తిరుమల, ప్రభన్యూస్ ప్రతినిధి: రెండేళ్ళ సుధీర్ఘ విరామం అనంతరం శ్రీవారి పుష్కరిణిలో భక్తులను పుణ్య స్నానాలకు అనుమతించింది టిటిడి కరోనా నివారణ చర్యలలో భాగంగా 2020 వ సంవత్సరం మార్చి 17 వ తేది నుంచి టిటిడి భక్తులను పుష్కరిణిలోకి అనుమతించడం నిలిపివేసింది. దీంతో దాదాపు 25 నెలల పాటు పుష్కరిణిలో స్నాన మాచరించే మహద్‌భాగ్యంకు భక్తులు దూరమవ్వగా ప్రస్తుతం కరోనా తీవ్రత పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టడంతో నిన్నటి నుంచి టిటిడి భక్తులను పుష్కరిణి స్థానానికి అనుమతిస్తుంది. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీనివాసుడు దర్శనార్ధం తిరుమలకు విచ్చేసే భక్తులు క్షేత్ర సంప్రదాయం అనుసరిం చి స్వామివారిని దర్శించుకుంటారు. క్షేత్ర సంప్రదాయం మేరకు పుష్కరిణిలో స్నానం, వరాహస్వామి దర్శనం, మహాప్రసాద స్వీకా రంతో తిరుమల యాత్ర సంపూర్ణత చేకూరు తుంది. దీంతో తిరుమల చేరుకున్న భ క్తులు ముందుగా స్వామివారి పుష్కరిణిలో స్నానం ఆచరించేందుకు ప్రాధాన్యత ఇస్తారు. కలి యుగ వైకుంఠ నాధుడి సన్నిధిలో ఉన్న కోనే రునే శ్రీస్వామి పుష్కరిణి అంటారు. బ్రహ్మాం డంలోని సర్వతీర్ధాలకు స్వామి వంటి ది కాబట్టి స్వామిపుష్కరిణి అనే నామధేయంతో తురుమల క్షేత్రంలో ప్రసిద్ది గాంచింది. అంతటి ప్రాశస్త్యం కలిగిన స్వామివారి పుష్కరిణి ఒకటిన్నర ఎకరాల వైశాల్యంలో ఉంటుంది. 1468 వ సంవత్సరంలో సాలువ నరసింహరాయులు పుష్కరిణి మధ్యలో నిరాళి మండపాన్ని నిర్మించారు. ఇక 15 వ శతాబ్దంలో తాళ్లపాక అన్నమయ్య కోనేరు మెట్లను నిర్మించారు. ఇక స్వామివారి పుష్కరిణిలో ప్రతి సంవత్సరం పాల్గుణమాసం పౌర్ణమి రోజుకు ముగిసేలా ఐదు రోజుల పాటు తెప్పోత్సవాలను నిర్వహిస్తారు. ఇక ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి పర్వదినం తరువాత రోజున, రథసప్తమి పర్వదినం రోజున, బ్రహ్మో త్సవాల చివరి రోజున అనంతపద్మనాభస్వామివ్రతం రోజున స్వామివారి పుష్కరిణిలో చక్రస్నానం కార్యక్రమాన్ని వైధికంగా నిర్వహిస్తుంది టిటిడి. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించే భాగ్యం కరోనా కారణంగా భక్తులకు దూరం అయింది. కరోనా తీవ్రత కారణంగా 2020 వ సంవత్సరం మార్చి 17 వ తేది నుంచి భక్తులను పుష్కరిణిలోకి అనుమతిం డాన్ని టిటిడి నిలిపివేసింది. మార్చి 20 వ తేది నుంచి శ్రీవారి ఆలయంలో దర్శనాలను కూడా నిలిపివేసిన, అటు తరువాత జూన్ 8 వ తేది నుంచి దర్శనా లను పునరుద్దరణ చేసినా పుష్కరిణిలోకి మాత్రం భక్తులను అనుమతించలేదు టిటిడి. కరోనా నివారణ చర్యలలో భాగంగా అంటూ పుష్కరిణిలోకి భక్తులను అనుమతించకుండా తాత్కాలింకంగా స్నానాది కార్యక్రమాలు చేసేందుకు పుష్కరిణికి సమీపంలోనే భక్తులకు ప్రత్యా మ్నాయంగా షవర్లను ఏర్పాటు చేసింది. పుష్కరి ణిలో స్నానమాచరించే అవకాశం లేక పోవడం తో పలువురు భక్తులు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షవర్ల వద్దే స్నానమాచరించి స్వామివారి దర్శనానికి వేళ్లే వారు.
ఇక ఈనెల 3 వ తేది నుంచి టిటిడి శ్రీవారి ఆలయంలో అంగ ప్రదక్షిణకు కూ డా భక్తులను అనుమతించడం ప్రారంభించింది. అంగ ప్రదక్షిణకి వెళ్ళే భక్తులు ఖచ్చితంగా తడి బట్టలతో వెల్లాలనే నియమం ఉండడంతో సాధారణంగా అంగ ప్రదక్షణకు వెళ్ళే భక్తులు పుష్కరిణిలో మునిగి అనంతరం అంగ ప్రదక్షిణకి వెళతారు. అయితే కరోనా నివారణ చర్యల్లో భాగంగా అంటూ టిటిడి పుష్కరిణి మూసివేసి ఉండడంతో అంగ ప్రదక్షిణకు వెళ్ళెె భక్తులు షవర్ల వద్దే స్నానం చేసి వెళ్ళేవారు. దేశ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పట్టి ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో పాటు కేంద్రం కూడా ఆంక్షలను ఎత్తివేయంతో దశల వారిగా తిరుమలలోని ఆంక్షలను సడలిస్తూ వచ్చిన టిటిడి ిచివరిగా పుష్కరణి వద్ద అమలు చేస్తున్న ఆంక్షలను బుధవారం నుంచి పూర్తిగా ఎత్తివేసింది. దాదా పు 25 నెలల అనంతరం బుధ వారం నుంచి పుష్కరిణిలోకి భక్తులను అనుమ తించడం ప్రారంభించింది. క్షేత్ర సాంప్రదాయం ప్రకారం వరాహస్వామివారిని దర్శించుకుని తదుపరి శ్రీవారిని దర్శించుకుంటున్నారు.
రెండేళ్ల తర్వాత శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు
Advertisement
తాజా వార్తలు
Advertisement