Sunday, November 17, 2024

సర్వ దేవతల రూపమే ప్రాణదేవత!

విదేహ రాజు జనకుడు ‘బహుదక్షిణ’మనే యాగాన్ని చేశా డు. ఆ యాగానికి కురుపాంచాల దేశాల్లోని మహావిద్వాం సులందరూ వచ్చారు. వారిని చూసిన జనక మహారాజు వీరి లో బ్రహ్మాన్ని తెలిసిన వారెందరు? అని గుర్తించదలచి బంగారం పొదిగిన కొమ్ములున్న మేలు ఆవులను గోశాలలో వుంచి ”మీలో బ్రహ్మవేత్త ఎవడో అతడీ గోవులను తరలించుకుపోవచ్చు”. అని నిండుసభలో ప్రకటించాడు. ఆ ప్రకటన విని సభలోని వారెవ్వరూ లేవలేదు. అప్పుడు యాజ్ఞవల్క్యుడు తన శిష్యుణ్ణి పిలిచి గోవులను తరలించుకొని పొమ్మనటం, ఆ పైన సభలోని చాలామంది పండితు లు యాజ్ఞవల్క్యుడితో వాదించి పరాజయం పొందటం, తరువాత బ్రహ్మవాదిని, విదుషీమణి గార్గి యాజ్ఞవల్క్యుణ్ణి కొన్ని ప్రశ్నలడిగి తగిన సమాధానం పొందినదై యాజ్ఞవల్క్యుణ్ణి ఎవరూ ఓడించలే దు, ఆయనే అందరికంటే గొప్ప బ్రహ్మవేత్తని ప్రకటించారు. అహం కారంతో బ్రహ్మజ్ఞానిని అవమానించడానికి ప్రయత్నిస్తే వాళ్ళకు ఇహపర లోకాలుండవని చెబుతోందీ బ్రాహ్మణం. ఉత్తములు, పెద్ద లు, పండితులైనవారితో గౌరవంగా మెలగాలని వారి అనుగ్రహానికే తప్ప ఆగ్రహానికి పాత్రులు కాకూడదని ఈ బ్రాహ్మణం బోధిస్తోంది.
అలా ప్రకటించిన తర్వాత కూడా శకలుని కుమారుడైన విద గ్ధుడు (శాకల్యుడు) అనే ఋషి బహుశా కొంతమంది బ్రాహ్మణులచే ప్రేరేపింపబడి యాజ్ఞవల్క్యుని ప్రశ్నించడం మొదలుపెట్టాడు.
యాజ్ఞవల్క్యా! దేవతలెందరు? అష్ట వసువులెవరు? ఏకాదశ రుద్రులెవరు? ఆదిత్యులెవరు? అని అడిగాడు విదగ్ధుడు.
ముప్పైమూడు కోట్ల దేవతలు అంటే సంస్కృతంలో కోటి అంటే విభాగం అని అర్ధం. మొత్తం ముప్పై మూడు రకాలయిన దేవ తలు అని అర్ధం వస్తుంది. నిజానికి వీరు 33 కోట్లమంది కాదని 33 రకాల దేవతా సమూహాలని యాజ్ఞవల్క్య మహర్షి కాకల్యునికి చె ప్పడం మొదలుపెట్టాడు. ”ఓ శాకల్యుడా! వైశ్వదేవ శస్త్రము యొక్క దేవతా సంఖ్యను తెలిపే నివిత్తు అనే మంత్రముతో ఎంత సంఖ్యగల దేవతలు ఏర్పడుతున్నారో అంతమంది దేవతలున్నారు. ఆ మంత్ర ము ద్వారా 303 దేవతలు, 3003 దేవతలు కలిసి మొత్తం 3306 మంది దేవతలు. కాని 33మంది దేవతల యొక్క విభూతులే (స్వ రూపాలే) ఆ మొత్తం దేవతలందరూ కూడా. వారే ఆరుగురు దేవత లుగాను, ముగ్గురు దేవతలుగాను, ఇద్దరు దేవతలుగాను, ఒకటిన్న ర దేవతగాను చివరగా ఒక్క దేవతగాను అయ్యారు.” అంటూ వారి వివరణని ఈ విధంగా చెప్పసాగారు. వారే, అష్ట వసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, ఇంద్రుడు మరియు బ్రహ్మ (ప్రజా పతి) కలిపి మొత్తం ముప్పైమూడు మంది దేవతలు. ముప్పై మూ డు కోట్ల దేవతలు అంటే 33 రకాల దేవతా సమూహములు.

అష్ట వసువులు

అగ్ని, పృథివి, వాయువు, అంతరిక్షము, ఆదిత్యుడు, ద్యులో కము, చంద్రుడు, నక్షత్రాలు అనే ఈ ఎనిమిదిలోనూ సర్వమూ ఉం చబడింది. అందుచే వారికి వసువులని పేరు. భూమిపై గల సమస్త పదార్ధములకు రంగు రుచి వాసన గుణము ఆకారము (అస్థి కల్పిస్తూ ప్రకాశించేవాళ్ళు వసువులు, భూమి యందలి ఏ రూపమైనా వసు వులు లేకుండా ఏర్పడదు.

ఏకాదశ రుద్రులు

ఏకాదశ రుద్రులంటే పురుషునిలో ఉండే పంచప్రాణములు, మనస్సు, జీవాత్మ కలిపి ఒకటి, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు మొత్తం పదకొండు రుద్రులు. ఆత్మయే పదకొండ వ రుద్రుడు. ఈమధ్య శరీరాన్ని వదలనని, విడిచి వెళ్ళనని చెప్ప డం మానవునికి దు:ఖ హతువు. ఆ రకంగా ఏడ్పించడం వల్లనే ”రోదయంతి రుద్ర:”- రుద్రులు అని పేరు వచ్చింది. ఆకాశంలో ఏర్పడే స్పందనలన్నీ రుద్రులు సృష్టించేవే. పంచభూతాత్మకమైన ప్రకృతిలో ఉండే మార్పులన్నీ వీరు సృష్టించే స్పందనలే కాబట్టి ప్రా ణుల జీవనం వీరి దయపై ఆధారపడి ఉంది. మనలోని పంచ జ్ఞా నేంద్రియాలను, పంచ కర్మేంద్రియాలను, మనస్సును శాసించేది ఈ రుద్రులే. ద్వాదశ ఆదిత్యులు సంవత్సరములోని పన్నెండు మా సాలు పన్నెండు ఆదిత్య దేవతలు, ఒక్కొక్క మాసంలో సూర్యకిరణాలు ఒక్కొక్క గుణాన్ని కలిగి ఉంటాయి. ఆ పన్నెండు ఆదిత్యులు వేరు వేరుగా ఉంటారు. ఆయా మాసములందు పరి వర్తన చెందుతూ ప్రాణుల ఆయుస్సును కర్మఫలమును హరించు చుండడం చేత ”ఆదదాన:” ఆదిత్యులు అని పిలవబడుతున్నారు.

- Advertisement -

ఆరుగురు దేవతలు

విదగ్ధుని తర్వాతి ప్రశ్నకు సమాధానంగా ”విదగ్ధ! అగ్ని, భూ మి, వాయువు, అంతరిక్షము, దు అనే ఆరు ఆరుగురు దేవతలు. ఇంతకుముందు చెప్పిన 33 దేవతలు ఈ ఆరుగురే అవుతున్నారు.

ముగ్గురు దేవతలు

భూమి, సూర్యుడు, ద్యులోకము అనే ఈ మూడు లోకాలు ముగ్గురు దేవతలు. సర్వ దేవతలు (ఆరుగురు దేవతలు) ఈ ముగ్గు రిలో అంతర్భావాన్ని కలిగి ఉన్నారు.

ఇద్దరు దేవతలు

అన్నము, ప్రాణము అనే రెండూ పూర్వోక్తమైన ఇద్దరు దేవతలు.

సగము అధికముగా గల దేవత

వాయువే ఒకటిన్నర దేవత. వాయువే అధ్యర్ధము అన్నారు. ఒకటి వాయువు ఒక దేవత. వాయువు చేతనే సమస్తము అభివృద్ధి చెందుతోంది, అంతేకాకుండా చరాచర ప్రాణికోటికి ఆధారము వా యువే కాబట్టి ఇంకొక అర్ధ భాగంగా పేర్కొని వాయువును ఒకటిన్న ర దేవతగా వర్ణించారు. ఒకేఒక్క దేవత ప్రాణమే ఒక్క దేవత: సర్వ దేవతలు ఒక్క ప్రాణం లోనే ఉన్నారు. అందువల్ల ప్రాణమే సర్వ దేవాత్మకమైన బ్రహ్మముగా అభివర్ణించారు. ”జ్యేష్ట శ్రేష్ట ప్రజాపతి” అని నామాన్ని పొందిన ప్రాణమే సర్వ దేవతా స్వరూపము.
ముప్పయి మూడు (3306) దేవతల యొక్క రూపమే ఈ ప్రాణ దేవత. అందుచేత ఆ ప్రాణమే బృ#హత్స్వరూపమైన ఆ పర బ్ర#హ్మమని చెప్పబడుతోంది అని బృ#హదారణ్యకోపనిషత్తు తెలి యచేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement