Thursday, November 21, 2024

ప్రేమ వికసించే రంగుల పండుగ

వ సంతకాల ఆగమన వేళలో వచ్చే హోలీ పండుగను జరుపుకునే వేళ దేశంలో వివిధ ప్రాంతాలలో, వివిధ రకాలుగా మంటలు వేస్తారు. అలాగే తెలుగు నేలపై భోగి పండుగకు, అలాగే హోలీ పండుగకు మంటలు వేయడం సాంప్రదా యంగా ఉంది. పార్వతీదేవి పరమశివుడును వివాహం చేసుకోవడానికి సహాయంగా శివుని తపస్సును భంగపరచడానికి అతనిపై పూలబాణం వదిలిన కామదేవుని శరీరాన్ని శివుడు నాశనం చేస్తాడు. తరువాత శివుడు తన త్రినేత్రాన్ని తెరిచి, కామదేవుని శరీరాన్ని బూడిద చేశాడు. కామదేవుని భార్య రతీదేవి కోరిక మేరకు శివుడు కామదేవుడిని తిరిగి బ్రతికిస్తాడు. కానీ భౌతిక కామం కంటే నిజమైన ఉద్రేకపూరిత ప్రేమ ఆధ్యాత్మికతను తెలి యజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే బ్రతికిస్తాడు. ఈ సంఘటన కారణంగానే హోలీ పండుగ రోజున భోగిమంటలు వేస్తారు.
పరమ శివుని కోపాగ్నికి కాముడు భస్మం కావడానికి సూచన మాత్రమే కాక, ”హోలిక” అనే రాక్షసి మంటల్లో కాలిపోయిన సంఘటనకు భూమికగా కూడా చెపుతారు. కొన్నిచోట్ల హోలిక ప్రతిమను కూడా ముందురోజు తగలబెడతారు. హోలిక, హరణ్య కశిపుని సోదరి. హరణ్య కశిపుని కుమారుడు ప్రహ్లాదుడు. తండ్రి నాస్తికుడు, తనయుడు ఆస్తికుడైన విష్ణుభక్తుడు. బాల కుని విష్ణుభక్తిని మార్చడానికి రాక్షస రాజు శతవిధాలా ప్రయ త్నించాడు. అయినా ప్రహ్లాదుడు చలించలేదు. అప్పుడు హరణ్యకశిపుడు తన సోదరి హోలికతో సంప్రదించాడు. తనకు అగ్ని వల్ల నాశనము లేదని వరం పొంది ఉన్న హోలి క, తన మేనల్లుడిని ఎత్తుకుని, పెద్ద మంటలో దుమికింది. ఆమె నాశనము కోరిన ప్రహ్లాదుడు, ఆ మంటమీదే పద్మాస నుడై కూర్చుండి ఉండి, విష్ణు ధ్యానంలో లీనమై ఉన్నాడు. అలా చాలాసేపు మంటల్లో ఉండి, పూర్తిగా చల్లారిన పిదప నిర్వికారుడు ప్రహ్లాదుడు బయటకు రాగా, తనకు నాశనమే లేదని నమ్మిన హోలిక మంటల్లో దహనమైంది.
హోలీ పర్వం అత్యంత ప్రాచీనమూ, అంతర్జాతీయం కూడా, కొత్త సంవత్సరం రాకను సూచించేందుకు, ఆదిమ వాసులు సలుపుతూ వచ్చిన వేడుకలను గ్రహంచిన ఆర్యు లు, ఈ పర్వాన్ని కొనసాగించి ఉంటారు”. దుష్ట గ్రహాలను భూమి మీద నాశనం చేయకుండా వాటిని పెచ్చరిల్లనిస్తే, భూమిమీద పంటలు బాగా పండవనీ, మానవ జాతి అభివృద్ధికి కష్టమని ఆదిమ వాసులు భయపడి, కేకలు వేయడంవల్ల, మంటల వల్ల, బూతు మాటల వల్ల దుష్ట గ్రహాలు, దయ్యాలు తొలగిపోతాయని నమ్మిన కాలం నుండి మంటలు వేయడం ఉత్సవంగా మారిందని నమ్మకం.
అలాగే ఉజ్జయిని రాజైన విక్రమ శక స్థాపకుడైన విక్రమార్కుడు, ఇలాంటి మంటలను ప్రారంభించినట్లు కథనాలున్నాయి. ప్రస్తుతం విక్రమార్క శకం 2077వ సంవత్సరం నడుస్తున్నది. విక్రమ శక సంవత్సరాలను సంవత్‌ అంటారు. ఫాల్గుణ పూర్ణిమ ఆ సంవత్‌ కు ఆఖరు దినం. మరునాటి నుండి కొత్త సంవత్సరం, ఇలా పాత సంవత్సరాన్ని (సంవత్‌) తగుల బెట్టడానికి గుర్తుగా ఈ మంటను పెట్టడాన్ని పాటించారని భావిస్తారు. మంటలు వేయడం, వసంతాలాటలు ఫాల్గుణ పూర్ణిమ నాటి ముఖ్య కార్యాలు. ఫాల్గుణ పూర్ణిమ నాడు పెద్ద మంటలు పెట్టి, ఆ అగ్నిని పరమ పవిత్రంగా భావిస్తారు. దూర గ్రామాల వారు సైతం అగ్ని కణాలను తీసుకెళ్ళి, ఫాల్గుణ పూర్ణిమ మరునాడు, ఆ వసంత కాలాన పూచిన పువ్వులు, కాయలు, పచనము చేసి, తినే ఆచారం ఉండేది. పిల్లలు, మగ వారు ఈ మంటల చుట్టూ నాట్యాలు చేసి, ప్రదక్షిణలు ఆచరించి, తమ శరీరాలకు విభూతిని రాసుకునే వారు. కొన్ని రోగాల బారినపడిన వారు, ఈ మంటల మీదుగా దుమికితే, రోగ విముక్తులు కాగలరని ప్రగాఢ విశ్వాసం. రాక్షసి బారి నుండి పరిరక్షించ బడిన ప్రహ్లాదుని ఉదంతం ఆధారంగా హోలీ మంటలు వేయడంలో బాలురకు ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వడం ఆచారమైంది. ఈ పర్వంలో పిల్లలకు బహుమానాలు ముడ తాయి. పంచదారతో చేసిన ఆకుపచ్చ పూసలు, తెల్ల పూసలతో దండలు కూర్చుండగా, వాటిని పిల్లలు కొంతసేపు ధరించి, ఆనందించి, తర్వాత తినడం చేస్తారు.

రాధ- గోపికల హోలీ

హోలీ పండుగను శ్రీకృష్ణ పరమాత్మం పెరిగిన ప్రాంతాలైన మధుర, బృందా వనంలలో 16 రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు. ప్రతి సంవత్సరం రంగ పంచమి రోజు భగవంతుడైన శ్రీకృష్ణుడికి రాధపై వున్న ప్రేమను కొని యాడతారు. శ్రీకృష్ణుడు తన గోపికలతో శ్రీకృష్ణుడు తన చేష్టల ద్వారా ఈ పండుగ ప్రసిద్ధికెక్కేలా చేశాడని నమ్ముతారు. కృష్ణుడు తన తల్లితో అతని నల్లని శరీర రంగు, రాధ శరీరం రం గు మధ్య వ్యత్యాసం గురించి ఫిర్యాదు చేశాడని, కృష్ణుడి తల్లి రాధ ముఖా నికి రంగు పూయాలని నిర్ణయించుకుంది. అప్పటి నుంచి వసంత ఋతువులో అంటే ప్రేమ విక సించే మాసంలో ఆత్మీయత, అనురాగం పెం పొందేలా జరుపుకునే రంగుల పండుగ హోలీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement