Thursday, September 19, 2024

వివేకవంతమైన భక్తి

ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ను స్థాపించి భారత స్వాత ంత్య్ర సమరంలో పాల్గొని పోరాడిన యోధు డు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌. అనేక సంద ర్భాల్లో ఈయన స్వామి వివేకానందను తన మార్గదర్శిగా అభివర్ణించారు. సత్యాన్ని సాక్షాత్కరించుకొని, పరమోన్నతమైన ఆధ్యాత్మిక శిఖరాన్ని అధిరోహించిన మహా యోగి అయి కూడా తన జాతి, విశ్వ మానవాళి నైతిక, ఆధ్యాత్మిక ఉన్నతి కోసం తన జీవితాన్ని అర్పించిన మహా పురుషుడు స్వామి వివేకానంద. అతనిప్పుడు నా ఎదురుగా నిలిచి ఉంటే అతని పాదాక్రాంతుణ్ణి అయ్యేవాణ్ణి. నేను అపార్థం చేసుకోలేదంటే నవ్య భారతదేశం అతడి సృష్టి. అని నేతాజీ వివేకానందను నిర్వచించారు.
స్వామీజీ దేశభక్తి, మానవతావాదముల సమన్వయమే ఆధ్యాత్మికత అని ప్రతిపాదించారు. బలవర్ధక మైన ఆహారం, సరైన విద్య, శిక్షణల ద్వారా దేశ జనం శారీ రకంగాను, మానసికం గాను ఔన్నత్యాన్ని పొందగలరు. అప్పుడే వారు ప్రపంచానికి పారమార్థిక సందేశాన్ని అందివ్వటంలో సమర్ధులు కాగలరు. నిరక్షరాస్యత, దారిద్య్రం, ఆధ్యాత్మికత లక్షణాలు కాజాలవు. దుర్బ éలులు, బుద్ధిహీనులు ఆధ్యాత్మికోన్నతి పొందే అవకాశం శూన్యం. తమ సాంఘీక జీవనంలో మార్పు రానంత వరకు సామాన్యులు సురక్షితులు కానంత వరకు, జీవన ప్రమాణం దారిద్య్రపు రేఖను దాటనంత వరకు భారతదేశ ఆధ్యాత్మిక కుసుమం వికసించజాల దు. తన ఆధ్యాత్మిక ప్రభావాన్ని ప్రపంచానికి అందించలేదు. నిరంతరం అంతులేని సుఖభోగాల కోసం ప్రాకులాడుతూ, జీవి తాన్ని క్షణిక సుఖాలతో నింపటానికి తాపత్రయపడుతున్న అభివృద్ది చెందిన పాశ్చాత్య దేశాల జీవన విధానంకాదు మనకు కావలసింది. ఆరోగ్యకరమూ, సజీవన యాత్రకు కావలసిన మితమైన అవసరా లను మాత్రమే మనం కోరుకోవాలి. అప్పుడే ఆధ్యాత్మిక విలువలను అన్వేషించడానికై కావాల్సిన సమయం, మానసిక శక్తిని ఇవ్వగలదు.
భోగమయ జీవితంతో కాని, కష్టతరమైన దారిద్య్రం వల్లగానీ ప్రాపంచిక భోగాల పట్ల వైరాగ్యం కలుగదు. కనీస అవస రాలు తీరినప్పుడు మాత్రమే వైరాగ్యానికి హేతువులైన వివేకం, పారమార్థికాశయాలు జనిస్తాయి. తద్వారా శక్తివంతమైన ఆధుని క దేశాలను రక్షించగలిగే పారమార్థిక ప్రతిభను ప్రకటించగల మహాపురుషులు ఉదయించే సదవకాశం లభిస్తుంది.
ప్రగాఢ దేశభక్తిని, సామాన్య జనోద్ధరణ స్వామీజీ బోధించినప్పుడు ఆయన అంతరంగంలోని పై మౌలిక భావాన్ని అర్థం చేసుకోలేని వారికి ఆయన కేవలం ఒక ఉత్తమ దేశ భక్తుడిగానో లేదా ప్రచ్ఛన్న మార్క్స్‌ వాదిగానో అపార్థం చేసుకునే అవకాశం ఉంది.
కానీ స్వామీజీ దేశభక్తికి జన సామాన్యంపై ప్రేమకు భారతదేశం పుణ్య భూమి అనే భావనే కారణం. మనిషిలో దైవత్వం గర్భితంగా ఉందనే నమ్మకం పై వర్దిల్లిన ప్రాచీన భారతీయ సంస్కృతిని అవగాహన చేసుకున్న యోగి స్వామి వివేకానంద. మంచి దైన, చెడుదైనా నా దేశమే గొప్పదైనే తప్పుడు నమ్మ కం మీద స్వామీజీ దేశభక్తి ఆధారపడ లేదు.
ప్రతి జీవిలోను దైవత్వం గర్భితంగా ఉంది. బాహ్యాంతర ప్రకృతినంతా నిరోధించి అంతర్గతమైన ఈ దైవత్వాన్ని వ్యక్తీకరించడ మే జీవిత పరమావధి అని చాటారు. ప్రేమ, దేశభక్తి, మానవతావాదం, ఆధ్యాత్మికత ఈ నాలుగు విలువల మధ్య ఉన్న సంబంధాన్ని పరిశీలించి అవగాహన చేసుకున్న ప్పుడు మాత్రమే స్వామీజీ యొక్క పవిత్ర ఆశయం అర్థం అవుతుంది. సామాన్య దేశభక్తుని ప్రేమ స్వదేశ ఔన్నత్యాన్ని మాత్రమే కోరుతుంది. కానీ స్వామీజీ అంతరంగం లో దేశభక్తి, ఆధ్యాత్మికతలనేవి మిగిలిన ప్రపంచ దేశాలకు గురుస్థానం వహించగలవని ధృఢంగా స్థిరపడి ఉండేది. ఎన్ని విషమ పరిస్థితులు ఎదురైనా ఇతర దేశాల మాదిరిగా కాకుండా ఆధ్యాత్మికత సజీవంగా, సనాతనంగా ఉంటుందని ఆయన మరో దృఢ విశ్వాసం. జాతి, మత, ప్రాంతాల వ్యత్యాసాలు ఉన్నా భారతీయులంతా ఒకే దేశానికి చెందినవారు అనే దేశభక్తి భావం సజీవంగా నిలిచి ఉంటుంది. ”నేను భారతీయుడిని అని గర్వించు! ప్రతి భారతీయుడు నా సహోదరుడు అని ప్రతి ఒక్కరూ సగర్వంగా ప్రకటించండి. భారత భూమి నా మహోన్నత స్వర్గం! భారత శ్రేయస్సే నా శ్రేయస్సు!” అని ధీరత్వంతో ప్రవచించారు.

– వారణాశి వెంకట సూర్య కామేశ్వరరావు
80746 66269

Advertisement

తాజా వార్తలు

Advertisement