తపస్సనగానే శరీరమును శుష్కింపజేసే ప్ర క్రియ అని ప్రజలలో సామాన్యమైన ఒక దురభిప్రా యము ఏర్పడినది. సన్యాసమును స్వీకరించి, కఠోర నియమములను పాటిస్తేనే తపస్సు సాధ్యమగు ను అనుకుంటారు. సన్యాసి, శారీరక, ప్రాణిక, మానసిక జీ వితము ఆధ్యాత్మిక అభివృద్ధికి బంధములనియూ, అవరోధములని, మొండివని, వ్యర్థములని, భారము లనియు, ఆధ్యాత్మిక పరిణామము పొందుటకు అను వైనవి కావని భావించి నిర్థాక్షిణ్యముగా వాటిని త్రోసి పుచ్చును.
ఆధ్యాత్మిక జీవితమంటే ప్రపంచాన్ని నిరాకరిం చ డం ఒకటే మార్గమని, జన సామాన్యంలో ప్రబలంగా నాటుకుంది. అలా ఈ ప్రపంచాన్ని నిరాకరించి పర లోకాన్ని మాత్రమే నమ్ముకున్న వారంతా సన్యాసులు గా జీవిస్తారు. ఇంతవరకు వచ్చిన మ#హనీయులంద రూ పరలోకంలోని ఆనందం గురించే చెప్పారు తప్ప ”ఈ లోకాన్ని ఆ ఆనంద స్థితికి మార్పు చెందించవ చ్చు” అని చెప్పలేదు. మోక్షం అనేది వ్యక్తిగతం అని, దానిని ఎవరికి వారు సంపాదించుకోవాల్సిందేనని చెప్పారు.
అయితే పూర్ణయోగ సాధకుని దృష్టిలో జీవన సమస్య వేరు, ఈ భౌతిక జీవితము ఒక మార్గము, ఒక ఉపకరణము మాత్రమే కాదు, పరిణామము ద్వారా ఇదొక లక్ష్యము, ఒక సంసిద్ధి కావాలని భావిస్తాడు. అందువలన తపస్సునిపుడు, దేహము యెడల నిరసన భావంతోగానీ, శరీరమును ఏదోవిధంగా వదల్చు కోవ లెననే తలంపుతో కాక దానిని స్వాధీనం చేసుకొని, దా ని పై సౌమ్యమును కలిగి ఉండాలనే భావంతో మెలగును. సన్యాసి ఆచరించు శారీరక తపస్సు కంటే విలక్షణమై నది, సంపూర్ణమైనది.
ఆధ్యాత్మిక జీవితమును ఈ దేహంతోనే పృథ్విపై పరిణామము చెందుటకు మనలో పరిపూర్ణ పరివర్తన కు కా వలసిన నాలుగు విధములైన స్వేచ్ఛలను స్థాపించే ”చతుర్విధ ఉపాసనలు” దివ్యమాత మనకందించా రు. క్రిందటి వారం ”సౌందర్యోపాసన” గురించి చెప్పు కున్నాము. ఈ రోజు రెండవదైన శక్త్యోపాసన” గురించి విశ్లేషించుకుందాం.
శక్త్యుపాసన
శక్తి ఉపాసన ప్రాణతపస్సుకు చెందినది. ఇది ఇం ద్రియ నిగ్రహమును కలుగజేయును. ప్రాణిక అస్తిత్వ ము అతి ఉత్సాహమునకు, శక్తులకు కేంద్రము. ఈ శక్తి కేంద్రమునందే ప్రాణికములోని ఆలోచనలు సంకల్ప శక్తిగా పరిణామము చెంది క్రియాశీలమగు యంత్ర ముగా తయారగును. ప్రాణ క్షేత్రములోనే కోరికలు, ఉద్రేకములు, ఆవేశములు, ప్రతిఘటనలు, నిస్పృ#హ, నిరాశ మున్నగు వాటికి మూలస్థానము. ప్రాణశక్తికి బల ము, జీవనాధారము మూడు క్షేత్రముల నుండి సమ కూరును. మొదటిది అదో భూమిక. ఇంద్రియముల ద్వారా సంప్రాప్తమగును. రెండవ ఆధారము స్వీయ ప్రాణిక భూమిక, ప్రాణశక్తి విస్తరించుటకు విశ్వాసాన్ని శక్తులతో స్పర్శనందుకొని దానికి ఉన్ముఖుడగును. మూడవది అభివృద్ధికై ఆకాంక్షించడం వలన ఊర్థ్వ భూమికలో నుండి శక్తులు, ప్రేరణలు అతనిలో ప్రవేశిం చును.
స#హనముతో ప్రతి విషయము పరిశీలించి శరీర మునకు, ప్రాణికమునకు అవసరమైన వాటిని, ఆరోగ్య మైనవి, సౌందర్యమైనవి సామరస్యంతో స్వీక రించవల యును. జుగుప్సమైనవి, హానికరమైన అభివృద్ధిని నిరో ధించే వాటిని తొలగించుకోవలయును. విజ్ఞాన వంత ము, పరిశుద్ధము, తీక్షణమైనదిగాను, సూక్ష్మమైనది గాను, మృదువుగాను, సంస్కారము గలది గాను రజో శక్తిని ఆ విధముగా ఉద్ధరింప చేయవలయును. ఇక స#హ జముగానే పశుత్వమును, క్రౌర్యములను అధిగమిం చవచ్చును. నిజాయితీగా, స్వచ్ఛముగా ఈ విధముగా చేస్తూ వుంటే ఉన్నత జీవిత లక్ష్యమైన దివ్యానందం వైపు మనము పరు గులు తీయ గలము.
ప్రాణశక్తికి మూలం శక్త్యుపాసన
Advertisement
తాజా వార్తలు
Advertisement