భగవంతుడిని ఎన్నో పేర్లతో పిలుస్తూంటాము. కాలగ మనం ప్రకారం విభజించబడిన యుగాలు, ఆ యు గాలలో భగవంతుడి అవతారాలు, ఆయన లీలలు వం టివన్నీ వింటూ ఉంటే ఇవన్నీ ఏమిటి అని అనిపిస్తుంది చాలా మందికి. అయితే ఇలా వివిధ యుగాలలో వివిధ రూపాలలో భగవంతుడు అవతరించడం వెనుక ఒక అర్థవంతమైన వివ రణ, పండితుల విశ్లేషణ ఉంది. భగవంతుని కళ భూమి మీద ప్రసరించి ఒక వ్యక్తి చేత లేదా జీవి చేత లోక కళ్యాణం కోసం ఘనకార్యాలు జరిగేలా చేయడమే అవతరణం.
దశావతారాలు అన్న మాటను మొదటగా కనిపెట్టినవా డు పదకొండవ శతాబ్దానికి చెందిన క్షేమేంద్రుడనే కాశ్మీర కవి. ‘దశావతార చరితమ్’ అన్న క్షేమేంద్రుని గ్రంథం ద్వారా ఈ మాట ప్రజల్లో వ్యాప్తి చెందింది. శ్రీ మహాభాగవతంలో ఇరవై కి పైగానే విష్ణువు అవతారాలను వర్ణించడం జరిగింది. అందు లో కొన్నిటిని ఏరి కూర్చి దశావతారాలని చెబుతున్నారు. జగ న్మోహనీ అవతారం విష్టువు రెండు మూడుసార్లు ధరించిన ట్లు చెప్పబడింది. ఈ అవతార ప్రసక్తి దశావతారాలలో లేదు. దాన్ని పరిణామ క్రమంలో ఎలా ఇరికిస్తారు? భక్తిని, ధర్మాన్ని వెదుక్కొనేవారు పురాణాలు చదవాలి. అందులో ఋషులు ఏం చెప్పదలిచారో వాటిని మాత్రమే గ్రహంచాలి. జీవ పరి ణామ క్రమం గురించి తెలుసుకోదలచినవారు చార్ల్స్ డార్విన్ ”ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్” చదవాలి. మళ్లిd అందులో దశావతారా లు, దేవుని మహమలు వెదుక్కొనే ప్రయత్నం చేయకూడదు.
దశావతారాలలోని పేర్లు చాలా ప్రసిద్ధమైనవే. కనీసం అందులోని పేర్లతోనయినా పారాయణం చేయవచ్చు. దశావ తారాలలో ”రామా కృష్ణా” అన్న రెండే పేర్లకు అంత ప్రశస్తి ఎం దుకు వచ్చింది? దశావతారాలను మొదటి ఆరింటిని ఒక భా గంగాను తర్వాత నాలుగింటిని మరో భాగంగాను విభజించా లి. ఈ రెండో భాగంలోనే రామ, కృష్ణ అవతారాలు ఉన్నాయి. ఇందులో రామ, కృష్ణ రెండు అవతారాల ఆవిర్భావము, అం తర్థానమూ కూడా అయిపోయినవి. బౌద్ధ, కల్కి అవతారాల తో కల్కి ఇంకా ఆవిర్భవించనే లేదు. బౌద్ధరూపంలోని భగ వంతుడు ప్రస్తుతం వౌనంగానే ఉన్నాడు. కాబట్టి చివరి రెం డు అవతారాలు చెప్పుకొనటానికే తప్ప పారాయణ చేయవల సినవి కావు. అందుకే హాయిగా రామాకృష్ణా అనుకుంటే పుణ్యం వస్తుందని ఉచిత సలహా ఇస్తూంటాము.
మొదటి ఆరింటిలో మొదటిదైన మత్స్వాతారం కేవలం వేదోద్ధరణ కోసమే ఆవిర్భవించింది. కూర్మావతారం అమృ తాన్ని సాధించి దేవతలకు అమరత్వ సిద్ధికొరకు ఆవిర్భావమ యినది. భూదేవిని హరణ్యాక్షుడు సముద్రంలో ముంచివేసే సమయంలో శ్రీ మహావిష్ణువు అత్యవసరంగా మూడవదైన ఆది వరాహమూర్తిగా ఆవిర్భవించాడు. హరణ్యాక్షుడిని అం తమొందించడమే ఈ అవతార లక్ష్యము. బాల ప్రహ్లాదుని హ రణ్యకశిపుడు పెట్టే బాధలనుంచి రక్షించి హరణ్యకశిపుని సం హరించటానికి అత్యంత ఆవేశంతో ఉద్భవించినవాడు నార సింహుడు. వరహ, నారసింహ అవతారాలు ఆవేశ అవతారా లు. ఈ రెండూ రౌద్ర రూపాలు. క్రోధం రూపుదాల్చినవారు కనుక ఈ రెండు కూడా పారాయణం చేయదగ్గవి కావు.
వామనుడు బలి చక్రవర్తి కొరకే అవతార మెత్తినాడు. పర శురామావతారం క్షాత్రకుల నిర్మూలనకే అన్న సంగతి తెలిసిందే. అయితే ఒక కుల నిర్మూలన మన్నది అమానుషమై న చర్య. ఇటువంటి అవతారం జపతపాదులకు ఆమోదయో గ్యంకాదు. రాజన్నవాడు ఎలా ఉండాలి, ప్రజలు ఏవిధంగా మసలుకోవాలన్నదానిని నిరూపించి చూపిన శ్రీరాముడు నా టికే కాదు నేటికీ ఆదర్శప్రాయుడే. ఇక శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన గీత సమస్త మానవాళికి సర్వకాల సర్వావస్థల్లో ఉపయోగపడేది. ఈ రెండు అవతారాల ప్రత్యేకత ఇదే. అం దుకే రామా కృష్ణా నామజపం పవిత్రమైనది.
రామా-కృష్ణాస్మరణ ప్రాశస్త్యం..!
Advertisement
తాజా వార్తలు
Advertisement