Tuesday, November 26, 2024

శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

శ్రీకాళహస్తీశ్వరాలయం, (చిత్తూరు) ప్రభ న్యూస్‌: శ్రీకాళహస్తీశ్వరాలయంలో గురువారం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమ య్యాయి. సంప్ర దాయ ప్రకారం మొదటి పూజ భక్త కన్నప్పకు ఘనంగా నిర్వహించారు. బ్రహ్మో త్సవాల కు స్వాగతం పలుకుతూ , ముల్లోకాల్లో ఉన్న దేవతా మూర్తులకు ఆహ్వా నం అందిస్తూ మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, పూజా రుల మంత్రోచ్ఛా రణల నడుమ పూజ నిర్వహించారు. కొండపై వెలసిన భక్త కన్నప్ప ఆల యంలో సాయం త్రం ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్‌ స్వామినాథన్‌ గురుకుల్‌, యాదగిరి స్వామి కలశాన్ని ఏర్పాటు- చేసి శాస్త్రోక్తంగా పూ జలు నిర్వహించారు. అనం తరం ధ్వజస్తం భంపై దేవస్థా నం సమర్పించిన వస్త్రాన్ని అధిరోహింపజేసి బ్రహ్మోత్స వాలకు శ్రీకారం చుట్టారు. అఖండ హారతులు ఇచ్చి, నైవేద్యం సమర్పించారు. భక్తులు హరహర మహా దేవ శంభో శంకర అంటూ నినాదాలు చేస్తుండగా ధ్వజారోహణం నిర్వహించి, ఎదురుగా ఉన్న శివ లింగానికి సమర్పించారు.
భక్తకన్నప్ప ఊరేగింపు..
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరిం చుకుని శ్రీకాళహస్తీశ్వరాల యంలో మొదటి పూజలం దుకున్న భక్త కన్నప్ప పట్టణంలోని భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ప్రత్యేక గొడుగులు వెళ్తుండగా వెనుక కోలాటాలు, చెక్కభజనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నాలుగు మాడ వీధు ల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మధుసూదన్‌ రెడ్డి, ఈవో పెద్దిరాజు కుటు-ంబ సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement