Saturday, November 16, 2024

ప్రవృత్తి నివృత్తి మార్గాలు

ప్రవృత్తి నివృత్తి మార్గాల సంగమం మానవ జీవితం. ప్రతి లౌకిక విషయానుభవాన్ని తాను, తనది, తన కొరకే అని అనుకుంటూ అనుభవించ డం ప్రవృత్తి మార్గం. దీనినే ప్రేయో మార్గం అని కూడా అంటారు.
అలాగాక, లౌకిక విషయాలను అనుభవించే వాడు తాను కాదని, అంతర్యామి అయిన భగవా నుడే అనుభవించుచున్నాడని, తాననుభవించడం తన కొరకు కాదని, భగవానుని ప్రీతి కోసమే అని, ఆ భగవానుడే తన పనిని తన ప్రీతి కొరకే చేయించు కొనుచున్నాడు గానీ, నేను నా పనిని నాకోసం చేస్తు న్నవాడిని కానని గుర్తించి మెలగడం నివృత్తి మార్గం. మానవ జీవితంలో రెండు మార్గాల్లోను పనిచేయడం, అనుభవించడం వుంటుంది. ఇవి అన్నదమ్ముల వంటివి. రామాయణంలో వాలి, సుగ్రీవుల వంటివి. ప్రవృత్తి మార్గానికి మనస్సు, నివృత్తి మార్గానికి ఆత్మజ్ఞానం మూలం, మనస్సు, ఇంద్రియాలకు అధిపతి అయిన ఇంద్రుడు వాలికి తండ్రి. సూర్యుడు తనంత తాను ప్రకాశించే ఆత్మజ్ఞా నానికి ప్రతీక. ఆత్మజ్ఞానం కలవాడు నివృత్తి మార్గం లో ప్రవర్తిస్తాడు. దీని ప్రతినిధి అయిన సుగ్రీవుడు సూర్యుని కుమారుడు. వాలికి, సుగ్రీవుడికీ అంటే ప్రవృత్తి- నివృత్తి మార్గాలకు పడదు. ఇద్దరికి విరోధం. నివృత్తి మార్గానికి వెనక దైవముంటాడని చెప్పడానికి సుగ్రీవునికి రాముడితో మైత్రి ఏర్పడిం ది. వీరిద్దరు జీవాత్మ, పరమాత్మలు. సుగ్రీవుడు చం పాడేమో అని భావించేటట్లు రాముడే వాలిని చంపు తాడు.
నివృత్తి మార్గంలో వున్న జీవుడికి వెనక దైవం వుండి కార్యం సఫలం చేయిస్తాడు. ప్రవృత్తి, నివృత్తి మార్గాల్లో అంతిమ విజయం నివృత్తి మార్గందే అని చెప్పడానికి వాలి చనిపోతాడు, సుగ్రీవుడు జీవించి సుఖిస్తాడు. రామాయణం అంతా ఇలాంటి అంత రార్థాలు, వేదాంతార్థాలతో నిండి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement