Sunday, October 20, 2024

ప్రతీ పనీ ఓ అనుభవమే!


భగవంతుడి కొరకు పని చేయడం అనగా దేహంతో దైవాన్ని ప్రార్థించడమే అంటారు శ్రీమాత.
ఏ పని చేయని యెడల జీవితం నిస్సారంగా ఉం టుంది. కర్మ చేయకుండా, ధ్యానంలోనూ, జపంలోనూ ఉండి, ముక్కు మూసుకుని కూర్చుంటే ఏవిధమైన అనుభవము పొందలేము. జీవితము అనేది అనుభవానికి ఒక క్షేత్రముగా ఉంటుంది. మనము చేసే ప్రతి పని, కదలి కలన్నియూ, ప్రతి భావన ఒక అనుభవం కాగలదు. అందు వలన ఏదో వ్యాపకం పెట్టుకుని పనిచేస్తూ ఉంటే, అనేక అనుభవాల వలన, పరిస్థితుల వలన, ఇతరులతో సంబం ధం వలన సాధనలో మనం ఎంతవరకు పురోగించామో తెలియును.
శ్రీ అరవిందాశ్రమంలో ప్రతివారూ పనిచేస్తారు. అయి తే వారికి ఏవిధమైన వేతనాలు వుండవు. ప్రతి ఒక్కరూ పరిపూర్ణత కోసం ఆకాంక్షించడమే నిజమైన ఆధ్యాత్మిక అం టారు అమ్మ. ఏ పని చేస్తున్నాం, ఎంత పనిచేసారు అనేది ముఖ్యం కాదు. అంతరంగంలో ఏ భావంతో, ఏ చైతన్యం తో చేసార నేదే ముఖ్యం. గొప్ప పని, హీనమైన పని అనే తార తమ్యా లు లేకుండా కర్మలు నిర్వహిస్తారు.
భగవంతుడి దృష్టిలో అన్ని పనులు సమానమే. కవి త్వం చెప్పడం గొప్పది అని, వంట చెయ్యడం తక్కువ రక మైన పని అని భావించకుండా మన చర్యలన్నింటినీ భగవ దర్పణగా చేసినప్పుడు, అన్నిటికీ సమానమైన ప్రాము ఖ్యత లభించును. గృహమును శుభ్రం చేసే సాధారణ ప్రక్రియను కూడా, పరిపూర్ణత, పురోగమనం సాధించాలనే దృష్టితో చేసినప్పు డు, అదే మనను ఉన్నత చైతన్యమునకు కొనిపోగలదు.
ఇక ఉన్నతమైన పనులుగా భావించే, సాహిత్యము, పరిశోధనలు, కళలు మున్నగు వాటిని కీర్తి కోసంగానీ, స్వాభిమానం, సంతృప్తి కోసంగానీ లేదా ఏదో వస్తువును పొందాలనీ అనుకున్నప్పుడు తిరోగమనమే అవుతుంది. అందులో పురోగమనం అనేది అసలు ఉండదు.
అందువలన కర్మలను అంతరంగ వైఖరిపై ఆధారపడి చేయాలి. అప్పుడు శ్రీ మాతనే మన ద్వారా పని చేస్తుం దనే అవగాహన మనకు ఏర్పడును. ఏమి చేస్తున్నా అది అమ్మ పనే కాని మన సొంతం కాదు అనేది సత్యం.
శ్రీమాత ఉన్మీలనమై ఉన్నప్పుడు, మనము ధ్యానము చేయకపోయినా, పని ద్వారానే మనకు కావలసినది అందు తూనే ఉంటుంది. అహంకారంతో, స్వార్థపూరితమైన వ్యక్తి త్వంతో చేసే పనిని మన సొంతం అనుకుంటేనే సమస్యలు చుట్టుముడతాయి. అందుచేత ఎవరైనా పనిని తమదని చెప్పడం మానేస్తే పెద్ద చిక్కుముడి విడిపోతుంది అంటారు అమ్మ. మంచి భావాలతో నిష్కామ కర్మ చేస్తున్నప్పుడు, సహజంగానే కష్టాలు, సమస్యలు, ఆటంకాలు అధికంగా ఉంటాయి. వాటిని దివ్యమాత సహాయంతో, దృఢమైన సంకల్ప బలంతో, సమదృష్టితో వాటిని ఎదుర్కోవల యును. అప్పుడే అత్యద్భుతమైన ఫలితములను పొంద వచ్చును.
పని చేసేటపుడు బయట ఏవో ఆటంకములు కలుగుతూ ఉంటే, దృష్టిని బాహ్యము నుండి మన లోపలికి మరలించిన అటువంటి ఇబ్బంది, అలజడి మనలోనూ చూస్తాము. అంతరంగంలో మార్పు చేసుకుంటే బాహ్యం లోని పరిస్థితులన్నియు చక్కబడతాయి. |ష షఠా ూ శి| dుn| nుష ఫ| అంటారు దివ్యమాత.
నా ఇచ్ఛకాకుండా ప్రభూ మీ సంకల్పమే నెరవేరాలి అని మనము నిరంతరమూ దైవాన్ని ఆకాంక్షిస్తూ ఉండ వలయును. మనస్సును నిశ్చల నీరవతలో ఉంచి ఏకా గ్రతతో పనులు చేసినప్పుడు ఒక గంటలో చేసే పనిని అతి శీఘ్రముగా, తక్కువ సమయంలో ఎంతో సమర్థవం తంగా, పరిపూర్ణముగా చేయగలమని శ్రీ మాత చెప్పారు.
ఇతరులు ఏమి చేస్తున్నారా అనే దానితో సంబంధం లేకుండా, మన పనిని ఆత్మోత్సాహంతో, సంకల్ప బలంతో చేయాలి. అప్పుడు అమ్మ శక్తి మనలో పనిచేయడం ద్వారా కర్మలన్నియూ సునాయాసంగా జరుగుతాయి.
పనులలో మనం అనుసరించే పద్ధతి ద్వారా జీవితా న్ని దైవ ఆరాధనగా మలచుకోవచ్చు. చేసే బాహ్య కర్మలన్ని టినీ, మన ఆలోచనలన్నింటినీ, సమస్త క్రియలను, మన లోనూ, జగత్తులోనూ, ఉన్న ఆ అనంతునికి సమర్పించ వలయును. భక్తితో సమర్పించిన పత్రం, పుష్ఫం, ఫలం, ఉదకమును కూడా ఆనందంగా స్వీకరిస్తానని గీతాచార్యు డు అంటాడు కదా. ఇట్టి భావమునే శ్రీమాత తన డైరీలో 12 మార్చి 1914లో ప్రార్థనలుగా (ధాన్యములో) వ్రాసి కొన్నారు. మనము నిజంగా దైవ కార్యాలు చేయాలని అను కున్నప్పుడు, కోరికలకు స్వాభిమానమునకు, అహంకార మును అతీతంగా వుండవలయును. జీవితమంతా పరం ధామునికి నివేదనతో కానుకలాగా సమర్పణ చేయాలి. అదే మన జీవిత పరమార్థం కావాలి. మన సంకల్పానికి, దివ్య సంకల్పానికి బేధం లేకుండా, ఆమె ప్రబోధనతో మన కర్మలన్నీ జరిగిపోతే జీవితం పరిపూర్ణత్వం సాగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement