Saturday, September 7, 2024

వివేకానందునిధ్యాన ప్రకాశం!

త్రిగుణాలను అనుసరించే మనసును సవ్యదిశలో పయనించేలా చేసేదిధ్యానం.సంకల్పానికి ధ్యానం ఒక ఔషదం. అయితే ధ్యానం అంత సులువైన విషయం కాదు. దానికి పూర్వజన్మ వాసనలు ఉండాలి. గురువు ను ఆశ్రయించి, వారి అనుగ్రహం కల్గినవారికి మాత్ర మే ధ్యాన రహస్యం తెలుస్తుంది. కానీ వివేకంతో మన సును స్వాధీనం చేసుకొనే క్రమంలో లోకజ్ఞానం కూ డా ఒక మార్గదర్శిగా తోడ్పడుతుంది. మనసు పవిత్ర మైతే లోకోపయోగమునకు అవసరమైన సంకల్పం స్ఫురిస్తుంది. మనసును జయించినవాడే విశ్వవిజేత.
మన ప్రాచీన ఋషుల తపస్సును అవగా హన చేసుకున్న స్వామీ వివేకానంద ధ్యా నం పవిత్రతను, ప్రయోజనాన్ని సంపూర్ణంగా వివరించారు. వారి జీవితాన్ని అనేక అలౌకిక విశ్వ రహ స్యాలను కనుగొనడానికి అంకితం చేసా రు. భారతదేశ యువతకు ఒక దిశా నిర్దేశం చేసారు. అలాగే పాశ్చాత్య దేశాలకు ధ్యానా న్ని పరిచయం చేసిన వ్యక్తి స్వామీ వివేకానంద. ధ్యానం అనేది అంత:చతుష్టాలను అనగా మన స్సు, బుద్ధి, అహంకారం, చిత్తములను శోధించి ఆత్మకు చేరువచేసే దివ్యసాధనం. ఆత్మను భగ వంతునితో అనుసంధానం చేసే వారధిగా స్వామి అభివర్ణించారు.
ధ్యానం ఒక పవిత్రమైన స్థితి. మన సును స్వాధీనం చేసుకునే ప్రక్రియ. దీని కి కఠోరమైన, సున్నితమైన దీక్ష, అభ్యా సం అవసరం. కారణ జన్ములకు ఇది కరతలామలకం. కానీ సామాన్యులకు దీర్ఘ కాల పరిశ్రమ ధ్యానం వారివారి సంక ల్పాలకు శక్తిని చేకూర్చుతుంది. స్వా మీ వివేకానంద డిసెంబర్‌ 24, 18 92లో మూడు సముద్రాలు కలిసు న్న కన్యాకుమారిలో గల ఒక శిలా ద్వీ పాన్ని ఈదుతూ చేరుకున్నారు. నిర్మా నుష్యమైన ఆ ప్రదేశంలో, ఉగ్రమైన సముద్ర అలల తాకిడిలో, మూడు రోజులు రాత్రింబవళ్ళు ధ్యా నంలో నిమగ్నమయిపో యారు. ఆ ధ్యానంలోనే ఆయనకు సంకల్పసిద్ధి కలి గింది. ఆయన జీవితానికి గమ్యం లభించింది. భార తదేశమంతా పర్యటించిన ఆయనకు దేశ ప్రజల పేదరి కం, ఆత్మగౌరవం కనుల ముందు కదలాడాయి. వేద యుగం నుండి ఆరోజు వరకూ అఖండ భారతదేశం జ్ఞానం, ఔన్నత్యం, ఆత్మ శక్తి పరిణామాలు అవగతమ య్యాయి. భారతజాతి పూర్వవైభవం కన్నీళ్ళు తెప్పిం చింది. ఖాళీ కడుపు మతానికి మంచిది కాదన్న గురు దేవులు రామకృష్ణ పరమహంస మాటలు మార్మోగా యి. ధ్యానం నుండి బయటకు వచ్చిన ఆయన మనసు స్వీయ విశ్లేషణ చేసింది. జీవిత దిశానిర్దేశంతో ఆయన అక్కడ నుండి 1893లో చికాగోలో జరిగిన ప్రపంచ సర్వ మత మహా సభలకు హాజరయ్యారు. ఇక అక్కడి నుండి ఆయన త న సంకల్పానికి తగిన ఆధ్యాత్మిక, భౌ తిక వనరులను సమీకరించుకున్నారు. రామకృష్ణ మిషన్‌ స్థాపించి ప్రపంచానికి మానవ సేవను అందిస్తు న్నారు. భారతదేశం ప్రజల ఆత్మగౌరవమే దేశ శ్వాస. ఈనాటికీ భారతదేశం వైపు ప్రపంచం అంతా చూస్తుం ది అంటే ఆ ‘ఆత్మ’ అనే సత్యస్థితి. ధ్యానంతో మనో కల్మ షాలు మటుమాయమవుతాయి. విశ్వశాంతికి అవసర మైన మార్గం సుగమమవుతుంది. ప్రకృతి, మానవ వికాసాల అంతరార్థం విశ్లేషణచేసే శక్తి వస్తుంది.
నిర్భయంగా మీ లక్ష్యాలను చేరడానికి ముం దుకు సాగండి. మీ ప విత్ర లక్ష్య సాధనకు ఆదర్శా న్ని దృఢంగా అంటిపెట్టుకొని ఉండండి. ఆ ప్రయ త్నంలో వేయిసార్లు అపజయం ఎదురైనా మరొక సారి ప్రయత్నించండి. ఎందుకంటే మీ సంకల్పం, ల క్ష్యం మానవ కళ్యాణం. మీ ముందు అనంతమైన జీవి తం ఉండి. మీకెంత అవసరమైతే అంత సమయం తీసుకోండి!
ధర్మాన్ని అవలంబిద్దామనే ప్రయత్నంలో ఎనభై శాతం మంది మోసగాళ్ళు, పది హేను శాతం పిచ్చి వాళ్ళు గానూ మారుతున్నారు. మిగిలి న ఐదుశాతం మాత్ర మే ఆ అనంత సత్యపు జ్ఞానాన్ని సంతరించుకోగలుగు తున్నారు. పాశ్చాత్య దేశాల్లో ఉరకలెత్తుతున్న భౌతిక వాదాన్నీ, మానవ జాతి ప్రా ణాలకే ముప్పు తెచ్చే పోకడలను గమనించండి. విశ్వ శాంతి కొరకు ధైర్యంగా మేరు పర్వతంగా స్థిరంగా నిల బడగల ధర్మరూపులైన త్యాగధనులు మాత్రమే సా ధించగలరు. ప్రగల్భాలు, వంచన మానండి. మీ శరీ రంలోని ప్రతి రోమ కూపం నుండి పవిత్రతనూ పరిశు ద్ధతనూ, వైరాగ్యాన్ని వెలువడనీయండి.
మానవ జన్మ గమ్యం సత్యం లక్ష్యం తెలుసుకుం టారో వారే మానవ శ్రేయస్సుకు పాటుపడతారని వివే కానంద ధ్యాన ప్రకాశాన్ని ప్రపంచానికి అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement