Monday, November 11, 2024

పురంజనుని పుర ప్రవేశం!

విదుర మైత్రేయ సుదీర్ఘ సంవాదంలో పురంజ నోపాఖ్యానం మనసును కదిలించే ఘట్టం. ఇది భాగవత పురాణానికి మకుటాయమా నం. పురంజనోపాఖ్యానం కథానాయకుడు పురంజ నుడు. పురజను (దేహధారు)లైన జీవులందరికీ ప్రతి నిధి. పురములనగా సృష్టిలోని ఎనభైనాలుగు లక్షల రకాల సకల శరీరాలు. పురంజన మహారాజు తాను సమస్త భోగాలు అనుభవించడానికి అనువైన పురాన్ని అన్వేషిస్తూ భూమండలమంతా తిరిగాడు. ఎక్కడా కనిపించక అశాంతితో అలమటిస్తూ సంచరించాడు. చాలా రోజులకు పురంజనుని పుణ్యం కొద్దీ పురాన్వేష ణ ఫలించింది. హిమాలయానికి దక్షిణ దిశలో అంటే కర్మక్షేత్రం అయిన భారత వర్షంలో, అందునా ‘దేహే కర్మాధి కారిణి’- కర్మలను ఆచరించే అధికారం కలిగి, సర్వసుఖ సాధన సంపన్నమై, సృష్టికే శృంగారమన దగిన స్రష్ట(సృష్టికర్త) దృష్టి సారించి సాధించగల విశిష్ట మైన నవద్వారపురం- దుర్లభమైన మానవజన్మ ప్రాప్తించింది. మూల భాగవతంలో మూడు అను ష్టుప్‌ శ్లోకాలతో వ్యాసవర్ణితమైన ఆ పుర (శరీర) వైభ వాన్ని పోతన రూపక అలంకార భాషలో ఒక సీస పద్యంలో ఎటువంటి వ్యత్యాసం లేకుండా అద్భుతం గా అనువదించాడు.
భోగవతి- నాగలోకం (పాతాళం)ని పోలిన ఆ అందమైన పురానికి తొమ్మిది ద్వారాలు, తలుపులు, కిటికీలు, గుమ్మాలు, గోపురాలు, ప్రహరీగోడపై యం త్రాలు, కోటగోడలు, బురుజులు, రాజవీధులు, ఉద్యా నవనాలు, బంగారు, వెండి, ఇనుముతో చేసిన మూడు గొప్ప శిఖరాలతో మెరిసే ముచ్చటైన గృహాలు, రాజ మార్గాలు, రచ్చబండలు, నాలుగు మార్గాల కూడళ్లు, కొలువుకూటాలు, జూదగృహాలు, జెండాస్తంభాలు, విక్రయశాలలు, మరకత మాణిక్య స్ఫటిక రత్న ఆణి ముత్యాలు తాపిన మేడలు, పగడలు పొదిగి కట్టిన వన్నెల తిన్నెలు కలిగివుంది. పురంజనుడు ఆ పురంలో వున్న గొప్ప ఉద్యానవనంలో అత్యంత సౌందర్యవతి అయిన ‘ప్రమదోత్తమ’ను చూశాడు. ఆమె వెంట పది మంది పరిచారకలు ఉన్నారు. వారిలో ఒక్కొక్కరికి నూరుగురు అనుచరులున్నారు. ఐదు పడగల పాము అనే ద్వారపాలకుడు రక్షకునిగా ఆమె వెంట వున్నాడు. ఆ స్త్రీ తనకు భర్తగా పొందటానికి తగిన వానిని వెదకు తూ వస్తున్నది. పురంజన మహారాజు ఆమె సౌందర్యా నికి ముగ్ధుడయ్యాడు. పరస్పర మోహవశులై వారిద్ద రూ పురప్రవేశం చేసి దాంపత్య సుఖంలో తలమునక లుగా తేలియాడారు. బుద్ధి (ప్రమదోత్తమ), జీవాత్మ (పురంజనుడు)ల తాదాత్మ్యమే (సాంగత్యం) జీవుని సం సారం. పరోక్షంగా ఇదే పురంజనుని పుర ప్రవేశం.
పురంజనుడు ఆ పురంలో అందగత్తెల సేవలు అందుకుంటూ, సుందర ప్రదేశాలలో సంచరిస్తూ ప్రమదోత్తమతో వంద వత్సరాలు వినోదించాడు. కర్మ ఫలమైన సుఖ దు:ఖాలు అనుభవించాడు. అజ్ఞాన మద గర్వితుడై పట్టమహిషినే పరమ పురుషార్థంగా భావించి, తన స్వరూపమే బ్రహ్మ అనే వాస్తవాన్ని విస్మ రించాడు. యవ్వనమంతా అరనిముషంలా గడిచిపో వడం గమనించలేకపోయాడు. తామర తంపరగా సంతానం (పదకొండు వందల మంది కొడుకులు, నూటపదిమంది కుమార్తెలు) కలిగి వంశం విస్తరిం చింది. ఆ తర్వాత జన్మలో పురంజనుడు ‘విదర్భ’ రాజ కుమారుడిగా జన్మించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement