మన దేహంలో ‘ఆత్మ’ అంతర్యామి! మనను ఆవరించి న విశ్వంలో ‘పరమాత్మ’ అంతర్యామి! ఆత్మ అయి నా, పరమాత్మ అయినా అంతర్యాములే!
పరమాత్మ తన కార్యాచరణను విశ్వ రచనా రూపంలో కొనసాగిస్తూనే ఉంటుంది. అదే సృష్టి కార్యం. కాబట్టి జీవాత్మ కూడా తన కర్మాచరణను త్యజించవలసిన అవసరం లేదు. కారణం జీవాత్మ కూడా విశ్వ సృజనలో భాగస్వామి కాబట్టి. అయినా భౌతికతలోని కాలుష్యం వల్ల ఆత్మ దే#హపరంగా సం చరిస్తున్నా కొన్ని కర్మల స్వాభావికత నుండి విడివడి కర్మాచర ణను పూర్తి చేయవలసి వస్తోంది. అంటే రూటు మార్చవలసిన అవసరం లేకపోయినా గేరు మార్చి గమ్యం చేరవలసి వస్తోంది.
ఇలా గేరు మార్చటమే మనం ప్రాపంచికంగాను, దైహ కంగాను సన్యసించటం. ఇదే కర్మ సన్యాసం. సాంఖ్య యో గం. ఇంతకీ సన్యసించటం అంటే జీవాత్మ తన కర్మాచరణను పరమాత్మ పరం చేయటం. భౌతిక కర్మలను అధి భౌతికానికి అంకితం చేయటం. సర్వ సమర్పణ అంటే ఇష్టాలకు అయిష్టా లకు అతీతం కావటం. ద్వైతం నుండి అద్వైతం కావటం. బం ధాల నుండి విడివడటం సన్యాసం.
నిజానికి ఏ వివక్షాలేని స్థితే సన్యాసం. అంతే తప్ప ప్రతి కర్మనూ త్యజించుకుంటూ పోవటం కదా. ఇలా చూసినప్పు డు సన్యాస యోగానికైనా, కర్మ యోగానికైనా లక్ష్యసిద్ధి ఒక్క టే. అయితే ప్రారంభమూ, గమనమూ వేరువేరు.
మొత్తానికి కర్మలకు సంబంధించిన కర్తృత్వ బాధ్యతను వహంచకుండటం కర్మ సన్యాసం. ఇదే యోగి లక్షణం. సన్యా స జీవనం అంటే ఆశారహతులం కావటం. మమకార రహ తులం కావటం. సంతాప ర#హతులం కావటం. అంటే సుఖ దు:ఖాలకు, సంతోష సంతాపాలకు మనసును చేర్చకుండటం.
ఇలా సమస్త కర్మ బంధాల నుండి ముక్తం కావటమే సాం ఖ్యయోగ నిష్ఠ. ఆ జీవన విధానమే సాంఖ్య యోగ సాధన. అయితే ఈ సాంఖ్య సాధనకు జ్ఞాననిష్ఠ అవసరం. ఆశలు, మమకారాలు, కోరికలు, ఆనందాలు, ఆవేదనలు, ఆవేశాలు, అవమానాలు, ఆక్రందనలు- ఇటువంటి ఉద్వేగాల సమా హారమే ప్రాపంచిక జీవనం. ఇవేవీ లేని మానవజీవితం ఏమి టి? అన్న ప్రశ్న తలెత్తటం స#హజం. సృష్టిలోని ప్రతి ప్రాణీ తమ ప్రకృతులకు అనుగుణంగానే కర్మలను ఆచరిస్తుంటాయ న్న అవగా#హన మనందరకు ఉన్నదే. కాబట్టి కర్మాచరణను త్యజించటం జీవన ప్రవృత్తి కాదు అన్నది స్పష్టం.
ప్రకృతి బద్ధమై జీవన యానం సాగించవలసిందే. మ నం చేసే కర్మలలో ప్రకృతి ప్రభావమే కాదు మో#హ ప్రభావం కూడా ఉంటుంది. దీనికి సంస్కార ప్రభావం తోడవుతుంటుం ది. దీన్నే ”స్వభావజేన.. నిబద్ధ: స్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్యవశోపి తత్” అని అంటుంది భగవద్గీత.
మనం ఎంత కాదనుకుంటున్నా, వద్దనుకుంటున్నా స్వ భావ కర్మ వర్తమాన కర్మను ప్రేరేపిస్తుంటుంది. ప్రభావితం చేస్తుంటుంది. ఇక్కడ స్వాభావిక కర్మ అంటే గత కర్మ అనే! దీన్నే మనం స్వాభావిక సంస్కారం అని చెప్పుకోవచ్చు. అంటే ఈ జన్మకు సంబంధించిన కర్మాచరణ విషయంలో మనలో సంపూర్ణ ఇష్టత నెలకొని ఉండకపోయినప్పటికీ, స్వాభావిక సంస్కారం వల్ల వర్తమాన కర్మాచరణ విషయంలో వెనుతిర గటం సాధ్యపడదు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కర్మాచరణ తప్పదు. ఇంతకీ స్వాభావిక కర్మ అనేది గతం తో సంబంధం కలిగి ఉన్నటువంటిది.
అందుకే వర్తమాన కర్మాచరణను గత జన్మ కర్మ శేషం అని, పూర్వజన్మనే ఈ జన్మ కర్మకు కారకం అంటుంటాం. కాబట్టి వర్తమాన కర్మాచర ణ నుండి తప్పుకోవటం సాధ్యం కాదన్నది సామా న్య భావన. యోగ జీవనంలో వర్తమాన కర్మాచర ణకు మూలమైన ప్రకృతికి, స్వభావానికి అతీతం కావటం ముఖ్యం. అంటే స్వభావజనితంగా కాక వివే చనా పూర్వకంగా వర్తమాన కర్మాచరణ పరంగా అడుగులే యటం ముఖ్యం. ఇలా గత కర్మ బంధాల నుండి ముక్తం కావ టమే కర్మయోగం. ఈనాటి మన కర్మాచరణకు మూలమవు తున్న స్వభావం, సంస్కారం అన్నవి మన స్వతంత్ర ప్రవృత్తు లుగా అనిపిస్తున్నా నిజానికి అవి పరతంత్రాలే! గత కర్మ శేషా లు కాబట్టి పరతంత్రాలే. పరతంత్రాలయినప్పటికీ స్వతంత్రా లనిపించటమూ మో#హ ప్రభావ కారణాన్నే!
ఇలా ‘కర్మ’ను అర్థం చేసుకునే ప్రయత్నంలో కర్మలు స్వ భావ ఫలితాలనుకుంటున్నప్పటికీ గత జన్మ కర్మల సంస్కా రాలే ఈ జన్మ స్వభావాలన్న సత్యాన్ని, వాస్తవాన్ని అంగీకరిం చక తప్పదు. గతం ప్రకృతి అయితే వర్తమానమే స్వభావం. నాటి ప్రకృతి ప్రతిబింబమే నేటి స్వాభావిక సంస్కారం.
ఇంతకీ కర్మాచరణ పరంగా మనం చేసే యోగ సాధన ఏమిటి? అంటే మమతాసక్తికి దూరం కావటమే కర్మయోగా నికి భూమిక. మన ఇంద్రియాలను, మనసును, బుద్ధిని, దేహా న్ని, అంత:కరణ శుద్ధిపరంగా వినియోగించటమూ యోగ సాధనే. ప్రాపంచిక, భౌతిక, దై#హక స్వార్థాన్ని వీడి నిష్కామ భావనతో యోగ జీవనాన్ని సాగించటమే కర్మయో గం. నిష్కామ భావనతోనే యోగ సాధ కులైతే కర్మ బంధనం నుండి విడివడగలం.
సాంఖ్య యోగ సాధన…జ్ఞాననిష్ఠ!
Advertisement
తాజా వార్తలు
Advertisement