హందూ మత విశ్వాసాల ప్రకారం, ప్రతి ఏడాది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం దీక్ష ఆచరించిన వారికి సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్ర#హం లభిస్తుందని చాలామంది విశ్వాసం. ఎందుకంటే ఈరోజున లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. దక్షిణ భారతదేశంలో వరలక్ష్మీ వ్రతం రోజున ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా, లక్ష్మీదేవి ఆశీస్సులతో పాటు ఇంట్లో సంపద, ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. వివాహత మహళలు తమ భర్త, పిల్లల భవిష్యత్తుకు సంబంధించి సంతోషకరమైన జీవితం కోసం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే ఈ వ్రతాన్ని ఆచరించేందుకు ఎలాంటి నిష్టలు, నియమాలు, మడులు ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైతే స్వచ్ఛమైన మనసు, ఏకాగ్రత ఉండే భక్తితో ఈ వ్రతం చేస్తారో వారందరికీ శుభ యోగం కలిగి, అమ్మవారి అనుగ్ర#హం లభిస్తుందని పండితులు చెబుతారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement