Friday, October 4, 2024

HYD: హైదరాబాద్, రాజమహేంద్రవరంలో శ్రీనివాస్ సౌభాగ్యకు ఘన నీరాజనం

హైద‌రాబాద్: నాలుగు వేదాలూ కూడా శ్రీమాతను సేవించడం వల్లనే క్రమం, విక్రమం, పరాక్రమం పదునాలుగు లోకాలకూ ఆవిష్కరించబడి కనకదుర్గమ్మ మనకు యుగాల నుండీ ప్రసన్నమై వరాలు వర్షిస్తోందని, ఆ తల్లి ఉపాసన వల్లనే ప్రముఖ రచయిత పురాణపండ, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధికారిక మాసపత్రియేక ఆరాధన పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ దశాబ్దాల దేవీచౌక్ దుర్గమ్మ ఉత్సవాలకు అత్యద్భుతమైన సౌభాగ్య గ్రంధాన్ని రచనా సంకలనంగా అందించగలిగారని ప్రధాన అర్చకులు దొంతంశెట్టి కాళహస్తీశ్వరరావు అభినందించారు.

కోస్తా జిల్లాల్లో అత్యంత ప్రతిష్టకరమైన రాజమహేంద్రవరం దేవీచౌక్ శ్రీ దేవీనవరాత్రుల ఉత్సవాల సంరంభం సందర్భంగా పాడ్యమి నాటి రాత్రి ఉత్సవాల సుముహూర్తంలో సౌభాగ్య భాషా సౌందర్యాల, రూప సౌందర్యాల, స్తోత్ర సౌందర్యాల గ్రంధాన్ని దేవీ చౌక్ అమ్మవారి సన్నిధిలో ఉంచి అర్చనలు చేశారు. అనంతరం తొలిప్రతిని రాజమహేంద్రవరం ముత్తయిదువులకు ప్రతినిధిగా చెన్నాప్రగడ హైమావతికి అందజేశారు.

గ్రామీణ, పట్టణ, నగర వాతావరణాల నాగరిక సంప్రదాయాల్ని తలపిస్తూ అపూర్వ శాక్తేయ సంప్రదాయంలో దేవీ చౌక్ పందిళ్ళలో దశాబ్దాలుగా ఘనంగా జరుగుతున్న ఏ దేవీ ఉత్వాల్లో ఈ సంవత్సరం ఈ సౌభాగ్య బుక్ అదనపు పవిత్ర ఆకర్షణగా నిలుస్తుందని, భక్తకోటికి ఈ మంగళ గ్రంధాన్ని సమర్పించిన విఖ్యాత ఆధ్యాత్మిక ధార్మిక ప్రచురణల సంస్థ జ్ఞాన మహా యజ్ఞ కేంద్రం దేవీ చౌక్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు బత్తుల రాజరాజేశ్వర రావు పేర్కొనడం గమనార్హం. ఈ సందర్భంగా ఎం.అఖిల్ సుమారు ముప్పై కిలోల మేలిమి విలువల కుంకుమ బ్యాగ్ ను దేవీచౌక్ అమ్మవారికి సమర్పించగా… ఆలయ అర్చకులు స్వీకరించారు.

- Advertisement -

దశాబ్దాలుగా పురాణపండ వారి దైవీయ చైతన్య గ్రంధాలు తెలుగునాట ఏ ఉత్తమ కార్యక్రమం జరిగినా ప్రథ‌మ స్థానంలో ఉంటాయనడానికి… ఈ కార్యక్రమం కూడా ఒక ఉదాహరణగా పండిత అర్చక ప్రముఖులు బాహాటంగా పురాణపండ శ్రీనివాస్ ఉత్తేజపూర్వక పవిత్ర కార్యాన్ని ప్రశంసిస్తున్నారు.

హైదరాబాద్, విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం వంటి అనేక నగరాల్లోని ఆలయాల్లో, మతాల్లో ఇప్పుడు పురాణపండ శ్రీనివాస్ గ్రంధాలు పరమ పవిత్ర హృదయాలతో అనేక మంది భక్తులకు ఆయా ప్రాంతాల్లో పంచడం, విశేష స్పందన రావడం కనులముందు కనిపిస్తున్నా ప్రస్ఫుటంగా సత్యం.


హైదరాబాద్ రాఘవేంద్ర స్వామి మఠంలో సైతం గత రెండు రోజులుగా పురాణపండ శ్రీనివాస్ శ్రీ లలిత విష్ణు స్తోత్ర వైభవ గ్రంధాన్ని వందల కొలది పంచడం తమకి ఎంతో ఆనందాన్నించ్చిందని, ఈ పవిత్ర కార్యానికి అనూహ్య స్పంద‌న వస్తోందని రాఘవేంద్రస్వామి మఠ మేనేజర్ సూర్యచంద్ర శర్మ చెప్ప‌డం గమనార్హం. ఏ స్వార్ధం లేకుండా ఇంతటి మహాకార్యాన్ని అనేకులుగా చేస్తున్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అకుంఠిత కృషి వెనుక తిరుమల శ్రీనివాసుని కారుణ్యం ఉందని పలువురు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement