Tuesday, November 26, 2024

ఓటమికి కారణం చెప్పిన రావణుడు


లంకాధిపతి రావణబ్రహ్మ రాముడుతో యుద్ధంలో ఓడిపోయాడు. శ్రీరామచంద్ర మూర్తి శరాఘాతాలకు యుద్ధభూమిలో నేల కూలాడు రావణాసురుడు. మృత్యుశయ్యపై అవసాన దశలో వున్న సమయంలో శ్రీరామునితో ఇలా అన్నాడు రావణా సురుడు.
”రామా! నీకంటే నేను ఏ విషయంలోనూ తక్కువ కాదు. పైగా నేనే నీకంటే అన్నింటిలో గొప్పవాణ్ణి. నాది బ్రాహ్మణా జాతి, నీది క్షత్రియ జాతి. నేను నీకంటే వయస్సులో పెద్దవాణ్ణి. నా కుటుంబం నీ కుటుంబం కన్నా పెద్దది. నా వైభవం నీ వైభవం కన్నా అధికం. మీ అంత:పుర మందిరమే స్వర్ణ మందిరం. కానీ నా లంకానగరమంతా స్వర్ణమయమే కదా!
నేను బలపరాక్రమాలలో నీకంటే శ్రేష్ఠుడిని. నా రాజ్యం నీ రాజ్యం కంటే పెద్దది. ఇన్ని శ్రేష్టమైన విజ యాలు కలిగి ఉన్నా యుద్ధంలో నీ ముందు ఓడి పోయాను. నాకు తెలిసి దీనికి కారణం ఒక్కటే- నీ తమ్ముడు నీ దగ్గర ఉన్నాడు. నా తమ్ముడు నన్ను వదిలి వెళ్లిపోయాడు.” అన్నాడు బాధ గా. ఆ తరువాత రాముల వారి నిండైన రూపాన్ని చూస్తూ ప్రా ణాలు విడిచాడు.
కుటుంబ పరివారం వెంట ఉంటే ఎంతటి కష్టమైనా, యుద్ధ మైనా విజయం సాధిస్తుంది కుటుంబ పరివారం కలిసి ఉంటే ఆనందం మన వెంటే ఉంటుంది. కుటుంబం దూరమైతే బ్రతుకే భారమవుతుంది. రావణబ్రహ్మ లాంటి వాడే ఓటమి పాలయ్యా డంటే మనలాంటి వాళ్ళ బతుకెంత? అందుకే అందరం కలిసి ఉందాం. విజయాలు సాధిద్దాం !
కుటుంబాలు విచ్చిన్నం కాకుండా ప్రయత్నిద్దాం.
– కైలాస్‌ నాగేష్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement