Tuesday, November 26, 2024

ధర్మం – మర్మం : పుణ్యతీర్థములు – ఋషి(ఆర్ష ) తీర్థములు (ఆడియోతో…)

ఋషి(ఆర్ష )తీర్థముల గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

ఋషి(ఆర్ష ) తీర్థములు :
బ్రహ్మపురాణం, గౌతమీ ఖండంలో నదీబేధాన్ని వివరిస్తూ ఋషి తీర్థము గూర్చి వశిష్టాది మహర్షులకు బ్రహ్మదేవుడు ఈ విధంగా వివరించెను.
దేవతలు నివసించే ప్రాంతాలలో ఋషులు తపస్సు చేస్తూ తమ స్నానాది విధులకు సృష్టించుకున్న జలాశయములను ఋషి తీర్థములుగా పేర్కొంటారు. ప్రభాసుడు, భార్గవుడు, అగస్తి, నరనారాయణులు, వశిష్ట మహర్షి, భరద్వాజుడు, గౌతముడు, కశ్యపుడు, మనువు, మొదలగువారు నిర్మించి, సేవించిన తీర్థములు ‘ఋషి'(ఆర్ష) తీర్థములు. మానుష తీర్థముల కంటే ఋషి తీర్థములు అధికంగా సర్వకామనలను ప్రసాదించును.

వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement