Wednesday, November 20, 2024

తిరుమలలో వైభవంగా పురుశైవారి తోటోత్సవం

తిరుమల, ప్రభన్యూస్‌: శ్రీవైష్ణవ భక్తాగ్రేసరుడు, ఆళ్వారులలో ప్రముఖు డైన శ్రీఅనంతాళ్వారు 968వ అవతారో త్సవం తిరుమలలోని అనంతాళ్వారు తోటలో (పురుశైవారితోట) ఆదివారం నాడు టిటిడి అత్యంత ఘనంగా నిర్వహిం చింది. ఈ సందర్భంగా సుమారు 300 లకు పైగా అనంతాళ్వారు వంశీకులు నాలా యిర దివ్య ప్రబంధ గోష్టిగానం నిర్వహిం చారు. ఈ సందర్భంగా తిరుమల పెరియ కోయిల్‌ కేల్వి అప్పన్‌ శఠగోపరామానుజ పెద్దజీయర్‌ స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ, తన 102 ఏళ్ళ సుదీర్ఘ జీవన ప్రస్థానంలో స్వామివారికి పుష్ప కైంకర్యాన్ని ప్రారంభించి ఉద్దరించిన శ్రీవైష్ణవ భక్తాగ్రేసరుడు శ్రీ అనంతాళ్వారు అని కొనియాడారు. అనంతాళ్వారు వంశీకులు గత కొన్ని దశాబ్దాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం ముదావహం అన్నారు. తిరుమల గోవిందరామానుజ చిన్నజీయర్‌ స్వామి మాట్లాడుతూ 968 సంవత్సరాల క్రితం శ్రీరామానుజా చార్యుల వారు స్వామి కైంకర్యాన్ని క్రమబద్దీకరించడానికి తన శిష్యబృందంలో ఎవరైనా ఉన్నారా అని అడిగినపుు అనంతాళ్వారు ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఆయన తిరుమలలో వివిధ రకాల సుగంధ భరిత పుష్పాల మొక్కలతో తోటను ఏర్పరచి స్వామివారి పుష్ప కైంకర్యాన్ని ప్రారంభించిన తన జీవితాన్ని భగవంతుని సేవకు సమర్పించుకున్నారని వివరించారు. అనంతరం కాంచిపురం మనవాల జీయర్‌ వడికేసరి అలగిస్వామి అనంతాళ్వారు జీవిత వైశిష్ట్యం గురించి అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా వివిధ వైష్ణవ దివ్య దేశాల నుంచి వచ్చిన 15 మంది వైష్ణవ పండితులు ఆళ్వారు దివ్య ప్రబంధ పఠనం చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడిలోని అన్ని ధార్మిక ప్రాజెక్టుల పోగ్రామ్‌ అధికారి విజయసారథి, ఆళ్వారు దివ్యప్రబంధ ప్రాజెక్టు అధికారి పురుషోత్తం, అనంతాళ్వారు వంశీకులు రంగాచార్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement