నుతజల పూరితంబులగు నూతులు నూరిటి కంటె సూనృత
వ్రత! యొక బావి మేలు; మఱి బావులు నూరింటి కంటె నొక్క స
త్క్రతువది మేలు; తత్క్రతు శతంబున కంటె నుతుండు మేలు; త
త్సుత శతకంబు కంటె నొక సూనృత వాక్యము మేలు చూడఁగన్
(శ్రీమదాంధ్ర మహాభారతము- ఆది- 4-96)
”సత్యవ్రతముకల ఓ రాజా! మంచి నీటితో నిండిన చేదుడు బావులు నూరిటి కంటె, ఒక దిగుడు బావి మేలు కాగా, అలాంటి బావులు నూరిటి కంటె, ఒక మంచి యజ్ఞము మేలు, అటువంటి నూరు యజ్ఞాల కంటే, ఒక కొడుకు మేలు, అలాంటి నూరుగురు కొడుకుల కంటె, ఒక సత్యవాక్యం మంచిది” అని భావం.
శకుంతల దుష్యంతుడి సభామందిరంలో ప్రవేశించింది. సింహాసనంలో కూర్చు ని ఉన్న దుష్యంతుడు, శకుంతలని ఎవరో వచ్చినట్టు చూసి పట్టించుకోలేదు. ఈ విష యాన్ని గమనించిన శకుంతల మూర్ఛిల్లింది. తెలిసికూడా తెలియనట్లే నటిస్తున్నాడు అని గ్రహంచింది. జరిగిన విషయం అంతటిని దుష్యంతునికి చెప్పి ఎలాగైనా ఇచ్చిన మాటను నెరవేర్చుకొని తీరాలని అనుకొని దుష్యంతునితో మాట్లాడిన సందర్భంలో శకుంతల నిండు సభలో ‘సూనృతవ్రత!’ అని సంబోధించడంలోనే శకుంతల ధైర్యం ద్యోతకమవుతుంది.
ఒకరోజు దుష్యంతుడు వేటకు వెళ్ళి వేటాడుతూ ఒక తపోవనానికి చేరుకున్నాడు. అది మహర్షి కణ్వాశ్రమం. మహర్షి దర్శనార్థం ఆశ్రమంలోకి ఒంటరిగా వెళ్లిన దుష్యం తుడు, అక్కడ సౌందర్యవతి అయిన కణ్వమహర్షి పెంపుడు కూతురు శకుంతలను చూ సాడు. ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు. శకుంతలనూ దుష్యంతుని అందం ఆకర్షిం చింది. పరస్పర పరిచయాలయ్యాక ఆమె కణ్వమహర్షి కూతురని తెలుసుకున్నాడు. దుష్యంతుడు శకుంతలతో బ్రహ్మచారి అయిన కణ్వమహర్షికి కూతురెలా కలిగిందని సందేహం వెలిబుచ్చాడు.
ఒకానొకసారి ఘోర తపమాచరిస్తున్న రాజర్షి విశ్వామిత్రుని తపస్సును భగ్నం చేయటానికి ఇంద్రుడు మేనకను నియోగించాడు. ఆమె ప్రయత్న ఫలితంగా వారిరువు రికి ఒక ఆడశిశువు జనించగానే మేనక ఇంద్రలోకానికి వెళ్ళింది. విశ్వామిత్రుడు ఆ శిశు వును వదలి తపోభూమికి వెళ్ళాడు. ఆ తరవాత శకుంత పక్షులచే రక్షింపబడుతున్న ఆడశిశువును చూసిన కణ్వుడు ఆమెకు ‘శకుంతల’ అను నామకరణం చేసి తన కన్నబి డ్డవలె చూసుకున్నాడు. శకుంతల క్షత్రియ కన్య అని తెలుసుకున్న దుష్యంతుడు ఆమె మీద మనసుపడి గాంధర్వ విధిని వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో శకుం తలకు పుట్టిన బిడ్డను చక్రవర్తిని చేస్తానని వాగ్దానం చేసాడు. రాజలాంఛనాలతో ఆమెను రాజధానికి తీసుకువెళతానని మాటిచ్చి రాజధానికి వెళ్ళాడు. కణ్వమహర్షి ఆ విష యం దివ్యదృష్టి ద్వారా గ్రహంచి వారి వివాహానికి అనుమతించి శకుంతల పుత్రుడు చక్రవర్తి కాగలడని దీవించాడు. ఆపై శకుంతలకు ఆమె పుత్రుడు మహాబలవంతుడై ఆయురారోగ్య ఐశ్వర్య వంతుడు కాగలడని వరం ప్రసాదించాడు. మహర్షి మాటలను నిజంచేస్తూ శకుంతలకు మహాబలవంతుడైన భరతుడు చక్రవర్తి లక్షణాలతో జన్మించా డు. భరతుడు మహాబ లవంతుడు. చిన్నప్పుడే, అడవిలో ఉండే పులులను సింహాలను, ఏనుగులను పట్టితెచ్చి చెట్లకు కట్టేసేవాడు. ఏనుగులపైన స్వారీ చేసేవాడు. అతని చేష్ట లను చూసి ఆశ్రమంలో ఉన్న మునులు అతనికి ‘సర్వదమనుడు’ అని పేరు పెట్టారు. కణ్వమహర్షి శకుంతలను అత్తవారింటికి పంపడం ఉచితమని భావించి శిష్యులను తోడిచ్చి ఆమెను కుమారునితో సహా దుష్యంతుని వద్దకు పంపాడు. దుష్యంతుడు శకుం త లను తెలియనట్లు నటిస్తూ ఆమెను నిరాకరించాడు. అప్పుడు శకుంతల దుష్యంతు నితో చెప్పిన నీతి వాక్యాలు. ”ఓ రాజా, ఆరోజు నువ్వు వేటకు అడవికి వచ్చావు. నా తండ్రి కణ్వ మహామునిని దర్శించుకోవడానికి మా ఆశ్రమానికి వచ్చావు. నన్ను చూసావు. మోహంచి, గాంధర్వ విధిని వివాహమాడావు. నాకు పుట్టబోయె కుమారుని రాజును చేస్తాను అన్నావు. ఇడుగో నీ కుమారుడు” అని తన కుమారుడు భరతుని చూపించింది.
ఇది అంతా చూసాడు దుష్యంతుడు, అతనికి అంతా తెలుసు కాని ఏమీ తెలియని వానివలె ”నీవు ఎవరివో నాకు తెలియదు, నేను నిన్ను ఎప్పుడూ చూడలేదు. నీవు ఎక్కడ నుండి వచ్చావో అక్కడకు పో” అని అన్నాడు. శకుంతలకు దు:ఖం పొర్లుకు వచ్చింది.
”ఓ మహారాజా! అన్నీ తెలిసికూడా ఏం తెలియనట్టు నటించకండి. మీలాంటి ధర్మాత్ములు ఇలాంటి అబద్ధాలు ఆడడం చాలా తప్పు. మనిషి ప్రవర్తనను పంచభూతా లు, వేదాలు, సూర్యచంద్రులు నిత్యము గమనిస్తూనే ఉంటారు. వాళ్ల నుండి ఈ సత్యా న్ని మీరు దాచలేరు. భార్యను కుమారుడిని స్వీకరించలేని వాళ్ళు ఇహ లోకంలోనూ… పర లోకంలోనూ చోటు సంపాదించలేరు” అని చెప్పి, భార్యాభర్తల దాంపత్యం గురించి మాట్లాడింది. ”భార్యాభర్తలు సగం సగం. భర్త భార్య యందు ప్రవేశించి పుత్రుడికి జన్మ నిస్తాడు అయితే, అలాంటి ఈ కుమారుడిని నీవు స్వీకరించాలి. స్వీకరించి…, కౌగిలిం చుకొని పుత్ర గాత్ర పరిష్వంగ సుఖం అనుభవించు” అని శకుంతల కోరింది.
పై విషయాలన్నీ చెప్పి ”ఇలాంటి ఉత్తముడైన నీ కుమారుని వద్దు అనుకోవడం సరైనది కాదు. నూరుమంది కుమారుల కంటే సత్యం గొప్పది. 1000 అశ్వమేధాలకంటే సత్యం గొప్పది. సర్వతీర్థాలను సేవించడం కంటే సత్యం గొప్పది. వేదాలను చదవడం కంటే సత్యం గొప్పది అని పురుషులు చెప్పినట్లు ఆ సత్యాన్ని అసత్యం చేయకు రాజా! నీవు ఇచ్చిన మాటను నిలబెట్టుకో” అని అతణ్ణి ఒప్పించడానికి శాయశక్తులా కృషి చేసింది.
శకుంతలను వదిలించుకోవడానికి చివరి అస్త్రంగా దుష్యంతుడు ”నేనెక్కడా? నీవె క్కడా? అసలు నేను నిన్ను చూడలేదు. అబద్ధాలు నిజం అయిపోవు. ఇలాంటి మాటలు వింటే ప్రజలు నవ్వుకుంటారు. గనుక, ఇక్కడ నుంచి వెళ్ళిపో” అని దుష్యంతుడు శకుం తలకు ఆజ్ఞాపించాడు, ఈ మాటలు విన్న శకుంతల చాలా దు:ఖంతో తన మనసులో నేను పుట్టినప్పుడు అమ్మానాన్న వదిలిపెట్టారు. భర్తకి కూడా ఇప్పుడు దూరం అవు తున్నాను. పోయిన జన్మలో మంచి నోములు చేయలేదో ఏంటో! ఇన్ని సమస్యలు నాకే జరుగుతున్నాయి అని తన మనసులో దు:ఖించి తన బిడ్డతో సహా ఆ సభ నుంచి వెళ్లిపో వడానికి సిద్ధమయ్యింది. అప్పుడు ఆకాశం నుండి ఒక వాక్కు వినిపించింది.
”గొనకొని వీడు నీకును శకుంతలకుం బ్రియనందనుండు సే
భరియింపు మీతని శకుంతల సత్యం వల్కెసాధ్వి స
ద్వినుత మహాపతివ్రత వివేకముతోనని దివ్యవాణి దా
వినిచె ధరాధునాథునకు విస్మయమందగ దత్సభాసదుల్”
”ఓ దుష్యంత మహారాజా! శకుంతల నిజమే చెప్పింది. ఈ శకుంతల నీ భార్య, ఈ భరతుడు నీకు, శకుంతలకు పుట్టినవాడు. వీరిని స్వీకరించుము” ఇది విని దుష్యంతుడు లేచి సభలో ఉన్నవారితో ఇలా అన్నాడు.
”సభాసదులారా, ఆరోజు నేను శకుంతలను గాంధర్వ విధిని వివాహమాడినాను, నాకు ఈమెకు తప్ప వేరే ఎవరికి తెలియదు. లోకనిందకు వెరిచి ఇప్పటిదాకా ఈమె నాకు తెలియదు అన్నాను. కాని ఇప్పుడు ఆకాశవాణి అందరకూ నిజం తెలియచేసింది. నేను నా బార్యాపుత్రులను స్వీకరిస్తున్నాను” అని పలికి, శకుంతలను, భరతుని సాదరంగా స్వీకరించాడు. భరతుని యువరాజుగా చేసాడు. కొంతకాలం రాజ్యసుఖాలు అనుభ వించి, కుమారుడైన భరతునికి రాజ్యం అప్పగించి, భార్యతో తపోవనానికి వెళ్లాడు. తన వాక్చాతుర్యంతో విజయం సాధించిన శకుంతల వ్యక్తిత్వం మనకు తేటతెల్లమవుతుంది.
ధర్మాన్ని అనుసరిస్తే అది ఏదో ఒక రూపంలో నిన్ను కాపాడి తీరుతుంది. శకుంతల ధర్మపరివర్తన కలిగినది. అందుకే ఆ ధర్మదేవత సరైన సమయంలో రక్షించినది. అంత టి ధీరోదాత్త శకుంతల. అందుకే ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. రక్షిత: ధర్మ: రక్షతి. రక్షించబ డిన ధర్మం తప్పక రక్షిస్తుంది.
శకుంతల వ్యక్తిత్వం
Advertisement
తాజా వార్తలు
Advertisement