ఏది న్యాయం? ఏది అన్యాయం? ఒక విధంగా తాత్వి క నిర్వచనం ఇస్తారు. మరొక విధంగా కొందరు లోకరీతికి ప్రాధాన్యం ఇస్తారు. న్యాయం అనేక విధా లుగా నిర్వచించబడింది. ఎంతమందికి ఏమి చెప్పినా, ఎలా చెప్పినా వంటబట్టదు. అయితే దాన్ని చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లని అంటారు. ఇక మనం నిత్యం వంట చేసుకుంటూనే ఉంటాము. అయితే అన్నం అంతా వుడికిందో లేదో తెలుసుకోడానికి మనం ఒక్క మెతుకును మాత్రమే పట్టుకుని చూస్తాము. దాంతో అన్నమంతా ఉడి కిందో లేదో తెలిసిపోతుంది. ఎదుటివారి స్వభావాన్ని తెలు సుకోవాలన్నా మనం ఇలాంటి ప్రయత్నమే చేస్తాము. పైకి మనకు మంచివారిగా కనపడేవారంతా అంత మంచివారు కాకపోవచ్చును అని చెప్పడానికి మనవాళ్ళు గోముఖ వ్యా ఘ్రాలు అన్నారు. మంచి పనులు చేస్తుంటే అవి మనకు ఉప యోగపడకపోయినా, ఇతరులకు ఉపయోగపడితే చాలు అనుకునే మహానుభావులు ఎందరో వున్నారు. అంధుడి చేతిలో దీపం లాంటివారు వారంతా. నిప్పు లేనిదే పొగరా దు అంటారు. ఇది చాలాసార్లు నిజమనే అనిపిస్తుంది. ముందు రాబోయే ప్రమాదానికి సంకేతాలను భగవంతు డు మనకు అందిస్తూనే వుంటాడు. అది గమనించి మసలు కోవాలి. మనం ప్రవాచకుల నోట ఎన్నో ప్రవచనాలను విం టూనే వుంటాము. అవి వినేటప్పు డు, ఛీ! ఇక నుండి మనం న్యాయంగానూ ధర్మంగానూ నడుచుకోవాలి అనుకుంటా రు. అలాగే ప్రసూతి సమయంలోనూ వైరాగ్యం కలుగు తుంది. పసికూనను చూసుకోగానే అంతా మర్చిపోయి, మళ్లిd మామూలే అయిపోతుంది సంసార జీవితం. శ్మశానా నికి మరణించిన వారిని తీసుకు వెళ్ళినప్పుడు అనిపిస్తుం ది, ఇదేనా జీవితం అంటే అని. దీని కోసమేనా ఇన్ని అరాచ కాలు చేస్తున్నాం అని. ఆ తర్వాత ఇంటికి చేరుకోగానే షరా మామూలే అయిపోతుంది. యథాతథముగా అన్నీ మారి పోయాయి. దీన్నే స్మశాన వైరాగ్యం అన్నారు. కొందరు ఎన్నిసార్లు దండనకు గురైనా, ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా, మరలా మామూలుగానే మర్చిపోయి ప్రవర్తిస్తుంటారు. వారి గురించి చెబుతూ కుక్కతోక వంకర అంటుంటాము. ధన మూలం ఇదం జగత్- అంటున్నా, దానిపట్ల వ్యామో హం విడిచిపెడితే అంతా సుఖమే అన్న భావన కలుగుతుం ది. కానీ ఆ క్షణం దాటితే అబ్బే ధనం లేకుండా ఎలా? ఎలా గైనా ధనం సంపాదించి తీరాల్సిందే అనుకుంటారు. కొంద రు తాము గిరి గీసుకుని ఆ గిరిలోనే బ్రతుకుతూ వుంటారు. తమకు తెలిసిందే చాలా గొప్ప అనుకుంటూ జీవిస్తారు. వారే జ్ఞానవంతులన్న భావన కలుగుతుంది. నూతిలో ఉన్న కప్పలాగా బ్రతుకుతున్నారని లోకంలో అలాంటి వారిని గూర్చి చెప్పుకుంటూ వుంటారు. కూపస్థ మండూ కంరా వాడు అంటారు. ఈ లోకంలో ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. అయితే మనలకు మంచినే చేస్తాయని అనుకోరా దు. ఎలాగంటే అగ్నిని చూడగానే మిడత ఆకర్షితమై దగ్గర కు వెళ్ళి వెంటనే మాడి మసైపోతుంది. అనగా మనిషి ఆకర్ష ణలకు లొంగరాదన్న విషయాన్ని ఈ అగ్ని గత శలభం గురించి చెప్పుకుంటాము. మదమత్తులై ఎవరేమి మంచి చెప్పినా పట్టించుకోకుండా, మూర్ఖులలాగా ప్రవర్తిస్తూ వుం టారు. అలాంటివారికి కేవలం గజాన్ని లొంగదీసుకోడానికి అంకుశాన్ని వాడినట్లుగానే మనం అలాంటి ప్రయోగం గావించాలని చెప్పారు. లేదంటే వారిని మార్చడం వీలుపడ దంటే పడదు. జయాపజయాలు మన చేతుల్లో లేవంటా రు. కానీ అపజయం కలిగినప్పుడు కొందరు ఎంతో దిగాలు పడిపోతారు. అలా బెంబెెలెత్తకుండా ప్రతి మనిషి తనను తాను తిరిగి ద్విగుణీకృతోత్సాహంతో ముందుకు సాగిపో వాలి. మీరు ఎన్ని మాటలు చెప్పినా, అవి అన్నీ విననట్లే పక్కన పెట్టేస్తారు. అది వారి నైజం. అలాంటి వాని చెవిలో శంఖం వూదినట్లేనని అని చెవిటివారితో పోల్చి చెప్పుకుం టాము. మానవ పోకడలకు అద్భుతంగా మాటల్లో మర్మం స్ఫూరించేలా తెలుగులో ఎన్నో చమత్కారాలున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement