Saturday, November 23, 2024

లాభనష్టాలు

అదొక ఆధ్యాత్మిక సదస్సు. ఆ రోజు సదస్సు ఆఖరి రోజు. ఆధ్యాత్మికానికి సంబంధించిన లోతైన ఎన్నో విషయాలను శిష్యులు గురువుగారిని అడుగుతున్నారు. శిష్యుల సందేహాలను గురువుగారు నివృత్తి చేస్తున్నారు. సనాతన తత్త్వానికి ఆధునికతను జోడించి, నిగూఢమైన ఆధ్యాత్మిక విషయాలను వివరించటంలో, వర్తమాన స్థితిగతులకు ఆధ్యాత్మికాన్ని అన్వయించి, విషయాన్ని అందరికీ అర్థమయ్యే రీతిన చెప్పటంలో గురువుగారు అందెవేసిన చేయి.

”దేవుడు ఎక్కడుంటాడు?” శిష్యుల సందేహానికి గురువుగారి సమాధానం- ”విశ్వాసానికి అవిశ్వాసానికి నడుమ ఊగుతుంటాడు.”
”దేవుడు ఏం చేస్తుంటాడు?”
”ద్వైతం అనిపించేలా ఉంటూ అద్వైతంగా అన్నింటినీ నడిపిస్తూ ఉంటాడు.”
”దేవుడు ఎలా ఉంటాడు?”
”అన్నీ తానై, అంతా తానై, అంతటా తానై నిలిచి ఉంటాడు. నిలిచిపోయి ఉంటాడు దేవుడు.”
”దేవుడికి జీవుడికి ఉన్న సంబంధం ఏమిటి?”
”దేవుడి కోసం జీవుడు తపిస్తాడు. తపనపడతాడు. జీవుడి కోసం దేవుడు తపస్సై పోతాడు.
తపస్సై నిలిచిపోతాడు.
శిష్యుల సందేహాలకు గురువుగారి సమాధానాలు జీవిత సత్యా లను తెలుపుతాయి. జీవిత తత్త్వాన్ని నిలుపుతాయి. జీవన పాఠాలు గా నిలిచిపోతాయి. ఈ సదస్సులో గురుశిష్యుల మధ్య ప్రస్తావనకు వచ్చిన సందేహాలు- సమాధానాలులో మచ్చుకు కొన్ని చూద్దాం. ప్రతిరోజూ లాగే ఆరోజూ ఓ శిష్యుడు ”స్వామీ! ప్రతి రోజూ ఎక్క డో ఒకచోట ప్రవచనాలు, పురాణ కాలక్షేపాలు, ఆధ్యాత్మిక కార్యక్ర మాలు జరుగుతుంటాయి కదా. వాటి వలన మనకి వచ్చే లాభం ఏమిటి?” అని గురువు గారిని ప్రశ్నించాడు. ఈ ప్రశ్న సామాన్యమై నదిగా, సాదాసీదాగా అనిపించవచ్చు. తేలికైనదిగా కనిపించ వచ్చు. విషయ లోతులలోనికి వెళితే, లోతైన గాఢత దాగున్నది. గురువుగారు శిష్యుడిని చూసి చిరునవ్వు నవ్వి- ”వాటన్నింటి వలన వచ్చే లాభాల సంగతి అటుంచు. నువ్వు చెప్పిన ఆ ఆధ్యాత్మిక కార్యక్రమాలే లేవనుకో. సమయాన్ని గడపటానికి అయినా, నువ్వు ఏదో ఒకటి చేయాలి. ఎక్కడికైనా వెళ్లాలి! ఉదాహరణకు సినిమాకు వెళ్ళావనుకుందాం. ప్రవచనానికి/ పురాణ కాలక్షేపానికి రానిచ్చే లా, సినిమాకి టిక్కెట్‌ లేకుండా రానీయరు. టిక్కెట్‌ కొనుక్కోవాలి అంటే కొంత డబ్బు ఖర్చు అవుతుంది. అది మొదటి నష్టం. సినిమా కు వెళ్ళావు కదా! ఖర్మకాలి ఆ సినిమా బాగాలేదనుకో. తలనొప్పి వస్తుంది. అప్పుడు ఔషధ సేవనం చేయాలి. అది రెండో నష్టం. ఇంటినుంచి బయటకు వెళ్ళావు కాబట్టి అక్కడ ఎన్నెన్నో వస్తువులు కనిపిస్తాయి. ఏదో ఒకటి కొనాలి అనుకుని, ఏదో ఒకటి కొనేస్తావు. అవసరమో కాదో అనేది చూడకుండా కొన్నావు కాబట్టి అది మూడో నష్టం. డబ్బుపెట్టి కొన్నావు కాబట్టి తోసుకునో మోసుకునే ఇంటికి తెచ్చుకుంటావు. అది మరో నష్టం. వస్తువుని ఇంటికి తెచ్చుకున్నాక ఇంటిలో ఆ వస్తువును పెట్టాలి. చోటు సరిపోదు కాబట్టి అక్కడ అప్ప టికే ఉన్న పాత వస్తువులను కొన్నిటిని బయటపారేస్తావు. అది అయి దవ నష్టం. ఈ రకంగా ప్రతిసారీ చేయటం వలన, ఇళ్ళు సామాన్లు పెట్టుకునే స్టోర్‌ రూంలా తయారవుతుంది. అది ఇంకో నష్టం. రోజు లు గడుస్తున్నకొద్దీ ఇంటిలో తిరగాలంటే, ఆ సామానుల మధ్య బ్రతకాలంటే, విసుగు కోపంవస్తాయి. చిరాకు పుట్టుకొస్తుంది. ఫలి తంగా కొన్ని వస్తువులనయినా పడేయాలనుకుంటావు. ఏది అవస రమైన వస్తువో, ఏది పనికి రానిదో నిర్ణయించటానికి, నీ బుద్ధిని నీ సమయాన్ని కొంచెమై నా పాడు చేసుకోవాలి. అదీ…. ఆఖరు నష్టం. అదే ఏదో ఒక ప్రవచన కార్యక్రమానికో/ పురాణ కాలక్షేపాని కో వెళ్ళి పోతే, పైన చెప్పుకున్న నష్టాలు కష్టాలు తప్పుతాయి కదా! నష్టాలను తప్పిస్తే లాభమే కదా? అదే ప్రవచనం లేదా పురాణ కాల క్షేపం వలన లాభం కాదంటావా?” అని చెప్పటం ముగించారు గురువుగారు. ఆధ్యాత్మిక తత్త్వ సారాన్ని ఆధునికతను జోడించి సరై న తర్కంతో మేళవింపు చేసి, సందేహాన్ని నివృత్తి చేసిన గురువుగారి ప్రజ్ఞా పాట వానికి, గురువుగారికి పాదాభివందనం చేసాడు శిష్యుడు. జీవనం లో మిళితమైన చెడునూ అడ్డంకులనూ నిర్మూలించుకోడానికి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన. జీవితాలకు నష్టాలను కలిగించే విష యాలను సాధ్యమైనంత తగ్గించుకోవడమే ఆధ్యాత్మికత మూల సూత్రం. భౌతికమైన లాభనష్టాలతో, సుఖదు:ఖాలతో ఆధ్యాత్మికా న్ని బేరీజు వేసుకోవాలనుకోవటం మూర్ఖత్వం. ఆధ్యాత్మిక సారాన్ని ఆధ్యాత్మిక తత్వంతోనే అన్వేషించాలి. సంకల్పం, సాధనా సంపత్తి అనే పరికరాలతో తూచగలగాలి. భక్తి ప్రపత్తులతో కొలవ గలగాలి. ఆత్మ నివేదన సమర్పణా మార్గంలో నడవాలి. అప్పుడు ఆధ్యా త్మికం అమృతమయమవు తుంది. ఆనందం సిద్ధిస్తుంది.

– రమాప్రసాద్‌ ఆదిభట్ల
93480 06669

Advertisement

తాజా వార్తలు

Advertisement