భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ముచ్చింతల్ లోని శ్రీ రామానుజ సమాతా మూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించుకున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఖ్యాతి గడించిన ముచ్చింతల్ సమతా మూర్తి స్ఫూర్తి వద్ద శ్రీశ్రీశ్రీ రామానుజ చిన్న జీయర్ స్వామి రాష్ట్రపతికి సాంప్రదాయ పద్ధతిలోస్వాగతం పలికారు. ఆధ్యాత్మిక శోభన సంతరించుకున్న సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించి భారత రాష్ట్రపతి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతకుముందు ప్రత్యేక హెలికాప్టర్ లో సాయంత్రం 5 గంటలకు ముచింతల చేరుకున్న భారత రాష్ట్రపతి నేరుగా ప్రత్యేక వాహనంలో సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రానికి చేరుకున్నారు. అనంతరం శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి వారు భారత రాష్ట్రపతి ద్రౌపతి మూర్మును వెంట తీసుకుని 108 దివ్యసాలు సందర్శిస్తూ ఆలయ విశేషాలు తెలియ చేశారు. ఆ తర్వాత 216 రామానుజ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ చూసి అక్కడనుండి రామానుజన్ స్వర్ణ విగ్రహాన్ని దర్శనం చేసుకున్నారు. అక్కడే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ రామానుజ స్వామి వారు మంగళ శాసనాలు ఇచ్చారు. శ్రీ రామానుజ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎదురుగా ఏర్పాటు చేసిన డైనమిక్ ఫౌంటైన్ స్పెషల్ షో తిలకించారు. అనంతరం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ త్రీడీ లేజర్ షో చుసిన తరువాత చిన్న జీయర్ స్వామికి ధన్యవాదములు తెలియజేసారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముతో పాటు గవర్నర్ తమిళి సై, రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్, చిన్న జీయర్ ట్రస్ట్ సభ్యులుశ్రీమాన్ కె.వి చౌదరి,శ్రీమాన్ చలిమెడ లక్ష్మీ నరసింహారావు, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement