శ్రీఅరవిందులు ”గతానికి చెందినవారు కాదు, వారు మహోజ్వల భవిష్యత్తుకు సంకేతం” అంటారు శ్రీమాత.
”మనం గతంలోని ఉషోదయాలకు చెందినవారం కాదు- రేపటి మధ్యందిన మార్తాండులం” అని ‘సావిత్రి’ మహాకావ్యంలో పేర్కొన్నారు శ్రీ అరవిందులు.
”భారతమాతాకీ జై” అనే నినాదం ఎప్పటినుండో మన దేశంలో ఉన్నది. అయితే భారత దేశం భారతమాతగా ఎప్పటి నుండి పిలువబడుతున్నదో చూద్దాం.
1905వ సంవత్సరం బెంగాల్ విభజన ద్వారా బ్రిటీష్ పరిపాలనలో భారతదేశ ప్రజలు సతమతమవుతున్న సమయంలో ‘భారతమాత’ అనే పదం జనించినది. అప్పుడే స్వాతం త్య్ర సమర యోధుడు అప్పటివరకు తెరచాటున వుండి, కృషిసల్పుతున్న శ్రీ అరబిందోఘో ష్ ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొన్నప్పుడే ‘భారతమాత’ అన్న పదానికి శ్రీకారం చుట్టారు. గుజరాత్‌లో అప్పటి రాజకీయవేత్త, రచయిత కె.ఎం.మున్షిdగారు అసలు దేశభక్తి అనగా ఏమి టి? అని అరబిందో ఘోష్‌ను ప్రశ్నించారు. జవాబుగా బ్రిటీష్ పరిపాలనలో భారతదేశ పటా న్ని చూపిస్తూ, ఇది భారతమాత, ఇందులోని నదీనదాలు, పర్వతాలు, అరణ్యాలు, ఆమె దేహంలోని భాగాలు, పిన్నలు, పెద్దలు, ఆమె నరాలు, ఆమెను నవ విధములుగా పూజించాలి అని చెప్పారు. అప్పుడే భారతమాత అనే కాన్సెప్ట్‌కు నాంది పలికారు. బెంగాల్ ప్రజలు కాళీ, దుర్గ, చండీలను ఎక్కువగా పూజిస్తారు. అదేవిధంగా శ్రీ అరవిందుల వారు సా#హత్య రూపం లో భారతదేశానికి దేవతా రూపాన్ని అందించారు.
భారతమాత భావం ఆనంద్‌మఠ్ ద్వారా విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చినది. అప్పు డే ‘దుర్గాదేవి’ని ఉద్దేశించి బంకిం చటర్జీ రాసిన వందేమాతరం గీతం భారతమాత పోలికకు సరిగ్గా సరిపోయినది. అదే విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ మేనల్లుడు తొలి భారత ఆధునిక చిత్రకారుడిగా గుర్తింపు పొందిన అవిణంధ్ర టాగూర్ భారతమాతకు మొదటిసారిగా చిత్ర రూపాన్ని ఇచ్చారు. అతను కూడా భారతమాతను దుర్గాదేవి రూపంలాగే చిత్రించారు. ఈ చిత్రానికి విపరీతమైన ప్రాచుర్యం లభించి, ప్రతి స్వాతంత్య్ర పోరాటంలో ముస్లింలతోసహా అంతటా అందరూ ఈ చిత్రాలను ఉపయోగించటం ప్రారంభించారు. భారతమాత రూపం లో మార్పులు చేస్తూ, ప్రస్తుతం పది హస్తాలతో, సింహంపై స్వారీ చేస్తున్నట్లుగా, భారతమా తను చిత్రిస్తున్నారు. వారణాసిలో, మహారాష్ట్రలోని దౌలతాబాద్‌లో, హరిద్వార్‌లో ఆలయా లు నిర్మించి, పూజించడం మొదలుపెట్టారు.
శ్రీ అరవిందులు ఒక రాజకీయవేత్త, ఒక విద్యావేత్త, ఒక దార్శనికుడు, ఒక మహాతపస్వి, ఒక స్వాతంత్య్ర యోధుడు, ఒక మానసిక శాస్త్రవేత్త, ఒక సామాజిక తత్త్వవేత్త, ఒక బ్రహ్మర్షి, ఒక మహావిప్లవకారుడు, ఒక భవిష్య ద్రష్ట, బహుముఖ ప్రజ్ఞాదురంధరు డు, అన్నింటిని మిం చి దివ్యజీవన ప్రవక్త. పూర్ణయోగ సాధకులకు అతిమానస అవతార పురుషులు. ఒక వ్యాసు డు, ఒక వాల్మీకి, కాళిదాసు ఉన్నారు. అలాగే ఒక ఆదిశంకరుడు, ఒక రామానుజుడు, మధ్వా చార్యుడు, ఒక నింబార్కుడున్నారు. ఒక కారల్‌మార్క్స్, ఒక ఐన్‌స్టీన్, ఒక ఎం.ఎన్. రాయ్, ఒక ప్లాటో ఇలా… ఎందరో మహానుభావులు, ఆర్యభట్టు నుండి అబ్దుల్‌కలాం వరకు వారిలో కొలువై వున్నారు. ఆయన సనాతులలో సనాతునుడు, ఆధునికులలో మహా ఆధునికుడు.
శ్రీ అరవిందుల దర్శనం ఆసక్తిగా వుండడమే కాదు, సంక్లిష్టంగానూ వుంటుంది. పాశ్చా త్యు ల పదార్థవాదం, భారతీయుల పరమార్థవాదం, రెండూ మిశ్రమంగా అందులో ఉం టాయి. ఆధునిక వైజ్ఞానిక శాస్త్రాలు, వైెదిక వాఙ్మయం, షడ్దర్శనాలు, భగవద్గీత, యోగం, తంత్రం మాత్రమే కాక, ప్రపంచ ప్రవక్తలు చెప్పిన సత్యాలు, ఆచార్యుల సిద్ధాంతాలు అన్నీ అందులో ఇమిడిపోతాయి. పాండిచ్చేరిలోని ఆశ్రమం వారు దర్శించిన నూతన జగత్తుకు అభిముఖంగా ప్రగతిపథంలో విజయవంతంగా పురోగమిస్తున్న ఒక ప్రయోగశాల. అచ్చట భిన్నత్వంలో ఏకత్వం, ఒక సమ సమాజం కనిపిస్తుంది. గ్రహంచుటకు జీవితాన్ని విసర్పిం చాల్సిన అవసరంలేదని, పైగా జీవితాన్ని సహర్షంగా ఆమోదించాలన్న సత్యం అక్కడ తెలు స్తుంది. ఆధునిక ప్రపంచంలో అదొక సనాతన తపోభూమి, తపోభూ మిలో ఆధునిక ప్రపం చం దర్శనమిస్తుంది. ”అమ్నతస్య పుత్రా” అన్న ఉపనిషద్వాణికి నిజం చేసే దిశగా ఆశ్రమం పురోగమిస్తున్నది. మోక్షానికి సన్యాసంకాదు. మోక్షాన్నే సన్యసించాలన్న వాస్తవం కనిపిస్తుం ది శ్రీ అరవిందాశ్రమంలో. ఇంతవరకు ఆధ్యాత్మిక వేత్తలు, వారి చింతనలను ప్రపంచాన్ని కాదని పరతత్త్వానికే ప్రాధాన్యతనిచ్చి మళ్లిd జన్మకు రాకుండా ముక్తిని సాధించడమే ఏకైక పరమార్థంగా చెప్పారు. కానీ శ్రీ అరవిందులు చెప్పింది ఈ లోకంలోనే మానవ జీవితం దివ్య జీవితంగా మార్చడం. ఈనాటి మానవుడు దివ్య మానవుడిగా రూపాంతరం చెందించడం, అంటే సాంప్రదాయక యోగాలన్నీ ఎక్కడ ముగింపు పలికాయో, అక్కడ శ్రీ అరవిందుల యోగం ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు వచ్చిన తత్త్వాల లక్ష్యాలు పరతత్త్వంలో కలిసి పోవడం. కైలాసంలోనో, వైకుంఠంలోనో ఆవాసం కోసం తప్ప, ప్రపంచ జీవితాన్ని మార్చడా కి కాదు. ముక్త స్థితిలోకి పరమ సత్యాన్ని ఈ భూమి మీద ప్రతిష్టించడానికి బాటలు పరచి, అతిమానస శక్తి ఆవాహన చేశారు . పరశురాముడు ఈ పృథ్విలో రజోగుణా నికి ప్రాతినిధ్యం వహస్తే, శ్రీరాముడు సత్వ గుణానికి, శ్రీ కృష్ణుడు త్రిగుణాతీత స్థితికి ప్రాతి నిధ్యం వ#హంచారు. అరవిందులు అతి మానసశక్తిని ఆవాహన చేసి, సృష్టికి ఒక మలుపు తీసుకొని వచ్చారు.