Friday, November 22, 2024

హిందూ ధర్మానికి పట్టుకొమ్మ పురుష సూక్తము!

వేద వాజ్మయంలోని మంత్ర భా గానికి చెందినవి సూక్తా లు. సూక్తం అంటే సమగ్రం గా స్వరూప నిరూపణ చెయ్యడం అని అర్థం. ఐహకంగా, ఆముష్మికంగా శాంతి, అభ్యుదయం అన్నవి ఈ సూ క్తాల పరమ ప్రయోజనాలు. కాబట్టి మన మహర్షులు వీటిని వివిధ వేద భాగాల ద్వారా మనకు అందించారు. పవిత్ర మైన మనస్సుతో వీటిని నిత్యం మననం చేసుకోవడం ఎంతో అవస రం. పురుష సూక్తము #హందూ ధ ర్మానికి పట్టుకొమ్మ వంటిది.
సృష్టించేవాడు బ్ర#హ్మ అని, పరి పాలించేవాడు విష్ణువు అని, లయించే వాడు ఈశ్వరుడు అని మన పురాణాలు తెలిపాయి. ఈ మూడు కూడ ఒకరినుండే జరుగుతున్నాయి. ఒకరే ఈ మూడుగా మారాడు. ఒకటి మూడుగా రూపాంతరం చెందింది. ఇది కూడా ఆ భగవంతుని ఇచ్చానుసారమే జరిగింది. మూడులో ఒకరు అయిన బ్రహ్మ ఆ శక్తి నుండే పంచభూతాలను (అగ్ని, నీరు, గాలి, ఆకా శం, భూమి) సృష్టించాడు. కనిపించే ఈ సమస్తమైన నశ్వర ప్రకృతి ఈ పంచభూతాలనుండే వచ్చింది. అదేవిధంగా మనకు కనిపించే ఈ చరాచర జీవజాలం అంత పంచభూతాల ద్వారానే తయారయ్యా యి. మన కండ్లకు కనిపించని ఆ శక్తే భగవంతుడయ్యాడు. సమస్త జీవరాశులు నా ఈ రెండు శక్తుల ద్వారానే వ్యక్తమవుతాయి అని తెలు సుకొనుము. నేనే ఈ సమస్త సృష్టికి మూల ఉత్పతి్త స్థానము. నా లోనికే ఇది అంతా లయమైపో తుంది అని సాక్షాత్తు భగవంతుడే గీత ద్వారా మనకు స్పష్టం చేసాడు. భగవం తుడే ఈ రెండు శక్తులకి మూల స్థానం. సమస్త సృష్టి ఆయన నుండే వ్యక్తమౌ తుంది. బ్ర#హ్మ నూరు సంవత్సరము లు పూర్తయినప్పుడు, ఈ సృష్టి చక్రం ముగింపు దశ చేరుకున్నప్పుడు, భగ వంతుడు ఈ సృష్టిని లయము చేస్తాడు. ఐదు స్థూల మూలకాలు, ఐదు సూక్ష్మ తత్త్వాలలో విలీనమౌతాయి. పురుష సూక్తంలో ఈ సృష్టికే మూలపురుషుడైన విరాట్‌ పురుషుని స్వరూప స్వభావ విశేషాలు నిరూపించబడ్డాయి. ఈ సృష్టికి ఆది, అంతం, అన్నీ కూడా భగవంతుడేనని, పరబ్రహ్మమే సత్యమని, ఆయనచే సృష్టించబడిన ఈ జగత్తు అంతా మిధ్య అని ఈ సూక్తం స్పష్టంగా ప్రబోధిస్తుంది.
పురుష సూక్తాన్ని శ్రద్ధతో పఠిస్తూ అర్ధం చేసుకుంటే భగవంతుని తత్వం, ఈ సృష్టికి ఆధారం ఏమిటో అర్ధం అవుతుంది. ఫలితంగా అన్నీ మనమే చేస్తున్నాం, అన్నింటికీ మనమే కారణభూతుడన్న అ#హంకారం నశిస్తుంది. అనుక్షణం చంచలత్వానికి గురయ్యే మన స్సు భగవంతుని పాదాల వద్ద స్థిరమవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement