Friday, November 22, 2024

కార్తీకంకు ముందే జంటనగరాల్లో పురాణపండ శివశ్శివమ్

సికింద్రాబాద్, (ఆంధ్రప్రభ) : అజేయమైన ఆత్మబలంతో అత్యద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథాలను వరుసగా రచిస్తూ, సంకలనీకరిస్తూ అప్రతిహత జైత్రయాత్రగా దూసుకుపోతున్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ కార్తీకమాస పవిత్ర వైభవం కోసం అందించిన దేవీం స్మరామి, శివశ్శివమ్ రెండు గ్రంథాలను ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ నిర్మాత, బళ్లారి శ్రీఅమృతేశ్వర దేవస్థానం సంస్థాపకులు సాయి కొర్రపాటి దీపావళికి ముందుగానే జంట నగరాల్లోని మణికొండ, పుప్పాలగూడ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లోని కొన్ని ఆలయాల్లో తమ అనుచరులచే పంపిణీ చేయించడం పట్ల భక్త బృందాలు హర్షం వ్యక్తం చేశాయి.

పరమ పవిత్ర కార్తీకమాసం సందర్భంగా శైవక్షేత్రాలన్నిటిలో పారాయణం చేసే, అర్చించే ప్రధాన స్తోత్రాలు, అందమైన వ్యాఖ్యానాలు, అతి అరుదైన సౌందర్యవంతమైన చిత్రాలతో చూడచక్కగా, చదువుకోవడానికి ఎంచక్కగా రూపుదిద్దిన ఈ అందాల శైవశాక్తేయ గ్రంథాలు హైదరాబాద్, బళ్లారి, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలో ఉచితంగా పంపిణీ చేయనున్నారు. గత రెండు దశాబ్దాలుగా శివశ్శివమ్ పుణ్య గ్రంథం ఎప్పటికప్పుడు క్రొత్త ఆధ్యాత్మిక శోభలతో రూపుదిద్దడం పురాణపండ శ్రీనివాస్ విలక్షణతకు నిదర్శనమని, దేవీం స్మరామి గ్రంథంలో కంచికామాక్షి, మధుర మీనాక్షి, కాశీవిశాలాక్షి దేవతామూర్తుల సౌందర్య స్తోత్ర లహరులతోపాటు శ్రీశైల భ్రమరాంబ, శృంగేరి శారదాంబాల దివ్య అనుగ్రహ వైశిష్ట్య పరంపరలుండటం గొప్ప విశేషమని గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు కేవీ.రమణాచారి ఒక ఆవిష్కరణ సభలో పురాణపండను ప్రశంసించడం గమనార్హం.

ఈ మహోత్తమ శ్రీకార్యాన్ని సమర్పిస్తున్న సాయి కొర్రపాటిని నగరంలో పలు కమ్మ సంఘాలు సైతం అభినందిస్తున్నాయి. దీపావళి తరువాయి మొదలయ్యే కార్తీకంలో ఈ గ్రంథాలు జంటనగరాల్లో అనేక ఆలయాలకు అందించనున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement