Friday, November 22, 2024

మనోనిగ్రహ సాధన!

గీత సమత్వం బోధిస్తుంది. కష్టంకాని, సుఖంలోకాని ఏవిధమైన ఉద్వేగమూ ఉండరాదని చెపుతుంది. ”దు:ఖే ష్వను ద్విగ్న మనా: సుఖేషు విగతస్పృహ:” ఈ స్థితి మనకు రావాలంటే మనం పరి పూర్ణంగా ఈశ్వరుని శరణుజొచ్చితేకాని రాదు. ఈ విషయంలో భగవానులు చక్కగా నిస్సందేహమైన ఆదేశాలు ఇస్తున్నారు. ‘యుక్త ఆసీత మత్పర:’ ‘మామేకం శరణం వ్రజ’ ‘వాసుదేవ స్సర్వమితి’ అన్ని టినీ సమభావంలో చూడలేక కోరికలతో క్రోధాలతో తన మన స్సు రెపరెపలాడుతూంటే, సమర్పణ బుద్ధితో తన ధర్మాన్ని చేయలేని వాడు అయుక్తుడని అంటుంది గీత. అయుక్తునికి బుద్ధీ లేదు, భావనా లేదు. భావన అంటే భక్తితోడి శరణాగతి. ఎప్పుడైతే వానికి భావన లేకపోయిందో, వానికి శాంతి సైతమూ లేదు శాంతిలేని వానికి సుఖమెక్కడిది? ‘అశాంతస్య కుతస్సుఖం’ ఈ గీతోపదేశా న్ని అనుసరించే, త్యాగయ్య ‘శాంతము లేక సౌఖ్యమూ లేదు’ అని గానం చేశారు. ప్రాపంచిక సుఖాలపై తరచు మళ్ళే మనస్సు నిత్య సౌఖ్యాన్ని తెలుసుకోలేక, చిల్లు పడిన నేతి కడవ వలె ఎన్నడూ నిం డక భంగపడుతుంది.
ఐతే గీతలో యోగ సందర్భంగా ఉపయోగింపబడిన సమ త్వానికి అర్థం ఏకత్వంకా దు. రాజూ, రౌతూ సమమని కాదు దాని కి అర్థం. సుఖదు:ఖాలను సమభావంగా చూడటమే దాని ఉద్దేశం. సారాంశమేమిటంటే నియతకర్మలను చేయమనీ, ఆ చేయడమున్నూ ఫలాభిసక్తి లేక భక్తితో ఆర్ద్రమైన హృద యంతో చేయమనీ, కర్మ పూర్తికాగానే అది ఈశ్వరార్పితం చేయమని. ఈ ఆదేశాలు పాటిం చాలంటే ఇంద్రియ నిగ్రహం ఉం డాలి. విషయ ప్రపంచం నుండి ఇంద్రియాలను విముఖం చేయాలి. అలాకాక విషయాలను చూచినదే తడవుగా మనస్సు కళ్ళెం లేని గుఱ్ఱమువలె పరుగిడిపోతే దాని సాయంతో ఆత్మచింతన గానీ, సత్యదర్శనం గానీ చేయలేము. ఇంద్రియాలచే ఉద్విగ్నమైన మనస్సు ప్రజ్ఞ తప్పి పోయి తుపానులో చిక్కుకొన్న నావవలె అల్లల్లాడిపోతుంది. మన స్సుకూ, ప్రజ్ఞకూ గీతలో చేయబడిన తారతమ్యం మనం గుర్తిం చాలి. మనస్సు చేసే పనులను అనుసరించి ఒక్కొక్కప్పుడు బుద్ధి అనీ చిత్తము అనీ వేర్వేరు పదాలతో దానినే వాడుతూంటారు. అంత ర్ముఖ ధ్యానం చేసేది ప్రజ్ఞ. గీతలో మనస్సు సముద్రంతోనూ, ప్రజ్ఞ నావతోనూ, ఇంద్రియోద్వేగం తుఫానుతోనూ పోల్చబడ్డది.
ఇంద్రియ నిగ్రహమనే అస్థి భారంపై, స్థితప్రజ్ఞత్వమనే సౌధం కట్టబడింది. ఇంద్రియాలను అంతర్ముఖం చేస్తే ఆత్మైకత్వ సిద్ధి కలు గుతుంది. ఎన్ని నదులు వచ్చి తనలో పడుతున్నా నిశ్చలంగా ఉం టుంది సముద్రం. అట్టివాడు నిత్యానిత్య వివేచనంతో వ్యాపక బ్రహ్మాన్ని అను సంధానించి ఆ ఆనందానుభూతితో జీవాత్మ పర మాత్మైక్యాన్ని సాధిస్తాడు. ప్రాపంచకుడు దేనిని నిజమని అనుకొంటాడో జ్ఞానికి అది మిథ్య. అందుచేతనే భగవానుడు అర్జునునికి నీకు తగిన కర్తవ్యం నీవు చేయుమని చెప్పడం. యుద్ధం చేయడం రాజ్యం కోసం కాదు, మనో నిగ్రహం కోసం. మనోనిగ్ర#హం లాభించిం దంటే నైష్కర్మ్యం సిద్ధించి బ్ర#హ్మ నిర్వాణానికి దారితీస్తుంది.
ఆత్మ పరమాత్మల ఐక్యమే బ్ర#హ్మ నిర్వాణం.

Advertisement

తాజా వార్తలు

Advertisement