Wednesday, November 20, 2024

చిత్రవిచిత్రాల గణపతి ఆలయం

భారతదేశం అంటేనే అంతుచిక్కని మిస్టరీలకు పెట్టింది పేరు. భారతదేశం ఆధ్యాత్మికానికి నిలయం. దేశవ్యాప్తంగా అనేక గణపతి ఆలయాలు వున్నాయి. వాటిలో ఎన్నో అద్భుతమైన దేవాలయాలు దర్శనమిస్తూనే వుంటాయి. అయితే వీటిలో కొన్ని మిస్టరీతో మిళితమై ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అలాంటి ఆలయమే రంగులు మార్చుకునే మహాగణపతి ఆలయం. వినాయకస్వామి మాత్రమే కాదు ఆలయ ప్రాంగణంలో వున్న కొలనులో నీరు కూడా గణపతినే అనుసరిస్తున్నదా అనిపిస్తుంది. అంతేకాదు ఆ ఆలయ ప్రాంగణంలో వుండే మర్రిచెట్టు కూడా ప్రత్యేకమైనదే… ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ వుంది అంటే…
వక్రతుండ మహాకాయ… కోటి సూర్య సమ ప్రభ…
నిర్విఘ్నం కురుమే దేవ… సర్వ కార్యేషు సర్వదా…

అంటూ పూజిస్తే విఘ్నాలను తొలగించి శుభాలను కలిగించే దైవ స్వరూ పుడు మహాగణపతి. ఏ పూజ చేసినా ముందుగా పసుపుతో తయారుచేసిన గణ పతిని పూజించి, ఆ తర్వాత మిగిలిన పూజ చేయడం మన సంప్రదాయం. అటు వంటి విఘ్నరాజుకు మన దేశంలో అనేక మహిమాన్విత ఆలయాలున్నాయి. వాటి అన్నిటిలోకి ప్రత్యేకమైన అద్భుతమైన గణపతి ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని నాగర్‌కోయిల్‌ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఉంది. అదే శ్రీ మహాదేవర్‌ అతిశయ వినాయగర్‌ ఆలయం. అక్కడ వెలసిన వినాయకుడికి ఓ ప్రత్యేకత ఉంది. గుడి చాలా చిన్నదిగా అతి సాధారణంగా కనిపించినప్పటికీ దానికున్న ప్రత్యేకత విశిష్టమైనది. దానికి కారణం మూలవిరాట్టు అయిన వినా యకుడు ఆరు నెలలకు ఒకసారి తన రంగును తానే మార్చుకోవడం. అంతే కాదు ఈ వినాయకుడి విగ్రహం ఎటువంటి బాహ్య అలంకరణలు లేకుండా వుంటుం ది. వేల సంవత్సరాలు గడిచినా చెక్కు చెదరకుండా ఇప్పటికీ అలాగే వుంది. ఈ విగ్రహానికి వున్న మరో ప్రత్యేకత ఏమిటంటే- ప్రతి ఆరు మాసాలకు గణపతి విగ్రహం రంగు మారుతుంది. ఇది ఎలా మారుతుందో పరిశోధకులకు కూడా అంతుచిక్కలేదు. ఈ విగ్రహం ఉత్తరాయణ కాలంలో ఈ వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు. దక్షిణాయన కాలంలో తెల్లని రంగులో ఉంటాడు. ఇలా జరగడం దేవుని మ#హత్యం అని భక్తులు విశ్వసిస్తారు. అతిశయ వినాయగర్‌ ఆలయంలో మరో విచిత్రం కూడా వుంది. ఈ ఆలయం ప్రాంగణంలో ఓ మంచి నీటి బావి ఉంది. నీటికి రంగులేదన్న విషయం అందరికీ తలిసిన విషయమే. కానీ మిగిలిన చోట్ల మాటేమో కానీ ఇక్కడ నీరు కూడా రంగు దానిలోని నీరు కూడా ఆరు నెలలకు ఒకసారి రంగు మారుతుంది. కానీ వినాయకుడు తెల్లగా ఉన్న ప్పుడు నల్లగా, నల్లగా ఉన్నప్పుడు తెల్లగా ఉండటం విశేషం. ఈ అద్భుత వాస్త వాల కారణంగా ఈ ఆలయాన్ని మిరాకిల్‌ గణష్‌ టెంపుల్‌ అని కూడా పిలుస్తారు. అన్నింటికంటే ముఖ్యంగా ఈ ఆలయం చాలా సులభమైన పద్ధతిలో నిర్మించ బడింది. వాటితోపాటు మరో అద్భుతమైన విచిత్రం ఏమిటంటే సాధారణంగా శిశిర ఋతువులో చెట్ల ఆకులు రాలిపోతాయి. కానీ దట్టమైన అరణ్యాల కార ణంగా తమిళనాడు, కేరళకు చెందిన అరణ్యాలకు ఈ ఋతు బేధం వర్తించదు. ఈ ఆలయంలోని ఉన్న మఱ్ఱిచెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్త రాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని మిరాకిల్‌ వినాయకర్‌ ఆలయం అని కూడా పిలుస్తారు.

ఆలయ చరిత్ర

ఈ ఆలయ చరిత్ర ఏమిటంటే 12వ శతాబ్ద కాలంనాటి ఆలయం. 1317 సంవత్సరంలో నిర్మించారని, 2300 సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతారు. నిజానికిది శివాలయం. ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది. ఆ తర్వాతే ఈ ఆలయం నిర్మించడం జరిగింది. అందుకే ఈ ఆలయాన్ని శ్రీ మహాదేవర్‌ అతిశయ వినాయగర్‌ ఆలయం అని అంటారు. పాత కాలంలో ఈ ఆలయంపై వైష్ణవుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. అందువలన దీనిని అనేక మార్లు పునర్నిర్మించడం జరిగింది. దీనిపై కేరళ ప్రభుత్వం ఆధిపత్యం కూడా ఎక్కువగా ఉండేది. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆలయం తమిళనాడుకి చెందడంతో వారి ఆధిపత్యం తగ్గి, ఈ ఆలయం అభివృద్ధి చెందిందని చెబుతారు. ఈ ఆలయాన్ని చాలా సులభమైన పద్ధతిలో నిర్మించారు. అద్భుతమైన కట్టణా లు, శాసనాలు లేవు. ఇది సహజ సౌందర్యంతో చుట్టిముట్టి వుంటుంది.
భక్తుల జీవితాల్లో వున్న అన్ని చెడు ప్రభావాలను తొలగించే వినాయకుడుగా ఈ ఆలయానికి చాలా ప్రాముఖ్యత వుంది. భక్తులు స్వామివారికి పూజలు చేసి కొబ్బరికాయలు, బియ్యం, కుడుములు సమర్పిస్తారు. విగ్రహం రంగులు మారు తున్న సమయంలో స్వామిని ప్రత్యేకంగా పూజించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అలాగే బావిలో నీరు కూడా చాలా పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. ఈ నీరు అనేక చర్మ వ్యాధులను నయం చేస్తుందని భక్తుల విశ్వాసం.

Advertisement

తాజా వార్తలు

Advertisement