Friday, November 22, 2024

మాటల బంధమే రామకథ

రామాయణం వాల్మీకి రమణీయంగా రాసారు. తరచి తరచి శోధిస్తే దాంట్లో అన్ని శాస్త్రాలు దర్శనమిస్తాయి. శ్రీరాముడు ధర్మానికి నిలువెత్తు నిదర్శనం. ఆయన మాటే వేదప్రమాణం. అందుకే ఒకే మాట… ఒకే భార్య.. ఒకే బాణం’ అంటారు. ఆయన స్మిత పూర్వభాషి. చిరునవ్వుతో ఎదుటి మని షిని ముందుగా పలకరించేవారు. రామాయణంలో సంఘట నలు అన్నీ మాటల బంధంతో కథ నడుస్తుంది.
దశరథుడు చిన్న భార్య కైకేయికి వరాలు ఇస్తున్నట్లు ఇచ్చి నమాట వల్లే రాముడు అరణ్యానికి వెళ్లవలసి వచ్చింది. ఆ మాట కోసమే దశరథుడు తన ప్రాణాలు పణంగా పెట్టవలసి వచ్చింది. విశ్వామిత్రుడికి ఇచ్చిన మాట మేరకే రాముడు శివ ధనుస్సు ఎత్తాడు. జనకుడు సీతను వివాహం చేసుకోమని కోర గా తన తండ్రి దశరథుడు చెబితేగాని చేసుకోనని, ఆయన మాట చెబితే అభ్యంతరం లేదన్నాడు. దశరథుడి మాటను సత్యంలో నిలబెట్టాలని రాముడు ధర్మపత్ని సీత, సోదరుడు లక్ష్మణుడితో అరణ్యానికి వెళ్లాడు. దండకారణ్యంలో ప్రవేశిం చి ఋషులకు రక్షణ కల్పిస్తానని మాట ఇచ్చాడు. రాముడు జన్మస్థానంలోని పంచవటిలో పర్ణశాల నిర్మించుకుని నివశించాడు. శూర్ప ణఖ ప్రవేశించి రాముడిని చూసి కామించి, సీత అనాకారి, ఆమెకంటే నేను అందమైనదానినంటూ, తనను పెళ్లి చేసుకోమంది. అంత రాముడు తాను భార్య కలవాడుగా, ఏకపత్నీవ్రతుడు కాన లక్ష్మణుడు భార్యలేనివాడు అతని ని వరించమన్నాడు. లక్ష్మణుడు తాను అన్నగారి దాసుడను, దాసుడు భార్య అయితే దాసిగా మారుతుంది కావున, రాముడు రాజు కావున ఆయనను పెళ్లి చేసుకుంటే రాణి అవుతావని చెప్పాడు. ఇద్దరూ అలా మాటలతో శూర్పణఖ ను మాయ పుచ్చితే వెళ్లిపోతుందని తలచారు. కాని శూర్పణఖ ఎవరో ఒకరు దొరికితే చాలు అని కాముకిలా ప్రవర్తించింది. ఆమె ఎంతకీ వినకపోవడంతో లక్ష్మణుడు ఆమె చెవులు, ముక్కు కోసి పరాభవం చేసాడు. దాంతో ఆమె కోరి క ద్వేషంగా మారింది. రామలక్ష్మణులను చంపాలని సమీపంలో ఉన్న ఖర ధూషణాదులకు తన అవమానం గూర్చి చెప్పింది. ముని వేషంలో ఉన్న సన్యాసులు తనను అవమానం చేసారని తెలిపింది. శూర్పణఖ మాటలకు ఖరధూషణాదులు 14వేల సైన్యంతో రామునితో యుద్ధానికి సిద్ధపడ్డారు. రాముడు తన బాణాలతో వారందరిని హతులను చేసాడు. శూర్పణఖ మాట లకు యుద్ధానికి వెళ్లి వారు చనిపోయారు. శూర్పణఖ ద్వేషం మరింత బలపడి సరాసరి సోదరుడు రావణుని వద్దకు వెళ్లింది. అతని వద్ద సీతను అతి లోక సుందరి, నీకు భార్య కావలసిన స్త్రీ ,ఆమె భర్త రాముడు దండకారణ్యం లో ఖరధూషణాదులతో సహా రాక్షసులను చంపుతున్నాడని తెలిపింది. దండకారణ్యాన్ని రాక్షసులులేనిదిగా చేస్తానని ప్రతిజ్ఞ చేసాడని, అతనితో నీకు ప్రమాదం పొంచి ఉన్నదని భయం కలిగించింది. శూర్పణఖ మాటలతో విచక్షణ మరచిన రావణుడు సీతను అపహరించాలని నిర్ణయించారు.
మారీచుని పిలిపించాడు. మారీచుడు ఏ రూపానికైనా మారగలడు. బంగారు జింకగా మారి సీతను ఆకర్షించి రాముని అడవికి దూరంగా తీసుకు వెళ్లమని రావణుడు ఆదేశించాడు. అప్పటికే రెండుసార్లు చావు తప్పించుకు న్న మారీచుడు రావణుడుతో రాముడితో వైరం నీకు మంచిదికాదని మాటల తో చెప్పి చూసాడు. సీతాపహరణ నీకు, లంకకు చేటు తప్పదన్నారు. సీత తన ను తాను రక్షించుకునే సత్తా ఉందని, అపహరణ అంత సులభం కాదన్నా డు. మారీచుడు ఎన్ని హతం కోరే మాటలు చెప్పినా రావణుడు పట్టించుకోలే దు. నేను చెప్పింది చేస్తావా.. నా చేతిలో చస్తావా? అని బెదిరించాడు. చావు ఎలా గెనా తప్పదని, నీ చేతిలో చావడంకన్నా రాముడి చేతిలో చావడం మేలని మనస్సులో అనుకుని, రావణుడి నాశనం తప్పదని సరేనన్నాడు. బంగారు మచ్చల లేడిగా రాముడి పర్ణశాల దగ్గరలో తచ్చాడాడు. ఎట్టకేలకు సీత కంట పడింది. సీత ఆ జింకపిల్ల పట్ల మోజుపడి రామునితో అది నాకు కావాలని కోరింది. సజీవంగా తెస్తే అయోధ్యకు తీసుకువెళదామని, చనిపోతే దాని చర్మంమీద నీవు ధ్యానం చేయవచ్చంది. వెంటనే లక్ష్మణుడు అన్నా ఇది రాక్షస మాయ కావచ్చు. బంగారులేడి అనేది ఈ భూ ప్రపంచంలోనే అసా ధ్యం.ఇది మారీచుడి మాయాజాలం అని నా అనుమానం అన్నాడు. కాని సీత ఎప్పుడూ కోరని కోరిక కోరడంతో రాముడు సరే అన్నాడు. సీత కూడా లక్ష్మణుని మాటలను పట్టించుకోలేదు. రాముడు జింకను పట్టుకోవడానికి బయలు దేరాడు. కాని అది దొరికినట్లే దొరికి తప్పించుకుంటున్నది. తాను ఉన్నచోటి నుంచి బాణం వేసి జింకను చంపగలడు. కాని అది లక్ష్మణుడు అనుమానించినట్లు మారీచుడేనా అన్న అనుమానం రాముడి మనసులో ఉంది. కాకపోతే ఎలాగైనా జింకను సజీవంగా పట్టుకోవాలని భావించాడు. అలా వెళ్లగా చివరకు చిక్కకపోవడంతో బాణం వేసాడు. మారీచుడు చనిపో తూ హా సీతా..హా లక్ష్మణా అంటూ రాముని గొంతుతో ఆర్తనాదం చేసాడు.
దాంతో సీత ఆందోళనతో లక్ష్మణుడితో రాముడు ఆపదలో ఉన్నాడు.. వెళ్లి సహాయం చేయి అంది. లక్ష్మణుడు అన్నకు ఆపద తలబెట్టేవాడు ఈ లో కంలోనే లేడు, అది రాక్షస మాయ అని ఊరట కలిగించాలని చూసాడు. కాని సీత భర్తకు ఆపద వచ్చిందని వికల మనస్సుతో ఉంది. లక్ష్మణుని వెళ్లమంటే శుష్కమైన మాటలు చెబుతున్నారని, అతనిని నీవు నన్ను ఆశించి ఇలా చేస్తు న్నావు. నీవు రాముడికి ఎప్పుడు ఆపద వస్తుందోనని ఎదు రు చూస్తున్నావని, నీవు భరతుడు కలసి కుట్ర చేసారని మాటలతో నిందించింది. లక్ష్మణుడు తల్లిd! నన్ను అపార్థం చేసుకుంటున్నావు, నేను అన్నగారి ఆజ్ఞకు కట్టుబడి,నీ రక్షణకు ఉన్నానని ఎంత చెప్పినా సీత నిందించడం మానకపోవడంతో వికల మనస్కుడై రాముని వెతుకుతూ అడవి దారిపట్టాడు. ఆ తర్వాత రామలక్ష్మ ణులు లేని ఒంటరి సీత కోసం అదృశ్యంగా ఉన్న రావణుడు సన్యాసి వేషంలో భవతి భిక్షాందేహ అంటూ పర్ణశాల ముం దు ప్రత్యక్షమయ్యాడు. సీత తన వివరాలు ఆ సన్యాసికి అంత ఆందోళనలోనూ చెప్పింది. నీవు ఎవరు? ఈ అర ణ్యంలో మా పర్ణశాలకు ఏల వచ్చారు అని ప్రశ్నించింది. రావణుడు తన నిజ రూపం చూపించి సీత లావణ్యాన్ని పొగుడుతూ ఆ సన్యాసిరాముడి కంటే నేను అన్నింటా బలవంతుడను, నన్ను చేపట్టి నా రాణివికా అన్నాడు. సీత రాముని పరాక్రమం చెప్పి, తనను అపహరిస్తే చావు తప్పదని హచ్చరించిం ది. సీత రావణుని నుంచి తన్నుతాను కాపాడుకోలేదా అనే ప్రశ్న ఇక్కడ రావ చ్చు. కాని పతివ్రతయైన స్త్రీ తన భర్త పరాక్రమంతో తాను విముక్తి పొందాలని భావించే రావణుని బందీగా వెళ్లిందని భావించాలి. రావణసంహారం అనే మహత్కార్యం రాముడి చేతుల మీద జరగాలి కనుక అలా చేసిందని అనుకో వాలి. అందులోనూ వాల్మీకి రామాయణం నర చరిత్రని ఉద్ఘాటించారు కను క సీత, రాముడు నరుల నడవడినే అనుసరించి, మాట మీద నిలబడి నరుల కు మార్గదర్శకులు అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement