సృష్టి ధర్మము కాపాడుటకు స్థితికారుడైన విష్ణుమూర్తి మానవునిగా ఎందుకు అవత రించాలి? నేరుగా తన సుదర్శన చక్ర శక్తితో అసుర శక్తులను అంతము చేయవచ్చు కదా? ఈ రకమైన సందేహములు పౌరాణిక చరిత్ర అధ్యయనము చేయువారికి కలు గుట సహజము. సృష్టికర్త బ్రహ్మ త్రిగుణాత్మకమైన ఈ ప్రకృతి శక్తులతో కూడిన జీవరాశు లను సృజించాడు. వాటిలో మానవుని ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యంతో సృష్టించాడు. ఆత్మతో పరమాత్మను అన్వేషించు అవకాశం ఒక్క మానవులకే అందించాడు. ఆ సాధన చేయుటకు సత్త్వగుణమును ఒక మాధ్యమంగా వివిధ యోగ సాధకులకు ఏర్పాటు చేసాడు. అటువంటి దైవీ సంపదను ప్రోది చేసుకొను వారికి తన పరంధామము చేరుటకు మార్గము సుగమము చేసాడు. ఇక రజో, తమో గుణసాధకులు, ఆకర్షితులు అయిన అసుర స్వభావులు సృష్టికి విరు ద్ధముగా అధర్మమును ఆశ్రయించి తుదకు సృష్టికారకులనే ధిక్కరించే స్థాయికి చేరుకున్నా రు. తిరిగి వారిని నిలువరించడమో లేదా సంహరించడమో చేయు కార్యము కూడా సృష్టికర్త లదే! ఈ కాలాత్మక చర్యలు స్థితికారుడైన శ్రీమహావిష్ణువు నిర్వహించి సత్త్వగుణ దైవీ సంప న్నులను రక్షించి, ధర్మసంస్థాపన చేసి తిరిగి యుగధర్మములో నడిపించుటకు, తాను స్వ యంగా పాటించి చూపుటకే మానవులలో ఒకరిగా అవతరించుచున్నాడు.
త్రేతాయుగమున శ్రీమహావిష్ణువు ధర్మపరిరక్షణార్థము స్వయముగా తానే ధర్మవిగ్ర హ స్వరూపునిగా సూర్యవంశమున అయోధ్యానగరిలో శ్రీరామునిగా అవతరించాడు. యజ్ఞయాగాదులను ధ్వంసము చేయు రాక్షసులను సంహరించుటకు, అనేక మంది పర స్త్రీలను చరబట్టిన దశకంఠుని దునుమాడుటకు శ్రీరామ చంద్రునికి ఎంతోమంది సహాయ ము అవసరమ యినది. శివభక్తి పరాయణుడయిన రావణాసురుడు వరగర్వముతో తుదకు సాక్షాత్తు లక్ష్మీస్వరూపిణీ అయిన సీతాదేవిని అపహరించి మృత్యువును ఆహ్వానించాడు.
దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసి ధర్మస్థాపన చేయుట అంత సులభమయిన విషయము కాదని శ్రీరామచంద్రుని అవతారము మనకు విశదపరచినది. అధర్మము ఆచరించుటకు, అమలు చేయుటకు చాలా తక్కువ సమయము సరిపోతుంది. కాని ధర్మస్థాపనకు మాత్రము చాలా ఎక్కువ సమయము మరియు సహాయము అవసరము.
యుగయుగాల ధర్మపరిరక్షణ గావించుటకు నారాయణుడు మానవావతారుడై ఈ భువి దిగి రావడం సృష్టి పరికల్పనలో ఒక భాగము. అధర్మము బలీయమైనది. దానిని అం తం చేయడానికి మరింత బలాన్ని సమాయత్త పరచుకోవాలి.
ధర్మరక్షణ ఒక యజ్ఞము లాంటిది. ధర్మాధర్మాలు, సురాసురులు ప్రతియుగంలోను సంభవం. సూర్యోదయ, అస్తమయాలు ఎట్లుండునో ధర్మాధర్మములు ఆ విధంగా ఏర్పడు తుంటాయి. అయితే ధర్మరక్షణ అనేది అనాదిగా సనాతన ధర్మ మూల సూత్రాల్లో ఒకటిగా నిలిచింది. ”ధర్మో రక్షతి రక్షిత:” ధర్మమును ఆశ్రయించి ఆచరించినవారికి ఆ ధర్మమే రక్షగా నిలబడుతుంది. అధర్మాన్ని రూపుమాపాలంటే అపారమైన శక్తియుక్తులు అవసరం. అధర్మము అతి సులభముగా ప్రబలుతుంది. ధర్మాన్ని నిలబెట్టడం మాత్రం బహుకష్టం.
అధర్మము, భోగము, అజ్ఞానము, హింస నాశనాన్ని కలిగియుంటాయి. ధర్మము, త్యాగము, సహనము, పరాక్రమము, దుష్టశిక్షణ, శిష్టరక్షణ, ఆత్మజ్ఞానము శాంతి సౌభా గ్యములను కలిగియుంటాయి.
సీతాదేవిని అపహరించి వంశనాశనమును కొని తెచ్చుకొన్న రావణున్ని సంహరించడా నికి శ్రీరామచంద్రుడు మొదట తగినంత తపోబలాన్ని సమీకరించాడు.
తండ్రి దశరథుని అశ్వమేధాది మహాయజ్ఞ ఫలమును కుమారునిగా పొందగలిగాడు. తల్లి కౌసల్య యొక్క సత్త్వగుణమును, నోముల ఫలమును దాతృశక్తిని తనలో ఒక అంశంగా నిలుపుకున్నాడు. అనగా తల్లిదండ్రుల శుభాశీస్సులు పొందాడు.
వంశగురువు బ్రహ్మర్షి వసిష్టుని వద్ద వేదవేదాంగ శాస్త్రములను అభ్య సించి గొప్ప మనోబలాన్ని సమీకరించుకున్నాడు. విశ్వామి త్రుని నుండి అనేక దివ్యాస్త్ర శస్త్రములను పొందాడు. వన వాసదీక్షలో దండకారణ్యమున మహిమాన్వితులైన అనేక మంది మునిపుంగవుల ఆశీస్సులు, మన్ననలు పొంది అజా మరమైన తపోశక్తిని తనదిగా చేసుకున్నాడు.
భరద్వాజ, అత్రి, అనసూయ, అగస్త్య, సుతీక్ష్ణ మొదలైన వారినుండి దివ్య రక్షణాశీస్సులను గ్రహిం చాడు. తన చరిత్రను ఒక దివ్యమైన కావ్యముగా వ్రా యుచున్న వాల్మీకి మహర్షి యొక్క సంపూర్ణ శక్తి యుక్తులను తనలో ఒక ప్రధాన అంశగా నిలుపు కున్నాడు. తన పదహారు ఉదాత్త గుణములను గు ర్తించి మొట్టమొదట వాల్మీకి మహర్షికి తెలియచేసి న నారదముని యొక్క బ్రహ్మశక్తిని తనయందు నిలుపుకున్నాడు. అధర్మాన్ని నాశనం చేయడానికి తానే ధర్మ విగ్రహరూపునిగా దీక్ష పూనాడు.
పుత్రధర్మము, మిత్రధర్మము, భ్రాతృ, భర్తృ, శిష్య, శత్రు, పితృ, మాతృ, జీవ మొదలగు ధర్మములు తాను ఆచరించి లోకానికి మార్గదర్శనం చేసి ధర్మమే ఈ సృష్టికి ఆధారము అని చాటి చెప్పాడు. ధర్మ నిరతియే రామబాణ మై అమ్ముల పొదిలో చేరింది.
ఆత్మస్వరూపిణి సాక్షాత్తు లక్ష్మి అయిన ఆయన భార్య సీతాదేవిపై చూపిన ప్రేమ, దండకారణ్యంలో ఆమెను కోల్పోయి భరించిన వ్యథ, ఆమెను అన్వేషించి తిరిగి రప్పించుకొనుటకు చేసిన ప్రయత్నం ఇవన్నీ సీతాశక్తి రూపంలో ఆయన వెన్నంటి నిలిచాయి.
లక్ష్మణుని పరాక్రమము ప్రత్యక్షముగాను, భరత శత్రు ఘ్నుల సోదర భక్తి పరోక్షముగాను శ్రీరాముని ప్రక్కన నిలబడింది. అహల్యకు శాపవిమోచ నము చేసి ఆమె కృతజ్ఞతాభావాన్ని తన ధర్మపోరాటానికి సహకారిగా చేసుకున్నాడు. శివధ నుర్భంగముగావించి సీతను తోడ్కొని అయోధ్యకు పోవు సమయమన ఎదురైన పరశురా ముని వైష్ణవ అంశను తనలో మిళితం చేసుకున్నాడు. వైష్ణవ ధనుర్భంగముతో పరశురాము ని గర్వము అణగి శ్రీరాముని తేజస్సు ద్విగిణీకృతమైనది.
శ్రీ మహావిష్ణువు దశరథుని పుత్రునిగా అవతరించుటకు సంకల్పించినపుడే బ్రహ్మ అనేక దేవతల అంశలను సృజించి భూమికి పంపాడు. అప్సర, గంధర్వ, యక్ష, నాగ, ఋక్ష, విద్యా ధర, కిన్నెర, కింపురుష మొదలైన వారిని వానర, భల్లూక మొదలైన రూపాల్లో సృష్టించి భువికి పంపాడు. బ్రహ్మ ఆవులింత నుండి జాంబవంతుడు, ఇంద్రాంశతో వాలి, ఆదిత్యుని అంశతో సుగ్రీవుడు, బృహస్పతి అంశగా తారుడు, కుబేరుని వలన గంధమాదనుడు, విశ్వక ర్మవలన నలుడు, అగ్నిదేవుని వలన నీలుడు, అశ్వనీదేవతల వలన మైంద, ద్వివిదులు, వరు ణుని వలన సుషేణుడు, పర్జన్యుని వలన శరభుడు, బ్రహ్మ విష్ణు శివాత్మక అంశలతో వాయు సుతుడు హనుమ మొదలగు మహాయోధులు శ్రీరాముని ధర్మరక్షణా యజ్ఞంలో భాగము పంచుకొనుటకు ముందుగా పృథివిపై అవతరించారు.
లక్షల కొలదీ వానర, భల్లూక, గోపుచ్ఛ మొదలైన జాతులవారు వివిధ దేవతాంశలతో ముందుగా జన్మించారు. వీరేకాక గరుడ, ఐరావత, వాసుకి మొదలైనవారు వివిధ రూపా లలో దేవగణ స్త్రీలయందు జనియించి శ్రీరాముని కోసం ఎదురు చూస్తూ ఋక్ష వంత పర్వత సానువుల్లో నివసించసాగారు.
ఈవిధంగా ధర్మరక్షణకు, రావణ సంహారానికి అనేక శక్తులను, యోధులను సహాయంగా తీసుకోవలసి వచ్చింది. అదేవిధముగా యుగయుగాన ధర్మరక్షణకు, అసుర సంహారానికి అనేక మంది ధర్మరక్షణా దీక్షాపరులతోపాటు శ్రీరాముని వంటి అవతారమూ అవశ్యమే!
ధర్మ రక్షణ… ఓ మహాయజ్ఞము
Advertisement
తాజా వార్తలు
Advertisement