నిర్వహించారు. పలు రాష్ట్రాల నుంచి హాజరైన వైష్ణవ స్వాములకు మైహూమ్‌ గ్రూప్‌ సంస్థల అధినేత డాక్టర్‌ జూపల్లి రామేశ్వరరావు దీక్షావస్త్రాలను సమర్పించారు.
5 వేల మంది రుత్విజులు వేదమంత్రాలు చదువుతుండగా స్వచ్ఛమైన ఆవు నెయ్యితో హోమ క్రతువును నిర్వహించారు. దివ్య ప్రబంధాలు, భగవద్గీతలోని ప్రధా న అధ్యయనాలు, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తూ ఉజ్జీవన యజ్ఞం పూర్తిచేసారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు తెలంగాణ ఆర్థికశాఖామాత్యులు తన్నీరు హరీశ్‌ రావు ఉత్సవాల ఏర్పాట్లను పర్య వేక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, నగరి ఎంఎల్‌ఏ రోజా పాల్గొని చిన్నజీయర్‌ స్వామి మంగళాశాసనాలు అందుకున్నారు.
పెద్దజీయర్‌కు అష్టోత్తర పూజ
మరోవైపు ప్రవచన మండపంలో ప్రారంభంగా పెద్జ జీయర్‌ స్వామి వారి పూజా కార్యక్రమాన్ని భక్తులచే చిన్న జీయర్‌ స్వామి స్వయంగా ఆచరింపజేసి మంగళనీరాజ నాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సుమారు 2 వేల మంది భక్తులు పెద్ద జీయర్‌ స్వామివారిని పూజించారు. పెద్దజీయర్‌ స్వామివారి ప్రతిమను, పూజా సామాగ్రిని ఇచ్చి అర్చన ఎలా చేయాలో స్వయంగా చెప్పి చేయించారు. ఈ సందర్భంగా పెద్ద జీయర్‌ స్వామి వారి అష్టోత్తర శతనామావళిని చిన జీయర్‌ చెబుతూండగా అంద రూ పఠించారు. ఈ సందర్భంగా శ్రీచిన్న జీయర్‌ స్వామి వారి యొక్క సన్యాసాశ్రమ స్వీకార విశేషాలను స్వామివారి ఔన్నత్యాన్ని గురించి మహూమహూపాధ్యాయ డా.సముద్రాల రంగరామానుజులవారు వివరించారు. ఈ కార్యక్రమంలో నేపాల్‌ నుంచి విచ్చేసిన శ్రీమాన్‌ కృష్ణమాచార్యులవారు పాల్గొన్నారు. అనంతరం బ్రహ్మశ్రీ డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్‌ గారి ప్రసంగం భగవద్రామానుజ వైభవంపై అన ర్గళంగా సాగింది. సాంస్కతిక కార్య క్రమాల్లో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక గాయని సురేఖామూర్తి బృందం భక్తి గీతాలు అలరించాయి. శ్రీపాద రమాదేవి నృత్యం, నర్సింహారావు బృందం భజనలు, ప్రణవి నృత్యం, కిళాంబి శ్రీదేవి సంగీతం విశేషంగా ఆకట్టుకున్నాయి. సాయంకాలం ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు తారక రామారావు ప్రత్యేక కార్యక్రమం, చెన్నై నుంచి విచ్చేసిన మాధవపెద్ది బృందం నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాయంత్రం ఇష్టిశాలల వద్ద దుష్టనివారణకు శ్రీ సుద ర్శనేష్టి, సర్వాభీష్టసిద్ధికి శ్రీవాసుదేవేష్టిని చేసారు. ప్రతిరోజూ హోమాలు పూర్తయిన తరువాత ఆజ్యపూర్ణాహుతి నిర్వహిస్తారు. చివరిరోజు మహా పూర్ణాహుతి ఉంటుంది.
ప్రత్యేక కమాండ్‌ కంట్రోల్‌ రూం…
సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధానితో పాటు వీవీఐపీలు వస్తుండటంతో ఆ ప్రాంగణాన్నంతా ఎస్‌పీజీకి చెందిన ప్రత్యేక భద్రతా దళాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. విగ్రహ ప్రాంగణానికి ముందు పార్కింగ్‌ ఏరియాకు ఎదురుగా ఉన్న భవనంలో పోలీసుల కమాండ్‌ కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి పోలీసుల భద్రత ఏర్పాట్లు, ఇతర సమాచారాలన్నింటికి కూడా కమాండ్‌ కంట్రోల్‌ రూం పనిచేస్తోంది. ఎస్‌పీజీతో పాటు ఆక్టోపస్‌, ప్రత్యేక కమాండోలు భద్రత కోసం రంగంలోకి దిగారు.
ఉత్సవాలకు రంగ, గోద, యతి అశ్వాలు…
సమతామూర్తి సహస్రాబ్ది సమరోత్సహ వేడుకల్లో భాగంగా దేవతా మూర్తుల రథోత్సవం ముందు నడిపించేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వ్యాసాశ్రమం నుంచి రెండు శ్వేత అశ్వాలను రప్పించారు. రంగ, గోద అనే పేర్లుగల అశ్వాలను ఆశ్రమంలో దేవతామూర్తులను బయటికి తీసుకొచ్చే సమయంలో ముందుగా నడిపిస్తారు. వీటితో పాటు చినజీయర్‌ స్వామి ఆశ్రమంలో ఉన్న యతి అశ్వం కూడా ఉత్సవాల్లో పాల్గొంది.

ప్రధాని రాక కోసం హెలిపాడ్‌ సిద్ధం
సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల 216 అడుగుల భారీ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 5న జాతికి అంకితం చేయనున్నారు. ఇందుకోసం ముంద స్తుగా ముచ్చింతల్‌లోని యాగశాల సమీపంలో ప్రత్యేక హెలిపాడ్‌ సిద్ధం చేశారు. ప్రధాని సందర్శించే యాగశాల, సమతామూర్తి కేంద్రం పరి సరాల్లో భద్రతా సిబ్బ ంది హెలికాప్టర్‌తో ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తున్నారు. శంషాబాద్‌ విమా నాశ్రయంలో దిగాక హెలికాప్టర్‌లో ప్రధాని ముచ్చింతల్‌ చేరుకోనున్నారు. హెలిపాడ్‌లో దిగక ముందే సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని విహంగ వీక్షణం చేస్తారు. ఇందుకోసం కేం ద్ర బృందం ముమ్మరంగా ట్రయల్స్‌ నిర్వహిస్తోంది. ఇప్పటికే కేంద్ర బలగాలు సమ తామూర్తి ప్రాంగణాన్ని ఆధీనంలోకి తీసు కున్నాయి. ఎస్‌పీజీ డీఐజీ నవనీత్‌ కు మార్‌ మెహతా ఆధ్వర్యంలో ప్రతి ప్రాంతాన్ని సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వ హిస్తున్నారు. రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు హాజరయ్యారు. ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించారు. కరోనా నిబ ంధనలు అమల వుతు న్నాయో, లేదో చూశారు. మరోవైపు 5న ప్రధాని పర్యటన ఏ ర్పాట్లపై ఉన్నతాధికారులతో సీఎస్‌ సమీక్షించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో పాటు డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులతో నిర్వహిం చిన సమావేశంలో ప్రధాని పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. ముచ్చింతల్‌కు వీవీఐపీల తాకిడి ఎక్కువగా ఉండ డంతో భద్రతను కట్టుదిట్టం చేశారు.

టీటీడీ ప్రత్యేక సేవలు…
ఉత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం తమ వంతు పాత్ర పోషిస్తోంది. ప్రాంగణంలో తిరుమల తిరుపతి ప్రాసస్త్యం, తిరుమల నాడు-నేడు వ్యత్యాసాలు తెలిపే పలు ఛాయా చిత్రాలతో ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు. చిత్ర ప్రదర్శన కూడా నిర్వహిస్తున్నారు. విభిన్న రకాల కార్యక్రమాల్లో సహకరించేం దుకు టీటీడీ 35 మంది సిబ్బమంది రెండు వారాల పాటు ఇక్కడే ఉండనున్నారు. మరో 500 మంది వేద పారాయణం చేసేవారు, మ్యూజిక్‌ కాలేజీ నుంచి ఆర్టిస్టులు, హరికథ కళాకారులు, వాయిధ్యా కారులు వచ్చారు.
నేటి కార్యక్రమాలు
శుక్రవారంనాడు యాగశాలలో శ్రీలక్ష్మీనారాయణష్టి, సత్సంతానానికై వౖౖెన తేయఇష్టి, శ్రీలక్ష్మీనారాయణ అష్టోత్తర శతనామ పూజ జరుగనున్నాయి. ఫిబ్రవరి 5న భారత ప్రధాని శ్రీనరేంద్రమోడీ చేతుల మీదుగా 216 అడుగుల సమతామూర్తి భగవద్రామానుజుల విగ్రహం జాతికి అంకితం చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement