Friday, November 22, 2024

ముచ్చింతల్‌కు రేపు ప్రధాని వెూడీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రధాని నరేంద్రమోడీ శని వారంనాడు హైదరాబాద్‌లో పర్య టించనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యా లయం షెడ్యూల్‌ను ప్రకటించింది. శనివారం మధ్యాహ్నం 2.10గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోడీ చేరకుంటారు. అక్కడి నుంచి నేరుగా సంగారెడ్డి జిల్లా పటాన్‌ చెరులోని ఇక్రిశాట్‌కు ఎంఐ-17 హెలకాప్టర్‌లో బయ ల్దేరి వెళ్తారు. 2.35గంటలకు ఇక్రిశాట్‌ ప్రాంగణానికి చేరుకుని 4.15 గంటల వరకు ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాల్లో పాల్గొం టారు. సాయంత్రం 5గంటలకు ముచ్చింతల్‌లోని చినజీ యర్‌ ఆశ్ర మానికి చేరుకుని సమతామూర్తి విగ్రహావిష్కరణ చేస్తారు. రాత్రి 8గంటల వరకు రామానుజాచార్యుల సహ స్రాబ్ది వేడు కల్లో పాల్గొని రాత్రి 8.25గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు చేరుకుని తిరిగి ఢిల్లికి వెళ్తారు.
సమతామూర్తి విగ్రహం జాతికి అంకితం చేయనున్న ప్రధాని
దేశ, జాతి, లింగ, కుల, వర్ణాలకు అతీతంగా ప్రతి మాన వుడు సమానమేన్న స్ఫూర్తితో ప్రజల అభ్యున్నతి కోసం అవి శ్రాంత కృషి చేసిన రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారొహ ఉత్సవాల్లో ప్రధాని మోడీ పాల్గొని ఆయన 216 అడు గుల ఎత్తౖన విగ్రహాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయ నున్నా రు. ఆయన మధ్యాహ్నం 2.35గంటలకు హైదరాబాద్‌ పటాన్‌ చెరులోని ఇంటర్నేషనల్‌ క్రాప్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సెమీ ఎరిడ్‌ ట్రాపిక్స్‌( ఇక్రిశాట్‌) క్యాంపస్‌ను సంద ర్శిస్తారు. ఈ సందర్భంగా ఇక్రిశాట్‌(అంతర్జాతీయ సమశీతోష్ణ మండల పంటల పరిశోధనా సంస్థ) 50వ వార్షికోత్సవ వేడుకలను ఆయన చేతుల మీదుగా ప్రారంభించి ప్రసం గిస్తారు. ఈ సంద ర్భంగా ఇక్రిశాట్‌ నూతన లోగోను ప్రధాని మోడీ ఆవిష్కరించ నున్నారు. ర్యాపిడ్‌ జనరేషన్‌ అడ్వాన్స్‌ మెంట్‌ ఫెసిలిటీని ఆయన ఈ సందర్భంగా ఇక్రిశాట్‌లో ప్రారంభించనున్నారు. నూతన లోగోను, ఈ సందర్భంగా విడుదల చేసిన స్మారక స్టాంపును ప్రధాని మోడీ ఆవిష్కరించ నున్నారు. అటు నుంచి నేరుగా ముచ్చింతల్‌లోని శ్రీరామను జాచార్యుల స్ఫూర్తి కేంద్రం సమతామూర్తి ప్రాంతానికి చేరు కుంటారు. ఇక్కడ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 216 అడుగుల ఎత్తౖన సమానత్వ విగ్రహం స్టాచ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీని ప్రధాని మోడీ జాతికి అంకితం చేస్తారు.
ఇక్రిశాట్‌లో పలు కార్యక్రమాలు…
రైతులకు మేలైన విత్తనాలు, నూతన సాగు విధా నాలను చేరువ చేస్తూ ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో ఆహార సంక్ష భ నివా రణకు ఇక్రిశాట్‌ విశేష సేవలందిస్తోంది. పటాన్‌చెరులో 3434 ఎకరాల్లో 1972లో ఇక్రిశాట్‌ ఏర్పాటైంది. ఈ సంస్థ తాజాగా పోషకాహార భద్రత కల్పించే వాతావరణ మార్పు లను తట్టుకునే వంగడాలపై పరిశోధనలు చేస్తోంది. కృత్రిమ మేధతో (ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌)తో సాగు పద్ధతుల్లో మా ర్పులు, భూసార పరీక్షలతో పంటల ఉత్పాదకత పెంపు లక్ష్యం గా పలు ప్రాజెక్టులను విజయవంతంగా అమలు చేస్తోంది.
చినజీయర్‌ ఆశ్రమంలో రాత్రి 8గంటల వరకు…
11వ శతాబ్దానికి చెందిన రామానుజాచార్యుల జ్ఞాప కార్థం, విశ్వాసం, కులం, మతం వంటి అన్ని జీవన అంశాల్లో సమానత్వం అనే ఆలోచనలను ప్రోత్సహించిన ఆయన జ్ఞాప కార్థంగా దీనిని జాతికి అంకితం చేయనున్నారు. ఈ విగ్రహాన్ని ఐదు లోహాలతో కూడిన పంచ లోహాల సమాహారంతో, లోహా ల కలయికతో తయారు చేశారు. బంగారం, వెండి, రాగి, ఇత్తడి, జింక్‌ లోహాలతో ధ్యానముద్రలో ఉన్నట్లుగా విగ్రహాన్ని రూపొందించారు. ఇక్కడి ఆధ్యాత్మికతను ప్రపంచానికి చాటేలా చారిత్రక సందేశం ప్రపంచానికి వినిపించేలా, కళ్లకు కట్టేలా నిర్మించిన 108 వైష్ణవ దివ్య దేవాలయాలను ఒకేచోట నిర్మించారు. వీటిని కూడా పస్రధాని మోడీ జాతికి అంకితం చేస్తారు. ఇదే ప్రాంగణంలోని డిజిటల్‌ లైబ్రరీని, రామానుజ జీవిత చరిత్రను, విశేషాలను సామాన్యులకు అర్థమయ్యే రీతి లో రూపొందించిన చిత్రాలను ప్రధాని మోడీ పరిశీలించ నున్నారు. 54అడుగుల ఎత్తులో భద్రవేది (పద్మపీటం)పై రామానుజ విగ్రహం ఉంటుంది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో రామా నుజాచార్యుల జీవిత చరిత్రను తెలిపే చిత్రకళా ప్రదర్శనను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. మొదటి అంతస్తులో రామానుచార్యుల ప్రసన్న కరుణాగత మండపంలో 120 సంవత్సరాల పరిపూర్ణ జీవితం అనుభవించిన రామాను జాచార్యులకు గుర్తుగా 120 కిలోల బంగారంతో నిర్మించిన విగ్రహాన్ని కూడా ప్రారంభిస్తారు. రెండో అంతస్తులో ఏర్పాటు చేసిన డిజిటల్‌ లైబ్రరీని, మూడో అంతస్తులోని రామానుజ మూర్తిని జాతికి అంకితం చేస్తారు. ఇందుకుగానూ ఇప్పటికే భద్రతా దళాలు ముందస్తుగా ఏరియల్‌ సర్వే నిర్వహించాయి. వేడుకల్లో పాల్గొనే ప్రాంతాలను కేంద్ర బలగాలు, రక్షణ సిబ్బం ది పరిశీలించారు. ప్రదానమంత్రి కార్యాలయం అన్ని ఏర్పా ట్లను ప్రత్యేకంగా పరిశీలిస్తోంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పా ట్లకు ఇప్పటికే కీలక చర్యలు తీసుకుంది. ముచ్చింతల్‌లో పటి ష్ట బందోబస్తు ఏర్పాటు చేవారు. పలు ఆంక్షలు విధిం చారు. యాగశాల ముందుభాగంలో నిర్మించిన పాకలో సగ భాగం తొలగించాలని భద్రతా సిబ్బంది ఆదేశించారు. ఈ కా ర్య క్ర మంలో మోడీతోపాటు సీఎం కేసీఆర్‌ పాల్గొ ననున్నారు.
పలువురు ప్రముఖులు…
రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు ఈనెల 2న ప్రారంభం కాగా, 14వ తేదీ వరకు కొనసాగనున్నాయి. గురువారం ఉదయమే అరణి మథనం అగ్నిప్రతిష్టా, హోమాలు, దుష్ట నివారణ కోసం శ్రీసుదర్శనేష్టి, సర్వాభీష్టసిద్ది కోరుతూ శ్రీవా సుదేవేష్టి, పెద్దస్వామి అష్టోత్తర శతనామార్చన నిర్వహిం చారు. దీంతో సహస్రాబ్ది ఉత్సవాలు రెండోరోజు నిర్విఘ్నంగా విజయవంతంగా కొనసాగాయి. ఈ నెల 5న ప్రధాని నరేంద్రమోడి సహస్రాబ్ది ఉత్సవాలకు హాజరవనుండగా, 6న ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి, రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ మూద్‌ అలీ, 7న కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, 10న హోంశాఖ మంత్రి అమిత్‌షా, 9న ఆర్‌స్‌ఎస్‌ చీఫ్‌ మో హన్‌ భగవత్‌, 11న నితిన్‌ గడ్కరీ, 12న ఉపరాష్ట్రపతి వెంక య్య నాయుడు, 13న రాష్ట్రపతిలు హాజర వనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement